అది నాలుగు వందల సంవత్సరాల క్రితం విషయం మాత్రం కాదు . త్రేతా యుగం లో ఉన్నప్పటి మాట . రాముడికి రావణుడికి యుద్ద సమయం . కుంభకర్ణుడు ( అలియాస్ నేను ) బారక్ ఒబామా లా శాంతి నే కోరుకుంటూ ఎప్పుడూ యుద్దాలు జోలికి వెళ్ళకుండ సుష్టుగా తిని ఉల్లాసంగా ఉత్సాహంగా నోబెల్ బహుమతి కోసం కలలు కంటూ నిద్ర పోయేదాన్ని.
అలా జీవితం మూడు పూటలా తిండి ఆరు పూటలా నిద్ర లా గడిచి పోతుంటే one bad morning రాముడి తో యుద్దం చెయ్యి అని రావణుడి నుండి నాకు SMS వచ్చింది . అంతా వాడి పిచ్చి కాని నేనసలె నిద్ర మొహన్ని ఎలా గెలుస్తాను. సీన్ క్లైమాక్స్ లో రాముడికి ice పెట్టడం మొదలు పెట్టాను. నిద్ర పోతుంటే బలవంతంగా మోసుకొచ్చారే కాని నాకు నీతో యుద్దం చేసే ఉద్దేశం ఏ మాత్రం లేదు .
ప్లీస్ రాము నిన్ను చూస్తుంటే కలర్ తక్కువైనా మహేష్ బాబు లా క్లాస్ గా కనిపించే నువ్వు నన్ను నా నిద్రని మద్యలోనే చంపద్దు అని వేడు కోవడం మొదలు పెట్టాను . దెబ్బకి రాముడు ప్లాట్ అయిపోయాడు . కోరికలు తీరకుండా మనుషులు చనిపోతే ప్రేతాత్మలు అవుతారు. వీడసలే రాక్షసుడు వీడి కోరిక తీరక ఛస్తే ఏమవుతాడో నా నిద్రకేమైనా ఆటంకం కలిగిస్తాడేమో అని భయపడ్డాడు .
సరే కుంభకర్ణా నాకు నా తమ్ముడు వేరు శత్రువు తమ్ముడు వేరు కాదు, ఇద్దరూ సమానమే . నాదంతా భిన్నత్వం లో ఏకత్వం. నీ కోరిక తప్పక తీరుతుంది. వచ్చే జన్మ లో ఆడ పిల్ల గా పుట్టి నీ నిద్రని పరిపూర్ణం చేసుకోమని వరమిచ్చిన దేవుడు మరలా మాట వరుసకి కూడ కనిపించలేదు ఇప్పటికీ. నా పూర్వ జన్మ సుకృతం వల్లనో లేక మగధీర సినిమా చూడడం వల్లనో నాకు కూడ నా జన్మ రహస్యం గుర్తుకొచ్చేసింది . కొందరు బ్రతకటం కోసం తింటారు. మరి కొందరు తినటం కోసం మాత్రమే బ్రతుకుతారు . కాని నేను మాత్రం నిద్రకోసమే బ్రతుకుతున్నాను . చేతిలో ప్రసాదం పెట్టి నోటికి అడ్డుపడినట్టుగా నిద్ర అనే గొప్ప వరాన్ని నేను గత జన్మ లో సాధించుకున్నా ఈ జన్మ లో మాత్రం దాన్ని సార్ధకత చేసుకోలేక పోతున్నాను మా అమ్మ వల్ల.
మా అమ్మ తెల్లవారు ఝామున నాలుగు గంటలకి లేచి ఏడు గంటలకే పనులన్ని సర్దేసి నాతో పాటు ముక్కోటి దేవతలకి మేలుకొలుపులు మొదలు పెడుతుంది . ఏ తెల్లవారు ఝాము వేళలో అంటే సుమారుగా 8 గంటల కి జో అచ్యుతానంద......... జో..... జో..... ముకుందా అని మా అమ్మ జోల పాడుతున్నట్టు , ప్రేమగా ఇంకో గంట పడుకోబెడుతున్నట్టు కలలు కనేస్తూ తన్మయత్వం తో నిద్ర పోతూ ఉంటే సరిగ్గా అదే టైం లో మధురంగా వినిపిస్తుంటాయి మా అమ్మ జోలపాటలు/మేలుకొలుపులు . ఓం మాధవాయ నమః మీకసలు బుద్ది లేదు పిల్లలని నెత్తికి ఎక్కించుకున్నారు .
ఓం శ్రియాయై నమః ఆడ పిల్ల ఎక్కువసేపు పడుకోకూడదే రేపు అత్తారింటి దగ్గర నన్ను ఛీ అంటారే .
ఓం విష్ణవే నమః ఇక లేస్తావా గంట తో బుర్ర పగలగొట్టేయమంటావా
ఇలా లక్ష్మీ అష్టోత్తర , విష్ణు సహస్రనామాలతో మారు మోగిపోతూ ఉంటుంది మా ఇల్లు .
హే కృష్ణా ! ముకుందా ! మురారి !ఈ స్తోత్రాలు ఎలా వింటున్నావు తండ్రి అయినా వినేది నువ్వే నిమిత్తమాత్రురాలిని నేనెంత స్వామి అని ఏ మాత్రం బెదర కుండా అలాగే పడుకుంటాను . నిండు కుండ తొణకదు! తాటాకు చప్పుల్లకి సింహం మేలుకోదు ! అందులోనూ నాకు భూదేవంత సహనం మరి .
ఎవరైనా ఏదైనా సాధించాలనే లక్ష్యం పెట్టుకుంటే దాని పట్ల క్రమశిక్షణ,పట్టుదల, భాద్యత ఉండాలి లక్ష్యాన్ని సాధించేవరకు ఎన్ని కష్టాలు , విమర్శలు ఎదురైన చిరునవ్వు తో సాగి పోవాలి. అందుకే నిద్ర విషయంలో ఎన్ని కష్టాలకైన ఎదురెళ్ళి పోరాడతానే కాని నేనెప్పుడు నిద్ర విషయంలో అలక్ష్యంగాను భాద్యతా రాహిత్యంగాను ప్రవర్తించలేదు . నా నిద్ర కి మా అమ్మ తిట్లకి మద్య పావులా మారేది మా నాన్నే . ప్రపంచం లో ఏ వింత జరిగిన దానికి కారణం మా నాన్నే అంటుంది మా అమ్మ . పోనిలే మా నాన్న ని సంతోష పెడదామని ప్రతి రోజు నిద్ర లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను .
శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయలన్నట్టు నిద్ర లేవడం పిల్లి కనిపించకపోయిన పిల్లి కనిపించిదమ్మా అని చెప్పి పడుకోవడం , కొంత సేపటి తరువాత మరలా లేవడం ఎవరో తుమ్మేరు అని చెప్పడం ఒకవేళ ఎవరు తుమ్మక పోతే నేనే ఓ తుమ్ము తుమ్మి పడుకుంటాను . కొంత సేపటి తరువాత మరలా లేవడం . కాలు తిమ్మిరెక్కింది , మెడ నొప్పెట్టింది ఇలా సాకులు చెబుతూ పూర్తిగా నిద్ర పోవాలంటే మా అమ్మ కి భయపడి అలాగని లేవలేక ఇలా installments లో నిద్రపోతుంటాను .ఇంత చెర అనుభవిస్తున్నా నేనెప్పుడు భాదపడలేదు . నా నిద్రే నాకు జీవిత భాగస్వామిలా తయారయ్యింది . నిద్ర కోసం చేసే ఈ యాక్టింగ్ సినిమాలలో చేస్తే ఈ పాటికి ఓ అరడజను ఆస్కార్ అవార్డులు కొట్టేసేదాన్ని.
నోచుకున్నంత వారికి నోచుకున్నంత మహదేవ అని నా నోము ఇలా తగలబడితే ఎవరిని అనుకుని ఏమి లాభం అని నా దురదృష్టాన్ని తిట్టుకుంటూ దేవుని మందిరం దగ్గర కి పోయి ధ్యానం చేసుకుంటాను దేవుడంటే ఎంత భక్తి దేవున్ని ద్యానించకుండా కళ్ళు కూడా తెరవదే నా కూతురు అని మురిసిపోతూ నన్నే మాత్రం డిస్ట్రబ్ చేయదు మా అమ్మ . నేను కూడా అంతే దేవున్ని ఏ మాత్రం డిస్ట్రబ్ చేయను . దేవుని మందిరం దగ్గర కూర్చునే నిద్ర పోతాను .
ఆ విఘ్నేశ్వరుడు నిద్ర కి ఏ విఘ్నాలు కలిగించకపోయినా కూర్చుని నిద్ర పోవడం అంత comfortable గా ఉండదు . దానితో గదులు ఊడ్చుదామనే వంకతో చీపురు తీసుకుని మంచం క్రిందకి వెళ్ళి పడుకుంటాను . మా ఇంటిలో రెండు డబుల్ కాట్ లు కలిపి వేసుంటాయి. అందుకే దాని క్రింద పడుకుంటే మా అమ్మకి కనిపించే ఛాన్సు లేదు, దోమల సమస్య ఉండక మంచి comfort గా ఉంటుంది . నిద్ర కి అన్యాయం చేయలేక భాదపడుతూ నేను నిద్ర పోతుంటే నా భాద అర్ధం చేసుకోలేని మా చెల్లెలు ఓర్వ లేక ఏదో గొప్ప విషయం కనిపెట్టేసిన డిటెక్టివ్ లా ఫోజిస్తూ తుడిచిన గదులేమి తుడుస్తావులే కాని మంచం క్రింద నిద్ర పోయింది చాలు బయటికి తగలడు అని పెద్ద నోరేసుకుని వీధి చివరికి వినిపించేలా అరుస్తుంది .
అమ్మో మా అమ్మ కి వినిపించిందంటే నా చెవులు విమానం మోతే. విమానం అంటే గుర్తొచ్చింది కలలో ఇలలో ఎపుడూ మా అమ్మ పాటలు తప్ప చెవి ఎత్తి మరేమి ఆలకించని నాకు తరచు విమానం మోత వినిపించడం మొదలయ్యింది . కారణం తెలియక చెవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెవిలో విమానలు తిరుగుతున్నాయి అని చెప్పాను . మరేం పర్వాలేదు చెవిలో ఒక ఎయెర్ పోర్ట్ కట్టి పడేయమన్నాడు . ఎయెర్ పోర్ట్ కట్టే తాహతు లేదని ఎంత ప్రాధేయపడిన వినిపించుకోలేదా చెవి ( టి ) డాక్టర్ . ఈ హఠత్ పరిణామానికి షాక్ తో కళ్ళు తిరిగి పడిపోదాము అని అనుకున్నాను ఈ లోపు నిద్ర వచ్చి అక్కడే నిద్ర పోయాను .
ఓహ్ ............. నా జీవితం లో నిద్ర లేవడం ఆఫీస్ కి వెళ్ళడం తప్పనిసరి పనులు అయిపోయాయి . ఫ్రెండ్స్ అందరూ ఆదివారం మీ ఇంట్లో ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా అని అడుగుతారు . కాని నేను మెలకువ గా ఉన్నప్పుడు వచ్చిన పండుగలలో ఈ ఆదివారం అనే పండుగ ఎప్పుడూ రాలేదు ఈ పండుగ విశిష్టత ఈ ఉత్సవం ఎలా జరుపుకుంటారో నాకు తెలియదు .
కాలం చాల విలువైనది అందుకే ఫార్మాలిటి గా పళ్ళు తోముకోవడానికి లేస్తానే తప్ప సెలవు రోజులు వేస్ట్ చేయడం నాకస్సలు ఇస్టం ఉండదు . కొన్ని ఆఫీస్ లలో ఉద్యోగస్తులు silence please అనే బోర్డ్ ఎదురుగా పడేసుకుని చక్కా నిద్రపోతారు అని విన్నాను అలాంటి వారందరు గత జన్మలో బంగారు పూలతో రాముడికి పూజ చేసుకుని ఉంటారు . నాకా రాత లేదు అంతటి అదృష్టం రాదు .
ఎప్పుడు ఏదో మానసిక భాద ప్రపంచంలో ఉన్న నిద్ర అంతా నాకే సొంతం కాలేదన్న అసంతృప్తి నాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది . హే ! రామ చంద్ర ప్రభూ కూటి కోసం కోటి విద్యలు అన్నారు కాని నిద్ర కోసం నా చేత ఇన్ని విద్యలు చేయిస్తానంటే ఆ రోజు నువ్విచ్చిన వరాన్ని తిరస్కరించేదాన్ని ఈ జన్మ కోరుకునేదాన్ని కాదు .
ఆవ్ ....... మళ్ళి ఆవలింతలు చాలా సేపటి నుంచి టైప్ చేస్తున్నాను కదా నిద్ర చంపేస్తుంది టైప్ చేస్తూ మద్యలో కనుక నేను నిద్ర పోతే అన్యధా భావించకుండా కొంచెం కంప్యూటర్ shut - down చేసి పెట్టు శ్రీ రామ చంద్ర ప్రభూ....
Monday, 19 October 2009
Subscribe to:
Post Comments (Atom)

40 comments:
మీ చెవిలో కట్టే ఎయిర్ పోర్ట్ కన్నా ఎన్టీవోడి పేరుపెట్టండి.
బావుందండీ. keep going :)
నాది ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టని సమస్య. పక్క వూర్లొ చీమ చిటుక్కుమన్నా ఇక్కడ నాకు మెలకువ వచ్చేస్తుంది :(((
Hilarious !
:)
నిద్రోపాఖ్యానం బాగుంది. అదృష్ట వంతులు. ఊర్మిళా దేవి వారసులన్నమాట. .Keep it up.
మీ బాపతే నేను కూడా, ఎవరయినా నా నిద్ర గురించి కామెంట్ వేస్తే "నిద్ర అనేది దేముడు మనుషులకు ఇచ్చిన వరం, ఆ వరం నాకు ఎంతో ఇష్టం గా కొంచం ఎక్కువ ఆ దేముడు ఇచ్చినందుకు కుళ్ళుకోకండి" అని మరీ చెప్పి తొంగుంటాను. నిద్ర వస్తుంది మరి సెలవ్ :)
విజయ్ మోహన్ గారు , రాణి గారు , రిషి గారు , శ్రావ్య గారు , రావు గారు , అజ్ఞాత గారు అందరికి ధన్యవాదములండి.
అజ్ఞాత గారు లోకంలో నేనొక్కదాన్నే నిద్రపోతున్నాను అని అనుకుంటారు మా అమ్మ ఈ విషయం మా అమ్మ కి చెప్పండి
అయ్య బాబొయ్ రిషి గారు మీరు నా పొస్ట్ చదివారంటే నిజంగా నేను బంగారు పూలతో పూజ చేసుకున్నాను అన్నమాట . నిజం గా నాకు రాయడం వచ్చా సార్ ! మీరందరు నా పొస్ట్ చదవగలిగేలా ఉందా ?
Nice one. Keep going :)
హ హా బాగుంది మీ నిద్ర కథ
భలే రాసారు..నిజంగానే నిద్ర అనేది దేవుడు మీకు ఇచ్చిన వరం.. :)
అంతగా నిద్రపోతారా ?
బ్లాగాగ్ని గారు , చైతన్య గారు , నేస్తం గారు , అజ్ఞాత గారు ధన్యవాదములండి . అజ్ఞాత గారు నాది ఎక్కువ నిద్రే కాని మొద్దు నిద్ర కాదండి .
నా బ్లాగ్ ని నన్ను ఆశీర్వదించిన మీకు once agin thanks alot
హ హ హ ... బావుంది.. కీప్ ఇట్ అప్.
nenu jeevitham lo annitikanna ekkuva preminchedi 'nidrapovadanni'....meeru nanne minchipoyaaru...The way you narrated is excellent and hilarious..keep rocking ranjani...
super ga undi
వచ్చే జన్మ లో ఆడ పిల్ల గా పుట్టి నీ నిద్రని పరిపూర్ణం చేసుకోమని వరమిచ్చిన దేవుడు మరలా మాట వరుసకి కూడ కనిపించలేదు ఇప్పటికీ
:):):):)
NICE TOPIC
Good expression
మొదలుపెట్టిన అంశాన్ని చక్కగా మలిచి చివరివరకు నడిపించారు
1975-77 మద్య నేను ఇంటర్మీడియెట్ చదువుతున్నరోజుల్లో హిందీ క్లాసులో ఒక అమ్మాయి ఉండేది
చాలా సంవత్సరాలు అయ్యిందికదా పేరు గాని, ముఖంగాని గుర్తు లేవు
మనసులో మెదిలింది.
నిజమే! నిద్ర దేవుడిచ్చిన వరమే
ఆ రోజుల్లో నేనూ బాగానే నిద్రపోయేవాణ్ణి, కొద్ది పాటి నియమవ్యయామం ద్వారా పద్దతిని మార్చుకున్నను.
నేను మీ వర్గంలోనికి(కుంభకర్ణ, ఊర్మిళ) రానుకాని ఏ సమయమైనా, ఎక్కడైనా ప్రసాంతగా నిద్ర పోగలను
మంచు పల్లకీ గారు ధన్యవాదాలు Sir , Kishen Reddy గారు ధన్యవాదాలు Sir ,. Siva Prsad గారు ధన్యవాదాలు Sir ,. Cartheek గారు ధన్యవాదాలు Sir ,
జాన్ గారు thanks alot sir
అబ్బ...ఎంత శ్రద్దగా నిద్ర పోతున్నారండీ..కంగ్రాట్స్. చిన్న రిక్వెస్టు..ఈసారి మీకు మెలుకువ వచ్చినప్పుడు కాస్త ఫాంట్ సైజు పెంచరా ప్లీజ్.
చాలా నవ్వించారండి. చాలా బాగా రాసారు.
హాయ్..........1 2 3 టెస్టింగ్
Sooooooooooooooooooper!
నిద్ర విషయంలో మేల్ వెర్షన్ శివరంజని గారు = శేఖర్ పెద్దగోపు....
చాలా బాగా రాసారు...
అయ్యో..సారీ అండీ కమెంట్ పెట్టి మీ నిద్ర డీస్టర్బ్ చేసా..:-)
@ప్రణీత స్వాతి గారు: ఆ మాత్రం శ్రద్ద, పట్టుదల ఉండకపోతే ఎలా? మీకు ఇబ్బంది కలిగింది కదా అందుకే ఫాంట్ సైజు పెంచాను చూడండి
@సాయి ప్రవీణ్ గారు: థాంక్స్ అండి
@కిషన్ గారు: టెస్టింగ్ ఏమిటీ? దొంగ నిద్రా కాదా అని డౌటా?
@సీత గారు:Thank UUUUUUUUUUUUUUUUUUUU
@ శేఖర్ గారు:అవునా? ఇన్నాళ్ళు నాకు పోటీ ఎవరు రాలేరు అని గర్వపడేదాన్నే ... ఇకపోతే డీస్టర్బ్ ఏముందండీ మీరు నా కోసం నిద్ర లేచి కామెంట్ పెట్టడమే గొప్ప .
ఆ రోజు (నా "నిద్ర" టపా) లో మీరు చెప్తే నమ్మ లేదు గాని,ఇదంతా చదివాక మీరే నాకన్నా చాలా బాగా నిద్ర పోతారని నమ్ముతున్నాను..."మీ నిద్ర విప్లవం వర్ధిల్లుగాక" :-)
ayyo meeru inka nirdalone vunnara ?? andukena malli kotha taapa raayaledu :-)nice blog keep going
nice one anDi, komchem nidra taggimchukoamDi
template chala bagundi
Shivaranjani, chala baga rasarandi..poorthi chadivevaruku navvuthune vunna..:)
@రాధిక గారు: మనిద్దరం ఒకే గూటి పక్షులుమన్నమాట :)
@అశోక్ గారు:) ధన్యవాధములు
@హను గారు: అలాగేనండి....Thanks for your comment
@లక్ష్మి గారు: మీ కామెంట్ చూసి నాకు చాల సంతోషం కలిగిందండి. Thank you very much
నేనీ పోస్టు ఎలా మిస్సయ్యానబ్బా? మీకు చాలా చాలా ధన్యవాదాలు.. ఇవ్వాళ నన్ను చాలా నవ్వించినందుకు. :)Very well written post!
Ayyyoooo raaamaa... enta baavundooo navvutuuune unnaaanu..
same pinch. nagarjuna garu cheputhe ee bloglo thongi chusanu baga rastunnaru continue
Post a Comment