సంధ్యా రాగం చంద్ర హారతి పడుతున్న వేళ
మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభ ముహూర్తాన
తొలిసారి బ్లాగు లోకం చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కవితలు .............
అని ఆడుతూ పాడుతూ రాసేద్దాము అనుకున్నాను .టపా రాయడం అంత సులువు కాదని
మొదలు పెట్టాక తెలిసింది .ఏమి రాయాలా అని పెన్నుతో బుగ్గమీద పదిసార్లు బుర్ర మీద పది
సార్లు కొట్టుకుంటూ ఆలోచిస్తూ రాయడం మొదలు పెట్టాను. నేను కంప్యూటర్ తో పని చేసె తొలి
రోజుల్లో మోనిటర్ మీద ఒక చిన్న బొమ్మ బుర్ర గోక్కొంటూ , కళ్ళు మిటకరిస్తూ వచ్చి
Iam Help Assistant .You need any help? అని అస్తమాను విసిగించేది . ఒక సారి
చిరాకు వచ్చి నాకు ఎవ్వరి సహాయం అక్కర్లేదు నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని గట్టిగా
వార్నింగ్ ఇచ్చాను . అప్పటి నుండి దానికి నాకు సత్సంభంధాలు లేవు . బంగారు కంచానికైన
గోడ అవసరం అన్నట్టుగా నాకు ఈ రోజు దాని సహాయం అవసరమైంది . ఆత్మాభిమానం అడ్డొచ్చిన
అడగక తప్పలేదు. అదే style లో తిప్పుకుంటూ వచ్చింది భామ . ఎంత ప్రయత్నించిన ఏమి
రాయలేక పోతున్నాను నువ్వు సాయం చేసావంటే పెద్ద బ్లాగర్ ని అయిపోతాను సాయం చెయ్యవా
అని ఆశగా అడిగాను . బుర్ర మీద పది సార్లు తట్టి లేపడానికి నీ బుర్ర లో ఏముందే ముందు
పెన్ను లో రీఫిల్ లేదు దాని సంగతి చూడవే తింగరి మొహం అని వెక్కిరించి వెళ్ళిపోయింది .
అది తింగరి మొహం అన్నందుకు నాకు బాదగా లేదు. నేను రాసే టపాలు చదివి ఇది
బ్లాగు లోకం లో ఉండవలిసింది కాదు ఏ మాలోకం లోనో పడెయ్యాలి అని స్కూలు లో
మొద్దు పిల్లలందరిని చివరి బెంచీలో కుర్చో పెట్టినట్టు నన్ను ఓ మూలకి తోసేస్తారేమో అనే
భయంతో వెంటనే మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నా తెలివితేటలు నాకు ఇవ్వవే అని గారంగా
అడిగాను . మా అమ్మ వద్దు బంగారం అవి పెళ్ళిళ్ళకి పండుగలికి పెట్టుకోవాలి కాని ఎప్పుడు పడితే
అప్పుడు పెట్టుకుని తిరిగితే అందరు దిష్టి కొడతారు . చిన్నపిల్లవి ఎక్కడైనా పారేసుకొంటావు
అని ముద్దుగా చెప్పింది. అయినా వినకుండా బ్లాగు లో పెట్టాలి ఇవ్వమ్మా అని మారం చేసాను.
చక్కగా బీరువాలో దాచినవి తీసుకెళ్ళి అక్కడ పెడతాను ఇక్కడ పెడతాను అంటావేమిటే తింగరి
మొహం అని కోప్పడింది . ఎవరూ సాయం చేయకపోయిన ఎంతమంది తింగరి మొహం అని ఎగతాళి
చేసినా మా బ్లాగర్లు అలాంటి వివక్షత చూపించే వారు మాత్రం కాదని
పెన్ను లో రీఫిల్ వేసేసాను ధైర్యం గా ............
చేసినా మా బ్లాగర్లు అలాంటి వివక్షత చూపించే వారు మాత్రం కాదని
పెన్ను లో రీఫిల్ వేసేసాను ధైర్యం గా ............

21 comments:
శుభం..ఓం.విఘ్నరాజాయనమహ...
బ్లాగులోకానికి సుస్వాగతం..
శ్రీ లలిత గారు ధన్యవాదములండి. తొలి కామెంట్ మీరే పెట్టారు .
ఇక్కడ మిమ్మల్ని ఎవరూ ఏమనరు. వెక్కిరించరు. ఇంచక్కా మీరు రాయాలనుకున్నవా రాసుకోండి. తప్పులుంటే సరిదిద్దుతారు, బావుంటే బేష్ అంటారు. సాయమడిగితే కాదనరు..
అవిఘ్నమస్తు.. బ్లాగ్లోకానికి సాదర ఆహ్వానం...
జ్యోతక్క ! మీకొక విషయం తెలుసా ! మీ బ్లాగ్ లో ఉన్న sridhar గారి సాంకేతిక సహాయం నుండే నేను బ్లాగ్ ఎలా creat చేసుకోవాలో తెలుసుకున్నాను.Thanks alot both of you
Kishen welcomes you to telugu bloggers world heartfully...U will rockkkk...
Oka chinna salaha ivvana?...sorry salahalu...
1. Select nice template..u can search in google for an excellent temple
2. Keep some interesting widgets (like visitor counter etc)
3. Always enable comment moderation.
hmm oka challe..maree ekkuva salahalu ichesanemo...
Kishen Reddy gaaru Thanks alot. మీ అందరి సలహాలు నాకు చాల అమూల్యమైనవి sir . మీరు చెప్పిన సూచనలు follow అవుతాను
మీ శైలి బాగుంది.
ఈ వాక్యానికి బలే నవ్వొచ్చింది.
‘‘నా తెలివితేటలు నాకు ఇవ్వవే అని గారంగా
అడిగాను . మా అమ్మ వద్దు బంగారం అవి పెళ్ళిళ్ళకి పండుగలికి పెట్టుకోవాలి కాని ఎప్పుడు పడితే
అప్పుడు పెట్టుకుని తిరిగితే అందరు దిష్టి కొడతారు . చిన్నపిల్లవి ఎక్కడైనా పారేసుకొంటావు ’’
రాస్తూ ఉండండి శివరంజనీ.
Thanks alot దీప . మీ పేరు నాకు చాలా బాగా నచ్చింది.మీరు బ్లాగర్ అయితే మీ బ్లాగ్ లింక్ ఇవ్వండి
భలే ! బాగా రాసారు ..రాసే శైలి బాగుంది ...ఇంతా చేసి తెలివి తేటలు బీరువా లో నుండి తీసుకున్నారా ? :))
చాలా బాగా వ్రాస్తున్నారు. మీ template లో ఏదో లోపమున్నట్లు ఉంది. comments page సరిగా open కావటం లేదు.www.finalsense.com లో మంచి templates ఉన్నాయి. అవి try చేయండి,లేకపోతే జ్యొతి గారి నడిగితే చేసిపెడతారు.
నీహారిక గారు Thanks for your comment & suggestion ... మీరు చెప్పినట్టే టెంప్లెట్ మార్చాను .. ఇప్పుడు ఎలా వుందో చూసి చెప్పండి.. .Once again thank you very much...
రంజని గారు,
ఇక template తో ఇబ్బందులు ఎమీ లేనట్లె కదా?
౩ column template select చెసారు కదా 2 column template మర్చి చూడండి. ఇది బాగానే ఉంది.
నీహారిక గారు శ్రమ అనుకోకుండా మీరు ఇస్తున్నా suggestions కి ఎలా థాంక్స్ చెప్పుకోవాలో తెలియడం లేదు...
శివరంజనిగారు,
మీ బ్లాగుకు ఇప్పుడు 4 కాలమ్స్ తీసుకున్నారు. 2 కాలమ్స్ సరిపోతాయి. మార్చి చూడండి..
@జ్యోతి గారు మీరు చెప్పినట్టే adjustments చేసానండి...ఇలా మీరు, నిహారిక గారు చేయిపట్టి దిద్దించినట్టుగా చెబుతుంటే చాలా సంతోషం గా అనిపించింది నా మనసుకి.....
chaala bavavundi..
ఏంటీ.. తెలివితేటలు ఎప్పుడైనా పండక్కి పెట్టుకుంటూ ఉంటారా? :) అసలు ఎలా వచ్చిందండీ మీకు అలా రాయాలన్న ఐడియా? :)
బ్లాగు పరిచాయమయ్యాక ఇన్ని రోజులకు చదువుతున్నా మొదటి టపాను.....Excellentగా రాసారు.
లంగా ఓణీలు మువ్వల పట్టీలనుకుంటొచ్చిన పిల్లా
రాస్తుండాల గిసొంటి కతలు మల్ల మల్ల
బ్లాగ్ ప్రవేశ మహోస్త్సవము :
Hello all,
You are invited to view my blog 'ennela' and gift some comments on the occation of 'blog opening ceremony'
Thanks for your time
Ennela
Post a Comment