అది నా అన్న ప్రాసన రోజు. ఆకాశమంత పందిరి క్రింద భూదేవంత అరుగులు వేసి చేయడానికి మా నాన్నేమైనా రాజ రాజ నరేంద్రుడా? అందుకే బడ్జెట్ పద్మనాభం లా ఓ బ్రాహ్మణున్ని అలాగే బాగా దగ్గర చుట్టాలని పిలిపించి అన్నప్రాసన చేయించారట .
అన్నప్రాసన రోజునే ఇంకో కార్యక్రమం ఏమిటంటే పిల్లలి చేత మొదటిగా ఏ వస్తువు తాకిస్తే అందులో గొప్పవారు అవుతారని అందరూ చెబితే, నా ముందు కూడా బంగారం, డబ్బులు , పెన్నులు , పుస్తకాలు అలా నా అభిరుచుల కి తగినట్టు గా అన్ని నాముందు పెట్టి, వాటిలో ముందుగా ఏది పట్టుకుంటానా అని మా వాళ్ళు అందరూ టెన్సన్ గా చూస్తుంటే, నేను మాత్రం కొత్త పెళ్ళి కూతురిల ఓ తెగ సిగ్గు పడిపోతూ తల క్రిందికి వంచుకుని నేల మీద వచ్చిపోయె చీమలని చూస్తూన్నానట వెర్రి దానిలా .
అన్నప్రాసన రోజునే ఇంకో కార్యక్రమం ఏమిటంటే పిల్లలి చేత మొదటిగా ఏ వస్తువు తాకిస్తే అందులో గొప్పవారు అవుతారని అందరూ చెబితే, నా ముందు కూడా బంగారం, డబ్బులు , పెన్నులు , పుస్తకాలు అలా నా అభిరుచుల కి తగినట్టు గా అన్ని నాముందు పెట్టి, వాటిలో ముందుగా ఏది పట్టుకుంటానా అని మా వాళ్ళు అందరూ టెన్సన్ గా చూస్తుంటే, నేను మాత్రం కొత్త పెళ్ళి కూతురిల ఓ తెగ సిగ్గు పడిపోతూ తల క్రిందికి వంచుకుని నేల మీద వచ్చిపోయె చీమలని చూస్తూన్నానట వెర్రి దానిలా .
ఇక లాభం లేదనుకుని ఏదో ఒకటి పట్టుకోమ్మా అని బాక్ గ్రౌండ్ మూజిక్ తో సహా అందరూ ఎంకరేజ్ చేసేసరికి ఆనందం పొంగుకొచ్చేసి పాక్కుంటూ పోయి ఎదురుగా వున్నా పుస్తకం తీసుకున్న నాకు దూరంగా రంగు రంగుల గిల గిచ్చకాయ కనిపించేసరికి దాని దగ్గరికి పోయి దాన్ని తీసుకుని నోటితో కొరికేసి, నేలనేసి బాదేసి, కాలి తో తన్నేసి ,దూరంగా విసిరేస్తూ ఇలా గిల గిచ్చకాయతో ఇన్ని రకాల ఆటలు ఇరగదీసి ఆడేస్తుంటే నా ఈ టాలెంట్ ని దగ్గర నుండి చూసిన మా నాన్నా తట్టుకోలేక నాలో దాగి వున్న క్రీడకారిణిని చూసి పుత్రికోత్సాహం తో పరవశించిపోయాడంట.
వెంటనే చుట్టూ వున్న మా చుట్టాలంతా నా ప్రతిభ కి నివ్వెర పోయి ఇంకేముంది ఈ పిల్ల గొప్ప క్రీడాకారిణి అయ్యి ప్రపంచ చరిత్రలో "చిరంజీవిలా" "చిరు" స్థాయిగా నిలిచిపోతుందనుకున్నారంట.
ఎప్పుడైతే చిరంజీవిని రెండు సార్లు తలుచుకున్నారో వెంటనే వీరభద్ర సినిమా షూటింగ్ లో వున్న బాలకృష్ణ కి పొలమారింది . శివుని జట జూటం నుండి వీర భద్రుడిని పుట్టించినట్టుగా అవమాన భారంతో బాల కృష్ణ కోపంగా బాల తాండవం చేస్తూ తన జడ లోంచి కూడా ఓ వెంట్రుక తీసి కింద పడేసాడంట.
అలా ఆ వెంట్రుక నుండి పుట్టిన వాడే వీర భద్రుడి వారసుడు .........ధ్రువ వంశంవాడు . మా పెద్ద డ్రిల్లు మాస్టారు . సీన్ కట్ చేస్తే
నాకు ఐదేళ్ళప్పుడు మా నాన్న మా ఇంటికి ఒక TV కొని తెచ్చాడు. ఆ TV కి మా బాబాయే ఆపరేటర్ , ప్రేక్షకుడు కూడా . మా బాబాయ్ టెన్నిస్ , క్రికెట్ అంటూ అన్నం తినేటప్పుడు కూడా వదిలి పెట్టకుండా అతుక్కుపోయి చూసేవాడు ఆ TVని.
ఎడమ చెయ్యో ,కుడి చెయ్యో, తన కంచమో ,పక్క వాళ్ళ కంచమో కూడా పెద్దగా పట్టించుకొనేవాడు కాదు ఆ అమ్మాయిలని చూస్తూ.... బాబాయ్ నువ్వు చూ(చే)సేది ఏమిటి అని అడిగితే బాల్..... బాట్ .....అన్నం .....కూర ........అని ఏవో అస్పష్టం గా మాట్లాడుతూ వుండేవాడు .
నా దృష్టి లోపమో మా TV లోపమో లేకపోతే ఆ అమ్మాయిలు వేసుకున్న చెడ్డీల్లాంటి మిడ్డీల లోపమో తెలియదు కాని వాళ్ళందరూ నాకంటే చిన్నగా చూపుడు వేలంత కనిపించేవారు.చిన్నపిల్లలు ఇలాంటి ఆటలు ఆడితే ఎంచక్కTVలో చూపిస్తారన్నమాట అని అనేసుకుని ఆ ఆట ని పిచ్చ పిచ్చ గా చూసేదాన్ని .
మా బాబాయ్ తో పాటు ఆ టెన్నిస్ చూసి చూసి నాలో ఉన్న ఆటముఖి కాస్త "టెన్నిస్ ముఖి" గా వికృత రూపం దాల్చింది. ఈ టెన్నిస్ ని ఒంటి చేత్తో ఆడి పడేసి నాలుగు కప్పులు తెచ్చి ఇంటిలో పడేస్తే చుట్టాలు వచ్చినప్పుడు కాఫీ ఇవ్వడానికి పనికి వస్తాయి అని పెద్ద లక్ష్యం పెట్టేసుకున్నాను .
అట్టలు తోటి చేటలు తోటి తెగ ఆడేస్తుంటే నా టెన్నిస్ ప్రావీణ్యానికి పక్కింటి పిల్లలు క్లాస్ లో ఫ్రెండ్స్ అందరూ కుళ్ళి కుళ్ళి ఏడ్చేవారు,
శివా నీ టాలెంట్ ని బట్టి ఏ గేం లో నైనా నువ్వే గెలుస్తావు . గెలవాలి కూడా.. మేము కలలో కూడా నిన్ను ఓడించే సాహసం చెయ్యము .ఈ మాత్రం దానికి నువ్వు కింద పడిపోయి దొర్లి దొర్లి ఏడ్చి ,పక్కన ఉన్న ఇసుక నెత్తిమీద పోసేసుకుని , మా నాన్నకి చెబుతా, మా అమ్మకి చెబుతా అని మమల్ని భయ పెట్టి నువ్వు బాధ పడొద్దే .
మేమందరం ఏక గ్రీవంగా ఓడిపోయి అయినా నిన్ను గెలిపిస్తాము అని వేడుకొంటుంటే ఘన రూపం లో వున్న నా చిట్టి హృదయం ద్రవ రూపం లోకి ఆ తరువాత వాయు రూపం లోకి మారిపోయి సరేలే మీ కోరిక కాదనను లే పోండి అని అభయమిచ్చేసాను .
నాలో ఉన్న ఈ సహృదయం చూసి మీకు పొగడాలి అనిపిస్తుంది కదూ . పొగడ్త పన్నీరు లాంటిది . దయ చేసి..... నేను చెప్పే వరకు పొగడకండే :)
అలా ఓటమిని నా కను రెప్ప దూరం లొ కనిపించిన కాళ్ళతో తన్నిపడేసేదాన్ని . అలా ఓటమినే ఫుట్ బాల్ లా ఆడుకుంటూ ఏక చత్రాధిపత్యం చేస్తున్న రోజుల్లో నాలో ఉన్న టెన్నిస్ ముఖిని ని అంతం చేయడానికి రజనీకాంత్ లెవెల్లో "దేవుడ దేవుడా తిరుమల దేవుడా" అంటూ పాటేసుంటూ ఆల్ ఖైదా నుండి ట్రాన్స్ ఫర్ పై దిగాడు మా పెద్ద డ్రిల్లు మాస్టారు .
రేవులో తాడి చెట్టులా ఎత్తుగా నల్లగా ఉండే మా పెద్ద డ్రిల్లు మాస్టారు చండశాసనుడు . ఆయన అటెన్సన్ అని అనగానే అటెన్సన్ లో ఉన్నవాళ్ళు కూడా అటెన్సన్ లోకి రావల్సిందే .ముఖం మీద దోమ కాదు కదా ఎదురుగా పెద్దపులి వచ్చినా అటెన్సన్ లోనే నిలబడాలి .
ఆ సమయం లో చెవులు మాత్రమే పని చేయాలి కాదని ఏది పని చేసినా నెక్ష్ట్ బర్త్ డే ఉండదు . ఫస్ట్ రోజు డ్రిల్లు లోనే ఈ విషయం మాకు బాగా అర్దమయ్యింది .
అదేమిటో ఆ సార్ ఎప్పుడూ డ్రిల్లు లో బేసిక్స్ మాత్రమే నేర్పేవారు.మాకు మాత్రం కొన్ని వందల సంవత్సారాలు పాటు లెఫ్ట్ రైట్లు మాత్రమే నేర్పారు .ఏ ఆటలు నేర్పేవాడు కాదు . ఆడనిచ్చేవాడు కాదు . ఎప్పుడు డ్రిల్లు ..........డ్రిల్లు ...........డ్రిల్లు . దెబ్బకి ఆటలంటే నే ఒక విరక్తి భావం వచ్చేసింది.
ఎడారి లో ఓయాశిస్సు లా మద్య మద్య లో ఎబౌ టర్న్ అనే కొత్త డ్రిల్లు కూడా నేర్పేవారు . ఆయన ఎబౌ టర్న్ చేసి మమ్మల్ని కూడా చెయ్యమనేవారు . కొత్త డ్రిల్లు ఏదో నేర్పారన్న ఆనందం లో మాకు ఒల్లు తెలిసేది కాదు దానితో ఆయన స్టాప్ స్టాప్ అని అరిచి చించుకున్నా మేము మాత్రం ఆగాకుండా అలా గిర గిర తిరుగుతూనే వుండేవాల్లం.
అప్పుడు చూడాలి ఆయన ప్రతాపం దశావతారలు ఎత్తేసి చావ బాదేసేవారు. ఈయన నేర్పే డ్రిల్లు కి చుక్కలతో పాటు గ్రహాలు , వాటి మీద జీవ రాశి కూడ స్పష్టంగా కనిపించేది .
ఆ సార్ నేర్పే డ్రిల్లు కి అందరికి కాళ్ళు చేతులు లాగుతుంటే నాకు మాత్రం పోతు బొప్పాయి చెట్టులా వున్న ఆయన్ని తలెత్తి చూస్తూ డ్రిల్లు చేసేటప్పడికి కాళ్ళు చేతులు తో పాటు మెడ కూడా లాగేసేది . ఛీ ... కాళ్ళు చేతులు వుంటే ఇలాంటి కష్టాలే వస్తాయి అని అనిపించేది అంత చిన్న వయసులోనే మాకు . .
పైగా మాకెప్పుడూ డ్రిల్ల్ పీరియడ్స్ సోమవారం ,శుక్రవారం ఉండేవి రెక్కలు ముక్కలయ్యేలా డ్రిల్లు లు చేసి చావు దెబ్బలు తిని మేమొస్తే వారం ,వర్జ్యం అంటూ పప్పు చారేసి అన్నం పెట్టేది మా అమ్మ.
కంచం లో ముక్క లేక తినడానికి రెక్క ఆడక ఛీ........ యెదవ చెర...... ఈ స్కూల్లో చదివే కంటె నక్సలైట్లలో కలిసిపోదామని అనుకునేవాళ్ళం మేము . కాని సరైన కాంటాక్ట్ నంబర్స్ లేక ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది .
ఇంక లాభం లేదనుకుని నేను మా ఫ్రెండ్ ముహుర్తం పెట్టించుకొని వచ్చాము నక్సలైట్ల స్రవంతి లో కలిసిపోదామని . వెళ్ళేటప్పుడు అక్కడ తినుబండారాలవి దొరకడం కష్టమని రవ్వలడ్డులు , సున్నుండలు జంతికలు లాంటి నాలుగు రకాలు డబ్బాలు పట్టుకొని బయలుదేరుదాం అనుకునేసరికి అప్పుడే అదే.... అదే...ఆ ....అలాంటి అద్బుతమే మా స్కూల్లో కూడా జరిగింది .
మా పెద్ద డ్రిల్లు మాస్టారు సేవలను గుర్తించిన ఆల్ ఖైదా సంస్థ వారు తిరిగి వచ్చేయమని వేగు పంపారు. నాలో ఉన్న టెన్నిస్ ముఖిని ని అంతం చేసాను కాబట్టి వచ్చిన పని అయిపోయింది అని ఆయన త్రుప్తిగా వెళ్ళి పోయారు. మేము మాత్రం దేశం గర్వించే ఓ గొప్ప వ్యక్తి ని కోల్పుతున్నామని భాదతో కన్నీళ్ళు తుడుచుకుంటూ వీడ్కోలు పలికాము.
అలా మా పెద్ద డ్రిల్లు మాస్టారు వల్ల ప్రపంచం ఓ గొప్ప క్రీడాకారిణిని , విప్లవ కారిణిని కోల్పోయింది .
విధి వెక్కిరించి కిల కిలా నవ్వడం వలన ఆటల్లో ఆణిముత్యం గా తయారవ్వవలసిన నేను అరటి పండు లా మిగిలిపోయాను.
జీవితమే ఓ ఆట సాహసమే పూ బాట అని వూరికినే అన్నారా .. ఇన్ని సాహసాలు చేసి క్రీడకారిణి గా మారి సాధించేదేముంది . అదే నాలుగు దెబ్బల"ఆటలు" నేర్చుకుంటే ఇండియా లోనే కాలు కదపకుండా బ్రతికేయొచ్చు హేపీగా..... ఏమంటారు??

61 comments:
హా..హ్హ..ఎంత పనైపోయిందండీ..మీ డ్రిల్లు మాస్టారి వల్ల దేశం గర్వించే ఒక క్రిడాకారిణిని, అది కూడా టెన్నిస్ లో, కోల్పోయామన్నమాట..:-)
మేము 'ఆటలో అంటిపండు' అని అంటాము..అరటి పండు అని అనము.
మీ పోస్ట్ మొత్తంలో ఫలానా వాక్యానికి నవ్వొచ్చింది అని చెప్పలేనండీ.. ఎందుకంటే అలాగైతే మీ పోస్టంతా మళ్ళీ రాయాల్సోస్తుంది ;-) ప్చ్.. ఆ విధంగా ఓ గొప్ప క్రీడాకారిణి ని కోల్పోయామన్నమాట! చాలా చింతిస్తున్నాం సుమీ! ;-) పోస్ట్ మాత్రం చాలా చాలా.. (ఇలా కనీసం ఓ ఇరవై అయినా 'చాలా' లు పెట్టుకుని చదూకోండి) బాగా రాశారు. తరచూ రాస్తూ ఉండండి. :-)
అన్నట్టు, ఇప్పుడు నాకర్ధమైందిగా మీరు నన్నెందుకు బాలకృష్ణ ఫ్యానా అని అడిగారో! ;-)
hahahaha..nice :-))
భలే రాస్తున్నరండీ...మీ నిద్రోపాఖ్యానం కూడా ఇవాళే చదివాను. బాగ నవ్విస్తున్నారు. Keep writing (మెలకువగా వున్నప్పుడు)
baga rasaru...ilantivi marinni asistunnam....
baga rasaru...ilantivi marinni asistunnam....
Shivamani(టెన్నిస్ ముఖి) garu bagundi mee comedy
these lines are very funny
బాల్..... బాట్ .....అన్నం .....కూర ........అని ఏవో అస్పష్టం గా మాట్లాడుతూ వుండేవాడు
నా దృష్టి లోపమో మా TV లోపమో లేకపోతే ఆ అమ్మాయిలు వేసుకున్న చెడ్డీల్లాంటి మిడ్డీల లోపమో తెలియదు కాని వాళ్ళందరూ నాకంటే చిన్నగా చూపుడు వేలంత కనిపించేవారు
mee drusti lopam kaadu lendi..TV loo unna ammayila lopame adi...
నక్సలైట్ల స్రవంతి లో కలిసిపోదామని . వెళ్ళేటప్పుడు అక్కడ తినుబండారాలవి దొరకడం కష్టమని రవ్వలడ్డులు , సున్నుండలు జంతికలు లాంటి నాలుగు రకాలు డబ్బాలు పట్టుకొని బయలుదేరుదాం
బాబొయ్.. నవ్వలేక చచ్చా.... ఎంటండి ఇది.. నేను ఎదొ యధాలాపం గా చూసా ఈ పొస్ట్ ని.. ""నేల మీద వచ్చిపోయె చీమలని చూస్తూన్నానట వెర్రి దానిలా"" ఇక్కడ మొదలు పెట్టిన నవ్వు చివరవరకూ ఆగలేదు....
మీది గొదావరి జిల్లానా... అదీ మీ టాలెంట్ కి రహస్యం... మన గురువు నేస్తం గారి ఆశీస్సులు తీసుకొండి దూసుకొపొవచ్చు :-)))
నేల మీద వచ్చిపోయె చీమలని చూస్తూన్నానట
hats off to u
రంజని...మొత్తానికి నా మొర ఆలకించి కొత్త టపా రాసావనమాట.. అసలు అరుపులు ... మంటలు .. కేకలు పుట్టించావుగా.. నీలో ఇంత టాలెంట్ ఉందని తెలిసే, ఎంత సేపు నిద్రపోతావు లేచి ఇంకొక టపా రాయమని ఇన్ని సార్లు అడిగాను .. పోనిలే ఇప్పటికన్నా లేచావు :-))... అసలు ఏంటి...అసలు ఆ కామెడీ ఏంటి..ఆ రాయడం ఏంటి..బాబోయ్ ఆఫీసులో నవ్వలేక చచ్చాను తెలుసా...ఒక్క లైన్ అని స్పెసిఫై చెయ్యలేను దేనికదే సాటి... సో ఆవిధంగా ఆటల్లో ఆణిముత్యం అవ్వాల్సిన రంజని ఆటల్లో అరటిపండు అయ్యిందనమాట :-))...
అయ్యో....ఒక గొప్ప క్రీడాకారిణి మిస్ అయ్యామే....పరవాలేదు లెండి...ఇప్పటికయినా మించిపోయింది లేదు....'కృషి ఉంటె మనుషులు రుషులవుతారు '...ఏమంటారు???మొత్తాని కిచాలా బాగా రాసారు అండి...తరచుగా రాస్తా వుండండి....కామెడీ అదిరింది....ఆ చిమలని చూసారని చెప్పారు చుడండి....సూపర్....
బాగ నవ్వించారండి...విధి వెక్కిరించి కిల కిలా నవ్వడం వలన ఆటల్లో ఆణిముత్యం గా తయారవ్వవలసిన నేను అరటి పండు లా మిగిలిపోయాను:-)
@శేఖర్ గారు:ధన్యవాదాలు... 'ఆటలో అంటిపండు' అనాలండీ . ఏ పండు అయితే ఏముందండీ?ఇంత జరిగాక ....నా బాధ అంత నా గురించి కాదు దేశం గురించే... చూసారా మీరు ఎంత బాగా అర్ధం చేసుకున్నారో ..
@మధుర గారు:మీరు పెట్టిన 20 పక్కన ఇంకో 20 సున్నాలు పెట్టినన్ని థాంక్స్ లు మీకు....
అబ్బా బాలకృష్ణ ఫాన్ అని అనిపించుకోవాలంటే ఎంతో పూజ చేసుకోవాలండి ......బాబోయ్ నేను మాత్రం అలాంటి పూజలు కలలో కూడా చెయ్యను . పోయి పోయి నన్ను బాలకృష్ణ కి ఫాన్ ని చేస్తారా ?
@రాధిక గారు:Thank you ....
@స్పురిత గారు:ధన్యవాదాలు... ఇకపై మెలకువగానే ఉంటాను అతిగా నిద్రపోను... సరేనా?
@రవీంద్రనాథ్ గారు: నిజం గా నేను రాసింది బాగుంటే మీ లాంటి వారి ప్రోత్సాహం ఉంటే తప్పకుండా రాస్తాను
@avyaya గారు:శివమణి కాదండీ శివరంజని .... సోది ఏమి చదువుతాను లే అని అనుకోకుండా మీరు ఇంత శ్రద్దగా చదివి నచ్చిన లైన్స్ కోట్ చేసినందుకు ధన్యవాదాలు...
@శివ ఫ్రసాద్ గారు : Thank u very much
@మంచు పల్లకీ గారు : అవునాండీ.. బాగా నవ్వొచిందా.ధన్యవాదాలు... ఇంక నవ్వుతూనే ఉన్నారండీ.
నేస్తం అక్క ఆశీస్సులు తీసుకోకుండా వినాయాకుడికి పూజ చేయకుండా ఏ పని చేయకూడదు . నేనెప్పుడో ఆశీస్సులు తీసేసుకున్న మీకు తెలుసా ?
@కవితగారు: ధన్యవాదాలు.మీ లాంటి వారి ప్రోత్సాహం ఉంటే తప్పకుండా రాస్తాను.. అందుకే గా దెబ్బలాటల్లో కృషి చేద్దామనుకుంటున్నాను:):)
@కిషన్ గారు : సారీ.... సస్పెన్స్ స్టొరీస్ రైటర్ గారు . రైటర్స్ ఎప్పుడు బాగున్నవాటి కంటే ఎక్కడ బాగా రాయలేదో చెప్పాలి కదండీ. అప్పుడు మాకు కూడా కొన్ని మెలుకువలు తెలుస్తాయి కదా ... లేకపోతే ఇప్పుడు ఆహా ఓహో అన్నారనుకో . జీవితాంతం ఈ భయకరమైన పోస్ట్లు భరిస్తూనే ఉండాలి
@అశోక్ గారు : ఆటల్లో అరటిపండుని అయ్యానని నేను బాధ పడుతుంటే .మీరందరూ భలే భలే అని నవ్వుతారా ...
hahaha!kuDee eDamgaa jaajipoolu raenjiloe raasaaru. baagundi.
బాబోయ్ ఏంటండీ ఇది, మీరు మాతో ఆటలాడుకుంటున్నారా.....ఇలా నవ్వితే మేమేయైపోతాం. క్రీడాకారిణి కాదంటూనే మా జీవితాలతో ఆడుకుంటున్నారు, ఇది మీకు భావ్యం కాదు.
పొట్ట పగిలేలా నావ్వానండీ బాబు. ఏదో యధాలాపంగా హారంలో చూస్తే మీ పోస్ట్ కనపడింది...ఇరగదీసారు. అసలు ఇలా లైన్ లైంకీ నవ్విస్తూ టపా రాయొచ్చా అని అబ్బురపడ్డానంటే నమ్మండి. ఇది చదివితే నవ్వొచ్చింది, అది చదివితే నవ్వొచ్చింది అని లేదు. మొదటి నుండి చివరికంటా నవ్వొస్తూనే ఉంది.
ఇంత టేలెంటు పెట్టుకుని ఇలా సంవత్సరానికో టపా రాస్తే ఎలాగండీ...రోజూ రాస్తూ ఉండాలి మరి.
నేస్తం అక్క ఆశీస్సులు తీసుకోకుండా వినాయాకుడికి పూజ చేయకుండా ఏ పని చేయకూడదు.నేనెప్పుడో ఆశీస్సులు తీసేసుకున్న మీకు తెలుసా ?
ఆశీస్సులు తీసుకున్నారు సరే నా(వినాయకుడిది)ప్రసాదం ఇంకా రాలేదు. పోస్ట్ అదుర్స్(గోదారి నీరా మజ్జాకానా)
బాబోయ్ ఏంటండీ ఇది, మీరు మాతో ఆటలాడుకుంటున్నారా.....ఇలా
నవ్వితే మేమేయైపోతాం. క్రీడాకారిణి కాదంటూనే మా జీవితాలతో ఆడుకుంటున్నారు, ఇది మీకు భావ్యం కాదు. పొట్ట పగిలేలా నావ్వానండీ బాబు. ఏదో యధాలాపంగా హారంలో చూస్తే మీ పోస్ట్ కనపడింది...ఇరగదీసారు. అసలు ఇలా లైన్ లైంకీ నవ్విస్తూ టపా రాయొచ్చా అని అబ్బురపడ్డానంటే నమ్మండి. ఇది చదివితే నవ్వొచ్చింది, అది చదివితే నవ్వొచ్చింది అని లేదు. మొదటి నుండి చివరికంటా నవ్వొస్తూనే ఉంది. ఇంత టేలెంటు పెట్టుకుని ఇలా సంవత్సరానికో టపా రాస్తే ఎలాగండీ...రోజూ రాస్తూ ఉండాలి మరి.
ha ha ha ha ha...nice post.
sivaranjani gaaroo keep writing.
సునీత గారు మీ కామెంట్ కి నాకు చాలా చాలా సంతోషం కలిగింది .(ఒక పక్క ఆనందం గా ఉన్నా మనకి అంత టాలెంట్ లేదులేండి...)
జాజిపూలు నేస్తం గారిని రీచ్ అవ్వాలంటే ఇంకో పది జన్మలు ఎత్తాలేమో .(ఆవిడ మాట్లాడే ప్రతి మాటలోను చమత్కారమే )
@శ్రీనివాస్ గారు: చూసారా ....ఎంత పొరపాటు జరిగిందో.... మీకు(వినాయకుడికి) ప్రసాదం పెట్టకపోవడం వల్లే నా బ్లాగ్ రెండు రోజులు పని చేయలేదండి ......ఎంతైనా వినాయకుడు కదా మీరు..
@సౌమ్య గారు:: కలా?నిజమా ? మీ కామెంట్ చూసి మొట్టమొదటి సారిగా... ఎక్కడం రాక పోయినా సరే మునగ చెట్టు ఎక్కేసాను తెలుసా??
ఒక phd girl నా బ్లాగ్ లో కామెంట్ ..... really.......its honour for me
(మీకు అంతగా నచ్చినందుకు ధన్యవాదములు)
@ప్రణీత గారు: Many Many thanks ....
@avyaya గారు: మీ కామెంట్ పబ్లిష్ అవ్వడం లేదు నిన్న అంతా ప్రయత్నించాను ... ఎందుకో ఎర్రర్ చూపిస్తుంది ..మీ కామెంట్ పబ్లిష్ చేయలేకపోయినందుకు క్షమించండి ...
@ శివరంజని
మేము రాసిన కామెంట్లు, మీరు ఇచ్చిన రిప్లైలు అన్ని పబ్లిష్ అయ్యాయి. బ్లాగరులో కాస్త ప్రోబ్లం ఉంది అందుకే మీకు కనిపించట్లేదు, కానీ నాకు కనిపిస్తున్నాయి. ఏం బాధపడకండి :)
@శ్రీనివాస్ గారు: ఎంతైనా వినాయకుడు కదా మీరు ??
*నాకర్ధం కాలేదు :(*
@సౌమ్య గారు: ధన్యవాదాలండి ... ఎర్రర్స్ పోయాయిలేండీ... ఇప్పుడు బాగానే ఉంది నా బ్లాగ్...
@మంచు పల్లకీ గారు : అయ్యో సరిగా చూసుకోలేదండీ మీరు చెప్పే వరకు ... .... శ్రీనివాస్ పప్పు గారు నా వినాయకుడిది నైవేద్యం ఏది అని అడిగితే ఆ సార్ నే వినాయకుడు అని అనుకున్నాను నేను (నా వినాయకుడిది అన్న మాటకి నేనే వినాయకుడు అని తేడా గా అర్ధం చేసుకోవడం వల్ల వచ్చింది ఈ పొరపాటు )
పర్లేదు లెండి మా గురువుగారు మంచోరు, మన గొదావరి వారు.. ఎమీ అనుకోరు :-))
చాలా.... చాలా....చాలా..........n (n= no. of sentences in your post) బాగా రాసారు.
లేటుగా వచ్చినా లెఖ్కలేనన్ని సార్లు నవ్వించారు. Thanks
@ 3g గారు : thanks నేనే మీకు చెప్పాలండి నా పోస్ట్ నచ్చినందుకు & నా బ్లాగ్ కి వచ్చినందుకు
Paravaledu sivaranjani gaaru.......
mee next post kosam waiting........
శివరంజని భలేవాళ్ళే..ఇలా నన్ను పొగిడేస్తే అందరూ నిజం అనేసుకుంటారు..ఇంతకూ విషయం ఏంటంటే ఎంత బాగా రాసావంటే అంత బాగుంది.. నీలో మంచి టాలెంటు ఉంది.. మొదటిపోస్ట్ కే అనుకున్నా ఆ మాట.. ఇలా రాస్తూ ఉండు..మేము నవ్వుతూ ఉంటాం :)
నేస్తం అక్క గురించి చెప్పిన విషయం లో ఆవగింజంత అబద్దం కూడ లేదు... ఆ విషయం మాకు బాగా తెలుసు ... హమ్మయ్యా నీ బ్లెస్సింగ్స్ వచ్చేసాయి ...I am so happy
బాగారాశారండి .
శివరంజని గారు,
నేనన్నదీ మీరనుకున్నదీ రెండూ ఒకటే నండీ,మధ్యలో మన మంచుగారు మళ్ళీ అడిగేసరికి మొహమాటపడ్డారేమో కానీ మొదట మీరిచ్చిన జవాబే కరక్టు.
మంచు గారూ గురువుగారెప్పుడూ మంచోరే మరి గోదారోరేకదా.
@మాలా కుమార్ గారు: ధన్యవాదములు
@శ్రీనివాస్ గారు: అంతే...అంతే
చాలా బాగుంది మీ ఆటల ప్రహసనం. నాకైతే మిమ్మల్ని ఒక పెద్ద క్రీడాకరిణిగా త్వరలోనే చూస్తానని ఘాఢ నమ్మకమేర్పడింది. I wish you all the best.
జయ గారు మీ కామెంట్ రావడం నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో ..మీ ఆశీస్సులు కూడా అంతే సంతోషాన్ని ఇస్తున్నాయి .. కామెంట్ లేట్ గా పబ్లిష్ చేసినందుకు సారీ అండి
నా బ్లాగ్ లో 48 కామెంట్స్ కి 41 మాత్రమే కనిపిస్తున్నాయి . మిగతావి పబ్లిష్ అవడం లేదు .... కామెంట్ పబ్లిష్ కాని వారందరికి నా క్షమాపణలు
ammai siva... bhale raasav! mecchukokunda undalekapotunna!!! :)
Thank you seeta .....
నీహారిక గారు కొంచెం బిజీ గా ఉండడం వల్ల ఈ రోజే సీత బ్లాగ్ చూసాను ...అందులో మీ కామెంట్ చదివాను ... చూసుకోలేదండీ సారీ ... ఇక నా బ్లాగ్ కి ఎప్పుడూ ఎదో ప్రోబ్లం వస్తుంది ..ఏమిటో నాకే అర్ధం కావడం లేదు...
రెగ్యులర్ గా రాస్తే ఏమీ ప్రోబ్లంస్ రావు....ఎన్నాళ్ళని ఈ ఆటలో ఆరటిపండుని చదువుతూ కూర్చోవాలి మేము?
తొందరగా ఏదైనా రాయి బంగారం, ఎన్నాళ్ళని ఈ ఎదురుచూపులు!!!
సౌమ్య గారు నీహారిక గారు Thanks a lot for your affectionate compliment!
మీరు చెప్పినట్టే రెండు రోజుల్లో కొత్త పొస్ట్ లో మిమ్మల్ని కలుస్తానండి ...
మరేమో అస్తమాను పవర్ ప్రొబ్లం + నాకు own lappy లేదు అందుకే నేను రాయడానికి వీలు చిక్కడం లేదు... మిమ్మల్ని ఎదురు చూసేలా చేసినందుకు క్షమించేస్తారు కదూ...
కొత్త పోస్ట్ రాస్తే క్షమించేస్తాం :)
hiiiii
nuvvu inta humorous gaa raastavani naaku teleedu :)
chala late gaa chosoa ee post..anduke late response :)
All the very best and keep writing more..
నేను ఇవాళే ఈ పోస్ట్ చూసాను. ఎంత మంచి రచన మిస్ అయ్యానా అని తెగ ఫీల్ అయిపోయాను. వెంటనే మీ ఫాన్, కాని ఏసి కాని అయిపోవాలని డిసైడ్ అయిపోయాను. మీరు తొందరగా అనుమతిచ్చేస్తే మరింక ఆ పనిలో వుంటాను..
@మానస గారు : ధన్యవాదములు ...No problem.... మీరు లేట్ గా చూసిన మీరు పెట్టిన కామెంట్ చాలా స్వీట్ గా ఉంది
శ్రీలలిత గారు మీ కామెంట్ ఎప్పుడూ నాకు సంతోషమే..నా మొదటి పోస్ట్ లో మొదటి కామెంట్ కూడా మీదే...అప్పటినుండి నేనే మీ ఫాన్ ని ఏసి ని కూడా ....నాకు ఫాన్ ఎంత మాట ఎంత మాట @శ్రీలలిత గారు: మీ కామెంట్ ఎప్పుడూ నాకు సంతోషమే..నా మొదటి పోస్ట్ లో మొదటి కామెంట్ కూడా మీదే. అప్పటినుండి నేనే మీ ఫాన్ ని ఏసి ని కూడా...
నాకు ఫాన్ ఎంత మాట ఎంత మాట నిజం చెప్పొద్దూ ఈ పిల్ల అంత తెలివైందేమి కాదు లేండీ ..... నన్ను మీరు అని పిలవకండి...... నువ్వు అని పిలిచేయండి ....
ఇకపోతే మీరు వస్తానంటే నేనొద్దంటానా????
హ్హహ్హహ్హ.. చాలా బాగా రాశారు. ప్రతి లైనులోనూ చమత్కారమే. బాగుంది.
ఈ టెన్నిస్ ని ఒంటి చేత్తో ఆడి పడేసి నాలుగు కప్పులు తెచ్చి ఇంటిలో పడేస్తే చుట్టాలు వచ్చినప్పుడు కాఫీ ఇవ్వడానికి పనికి వస్తాయి అని పెద్ద లక్ష్యం పెట్టేసుకున్నాను .
sooper.. inka ilanti chala unnai...
abba..innallu ela miss ayyanndi mee blog ni...?
chala baga raasaru.. :)
@శిశిర గారు: ధన్యవాదములండి నా బ్లాగ్ కి వచ్చినందుకు
@వేణురాం గారు :ధన్యవాదములండి నా బ్లాగ్ కి వచ్చినందుకు
modatisari mee blog chusanu ..chala commedy ga rasaru...mee postlu yentala attract chesayante 1 gantalo anni posts chdivesanu......
@raji :గారు ముందుగా నా బ్లాగ్ కి సుస్వాగతం... నిజం గా నండి మిమ్మల్ని మెప్పించిందుకు ధన్య వాధములండి
నువ్వు ఇంకొ పొస్టు రాయవా తల్లీ
ఇంక ఈవేళ నవ్వలేనండి. రేపు వచ్చి మళ్ళీ నవ్వుతాను. థాంక్యూ, థాంక్యూ, థాంక్యూ ఇంతగా నవ్వించినందుకు.
ఈ స్కూల్లో చదివే కంటె నక్సలైట్లలో కలిసిపోదామని అనుకునేవాళ్ళం మేము . కాని సరైన కాంటాక్ట్ నంబర్స్ లేక ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది .
nenu elage anukunnanu
Post a Comment