Saturday, 7 August 2010

నువ్వు నాకు నచ్చలేదు........నచ్చలేదు!!!!

నువ్వు నాకు నచ్చలేదు........నచ్చలేదు........ నచ్చలేదు!!!!!!!!!!

ఆగండాగండి ...ఏంటి?? పెళ్ళి సంభంధం గురించి అనుకుంటున్నారా ? (అయ్యబాబోయ్ ఆ మాట ఎత్తకండి ....నాకు చాలా సిగ్గేస్తుంది )... అయినా ఇప్పటికప్పుడు పెళ్ళంటే పేచిపెట్టి కొనుక్కున్నా 3 లంగా ఓణీలు వేస్టయిపోవు ...

ఇంతకి ఏమినచ్చలేదు అనే కదా మీ ప్రశ్న??? ...నా పేరు...... అవును..... .అవును..... అవును ......నా పేరే తలుచుకుంటేనే ఒళ్ళు మండి పోతుంది ..

పియర్స్ లో ఏముంది?? ఏమి లేదు?? (అని అమాయకం గా చెప్పే ఆ యాడ్ లో అమ్మాయిని ఊహించుకోండి కొంత సేపు) .... కాని నా పేరు లో ఓ వ్యద , రొద అంతులేని సొద ఉన్నాయి...

నేను పుట్టకముందు మా అమ్మకి పనిలేక నిద్రపోతూ నా గురించి కలలు కంటుంటే ఆ ఈశ్వరుడు మాత్రం సీన్ మద్య లో ఎడ్వర్ టైజ్ మెంట్ లా వచ్చి నాపేరు పెట్టవా ప్లీజ్......ప్లీజ్..... అని పనికట్టుకుని వచ్చి మరి అడగడంతో మా అమ్మ నాన్న కాదనలేకపోయారంట .. ఆయన ఆర్డర్ వేయడం మా వాళ్ళు రోడ్ వేయడం చకా చకా జరిగిపోయాయి

నేను పుట్టిన తరువాత బాగా ఆకలేసో ..... పిల్లి ని చూసో భయపడి నేను ఏడుస్తుంటే పక్కింటి ఆంటీ కి చిరాకు వచ్చి చీ... ఈ పిల్ల పోరు కి నిద్ర పట్టి చావడం లేదు ఎప్పుడూ బావురు పిల్లి లా అరుస్తూ ఉంటుంది దీని నోరు కుట్టేసి దీని కి తగిన శాస్తి చేయలని నాకీ పేరు సెలెక్ట్ చేసి ఆవిడ ఇల్లు ఖాళీ చేసి పారిపోయింది లండన్ కి ..

నోరు కుట్టడం సంగతేమో కాని తడి గుడ్డతో నా గొంతు మాత్రం కోసేసింది .


నన్ను 3 వ సంవత్సరాన్నే స్కూల్లో పడేసి వాళ్ళ బరువు భాధ్యత తీర్చేసుకుందామని మా అమ్మ నాన్న నిర్ణయించుకున్నారు. . పోనీలే పెద్ద వాళ్ళు ఏమి చేసినా మన మంచికే చేస్తారు కదా అని వాళ్ళ నిర్ణయాన్ని నేను త్రోసిపుచ్చలేదు ...

స్కూల్లో అడ్మిసన్స్ రోజున నా లాంటి పిల్లలందరకి డైరెక్టర్ దగ్గర ఇంటర్వ్యూ జరుగుతుంది... ఆ ఈ ఇంటర్వ్యూ లో ఏముంటాయిలే మహారాష్ట్ర రాజధాని జార్ఖాండ్ , మద్యప్రదేశ్ రాజధాని ఢిల్లీ లాంటి సిల్లీ కొశ్చన్స్ కి టక టక సమాధానాలు చెప్పేసి సీట్ ఎత్తుకొచ్చేద్దాము అనుకున్నాను ...

కాని ఆ సార్ నీ పేరెంటమ్మా? అని అడిగాడు. అలా నా పేరు అడిగేసరికి నాకు ఉన్న ఒక్కగానొక్క మెదడు పని చేయడం మానేసింది .. చదువంటే ఇంత కష్టమైన ప్రశ్న తో మొదలువుతుందా అనిపించింది ...

ఈ చదువు అనే కురుక్షేత్రం లో నా పేరు అనే పద్మవ్యూహాన్ని చేధించలేక బాల అభిమన్యురాలిలా చూస్తూ నిలుచుండిపోయాను

దానితో డైరెక్టర్ కి తిక్క రేగి నా వైపు చిరాకు గా, గుర్రుగా చూసి మా నాన్న వైపు మాత్రం నవ్వుతూ చూస్తూ ఎందుకండీ???? ఇంత చిన్న పిల్లల్ని తెచ్చి స్కూల్లో పడేస్తారు మాటలు కూడా రాని పిల్లలతో మాకెందుకు ఈ తిప్పలు అన్నాడు...

పాపం మా నాన్న బ్రతిమాలి పిల్ల కి మాటలు వచ్చు పేరు రాదంతే అని చెప్పి ఒక వారం రోజులు టైం అడిగి ఆ వారం రోజులు నా పేరు నా చేత బట్టీ పట్టించి మళ్ళీ తీసుకెళ్ళారు

ఈ సారి ఆ సార్ నా పేరు ని మానేసి నీకు ఐస్ క్రీం కావాలా? చాక్లేట్ కావాలా అని అడిగాడు ... అలా ఫ్రెండ్లీ గా అడిగేసరికి నాకు భయం పట్టుకుంది ...

అందులోను మా అమ్మమ్మ ఎప్పుడొ చెప్పింది ..ఎవరైన చాక్లేట్లు కావాలా ఐస్ క్రీం కావాలా అని అడిగితే వాళ్ళతో మాట్లాడవద్దని ...వాళ్ళు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారని
అందుకే నేను ఏమి మాట్లాడకుండా భయం తో ఆ సార్ పిల్లి గడ్డాన్ని చూస్తూ నిలబడ్డాను ...

దానితో పాపం ఆ సార్ బాగా డీప్ గా హర్ట్ అయ్యి తనలో అంతర్లీనం గా దాక్కున్న బి.పి , షుగర్ , మలేరియా , హిష్టీరియా లాంటి లక్షణాలన్ని బయటపెట్టేసాడు .. అలా మంచి స్కూళ్ళో సీట్ కాకెత్తికెళ్ళిపోవడంతో వేరే స్కూళ్ళో జాయిన్ అయ్యాను ..

ఎగ్జాంస్ లో కూడా ఆన్సర్స్ అన్ని ఇరగదీసి రాసేసినా Name of the Student అనే కాలం మాత్రం పూర్తిచేయలేక పక్క వాళ్ళకి నా పేపర్ అంతా దగ్గరుండి మరీ కాపీ కొట్టండి బాబూ కాపీ కొట్టండి అని బ్రతిమాలి కేవలం వాళ్ళ పేరు మాత్రమే నేను కాపీ కొట్టి రాసేదాన్నా ఈ మాత్రం దానికి టీచర్స్ ఓ ఫీల్ అయిపోయి ఏ పిల్లా పేపర్ అంతా కాపీ కొట్టింది చాలక పేరు కూడా కాపీ కొడతావా అని నా బెండు తీసేసేవారు ... దీనినే సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అంటారు ..

అందుకే నేనే సొంతం గా రాసిన పేపర్ అని ఈ సమాజానికి తెలియ చేయడం కోసం పేపర్ కి నాలుగు వైపుల పసుపు బొట్లు పెట్టి మరి ఇచ్చేదాన్ని, పేరు రాయడం చేతకాక ...

ఈ సుత్తి పేరు నాకొద్దు బాబోయ్ అని నేను చేసే గలాట తట్టుకోలేక మా అమ్మ అది కాదే బుజ్జమ్మా నీ పేరు ఎంత బాగుంటుంది అనుకున్నావ్ ..నీ పేరు ఎవ్వరో గాని పెట్టుకోరు తెలుసా అని నాకు ఐస్ పెట్టేస్తుంటే నిజమే కాబోలు అనుకుని కోతి కి కొబ్బరి చిప్ప దొరికినంత ఆనందం గా ఫీల్ అయిపోయేదాన్ని .నా పేరు చూసుకుని...

ఈ పేరు ఎవరు పెట్టుకోకుండా పక్కన పడేస్తే అది తీసుకొచ్చి నా నెత్తిన రుద్దేసారని నాకు తెలీదు.. కొన్ని ఘోరమైన నిజాలు అంత తొందరగా మన ఆనందాన్ని బ్రేక్ చేయవు.. టైం చూసుకుని మన చేత బ్రేక్ డాన్స్ చేయిస్తాయి.

కాలేజీ లో కూడా ఇదే భాగోతం . వాళ్ళ పేరు కూడా వాళ్ళు తప్పులు లేకుండా రాసుకోలేని జనాలకి కూడా నన్ను చూసేటప్పటికి పెద్ద సింగర్స్ అనే ఫీలింగ్స్ హెవీ గా పుట్టుకొచ్చేసి పాటలు పద్యాలు మొదలు పెట్టేసేవారు సుత్తి మొహాలు .
శివరంజని, సితార ,ఆంధ్ర జ్యోతి , మనోరంజని, సినీరంజని ,ప్రియరంజని నా హృదయ రంజని ఎవరిష్టమొచ్చినట్టు వాళ్ళు కారు కూతలు రైలు కూతలు కూసేవారు . గుచ్చి గుచ్చి పిలిచి మరి మనసు నొచ్చుకునేలా చేసేవారు ..

వీళ్ళ కన్నా గంగిరెద్దుల వాళ్ళు నయం.... చక్కగా ప్లేట్ బియ్యం పెట్టి ఒక రూపాయి ఇస్తే రంజని అమ్మ గారు శ్రీలచ్చమమ్మా , సిరి గల తల్లి ,దయ గల బిడ్డ ,రంజని అమ్మ గారు అత్త మామల ముద్దు కోడలా అని ఎంత పొగుడుతారో .

మాటలు వచ్చిన పెద్ద మనుషులు ఎలాగు పద్దతిగా పిలవరు ... ఆఖరికి మాటలు రాని పిల్ల మనుషులు కూడా నా పేరు తో పాచికలు ఆడటం మొదలు పెట్టేసారు .

నాకు పిల్ల ఫ్రెండ్స్ ఎక్కువ ... ఒరేయ్ అక్కా అని పిలవండిరా అని నేను ఎంత మొత్తుకున్నా సరే ఆ అక్కకి నా పేరు కలిపితే కాని పిలవరు … నా పేరు ని సగానికి నరికేసి తలేదో మొండెమేదో కూడా తెలియకుండా అతికించేసి శిజ్జినకా శిజ్జినకా అంటారు ..నాకయితే జజ్జినకా జజ్జినకా అన్నట్టు వినిపిస్తుంది ... ఇలాంటివి వినేకంటే చెవిలో సీసం పొసేసుకోవలన్నా అంత కోపం కసి వచ్చేసేవి .

ఓ రోజు మా ఇంటి దగ్గర తేజ అని పిల్ల వాడికి ప్రసాదం పెడదామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను .

వాడు శ్రియక్క నాకింకా కావలి అని అడిగాడు .... వాడు అలా శ్రియ అనగానే ఇలా పడిపోయాను .. ఏమి వచ్చిందో కూడా తెలియలేదు ఆ టైం లో ...

ఎన్నాల్లకి ఇంత మధురమైన పిలుపు విన్నాను ఆహా ఏమి నా భాగ్యము ఇదంతా వర లక్ష్మీ దేవి వ్రత మహిమే కదా అనుకొని అనందంతో మా ఫ్రెండ్స్ అందరికి మీరు కూడా ఈ వర లక్ష్మీ దేవి వ్రత మాచరించినా ఇలాంటి భాగ్యమే కలుగుతుందని చెప్పి వాళ్ళ చేత కూడ చేయించాను ..

అప్పటి నుండి ఆ తేజా గాడికి పూటకో చాక్లెట్ పెట్టి మరీ పిలిపించుకునేదాన్ని ..

నేను పెట్టిన చాక్లెట్ల తిని తిని వాడు పళ్ళు పుచ్చిపోయిన గున్న ఏనుగు లా తయారయ్యడు...

ఓ రోజు మా ఫ్రెండ్ ఉమ మా ఇంటికి వచ్చి వాడిని బాగా అబ్జర్వ్ చేసి ఒసేయ్ నీ ఎంకమ్మా వాడు నిన్ను శ్రియ అనడంలేదే" శి "అక్క అంటున్నాడు అని గాలి తీసేసింది ...నీకు కుళ్ళు....లేదు వాడు శ్రియ అనే అంటున్నాడు అన్నాను మొండిగా ... ....వూరక రాదు మహానుభావురాలు నా ఆనందం మీద నీళ్ళు చల్లడానికే వచ్చింది

అలా నా ఆశలు అన్ని సచ్చిపోతున్న టైంలో నాకింకో భయంకరమైన నిజం తెలిసింది .. జయ.. బస్ లో సేట్ ఇచ్చి పరిచయమయ్యింది ..You are very cute అంది ...దానికి సమాధానం గా Thanks చెబితే చీప్ గా ఉంటుంది అని same to you అని అన్నాను ... నువ్వు చెప్పేది wrong అంది... భలే కనిపెట్టేసిందే ...ఎంతైనా తెలివైన పిల్ల అందుకే you are so brilliant అని అన్నాను ...your good name అని అడిగింది .నా పేరు చెప్పగానే sweet name అంది. మోసం, దగ ,కుట్ర , అయితే నువ్వు ఇందాకనుండి అబద్దాలే చెబుతున్నావు కదూ అని అడిగితే ....లేదు మీ పేరు మీద ఉన్న పాటంటే నాకు ఎంత ఇష్టమో ఆ పాట ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు అని చెప్పింది.

అలా బస్ ఎంత పాస్ట్ గా వెలుతుందో అంత కన్న స్పీడ్ గా ఒకరి డప్పు ఒకరు కొట్టేసుకుంటున్నాము


ఇంక ఆ పాట వినేవరకు నిద్రపోకూడదనుకున్నాను(???) .. గూగుల్ లో వెదికి మరి వినడం మొదలు పెట్టాను ...

సి నారాయణ రెడ్డి నా గురించి మరీ ఎక్కువ కొట్టేస్తున్నాడు డబ్బా..నన్ను మెస్మరైజ్ చేసేయాలని తీవ్రం గా ప్రయత్నిస్తున్నాడు అని తెలుస్తుంది ఆ పాట వింటుంటే ....... ఎంత లేదన్నా నాక్కూడా ఆనందం కొట్టుకొచ్చేస్తుంది తెరలు తెరలు గా ..

అలా తన్మయత్వంతో వింటుండగా ఎదో అపశ్రుతి వినిపించింది మరలా ఇంకొక్కసారి క్లియర్ గా వినేసరికి అర్ధమయ్యింది ....

ఇంకా నయ్యం నా పేరు ని ఇమిటేటే చేసే పిచ్చి సన్నాసులు పల్లవి మాత్రమే విని వుంటారు చివరి లైన్ లు విని వుంటే.... హత విధి......... శివ! శివ! ఇలాంటి కష్టాలు పగ వాళ్ళకి కూడా రాకూడదు.

ఏదో సి నారాయణ రెడ్డి నాకు L.K.G. లో క్లాస్మేట్ కద ...నాలుగు ముక్కలు మంచి గా రాయకపోతాడా ? అనుకున్నాను.... కాని ఇలా రావే! పోవే! అంటూ నవ్వుల పాలయ్యేలా రాస్తాడని అస్సలు వూహించ లేదు ... అయినా నా నోము ఇలా తగలడింది . ఏవరిననుకుని ఏమి లాభం ??

ఇంక ఈ పేరు ఎలాగైనా మార్చేసుకోవాలన్నా నిర్ణయానికి వచ్చేసి కొత్త పేర్లు వెదికే పనిలో పడ్డాను .. అలా వెదికినప్పుడు చక్ర తీర్ధం నవల లో హీరోయిన్ పేరు అపూర్వా ఆ పేరు నాకు పిచ్చ పిచ్చ గా నచ్చేసింది ...

రేపటి నుండి ఇదే పేరు తో పిలవండీ అని మా ఫ్రెండ్స్ కి ఓ ఆర్డర్ పడేసాను ... వాళ్ళకి చుప్పనాతి తనం ఎక్కువ అందుకే శివా, అపూర్వా అని పిలిస్తే affectionately గా ఉండదే..... అందుకే ముద్దు గా... అప్పూ అని కాని అప్పమ్మ.. అని కాని లేకపోతే .. అప్పూ డార్లింగ్ అని పిలవమంటావా ? అని ఏడిపించడం మొదలుపెట్టారు .. మీ affection ని దొంగలెత్తుకెళ్ళ.... అప్పు ఉప్పు అన్నారంటే చెప్పిచ్చుకొడతానని వార్నింగ్ ఇచ్చి పడేసాను . A.K.47 తో పిట్టల్ని కాల్చి నట్టు కాల్చి పడేద్దాము అనుకున్నా ...కంట్రోల్ కంట్రోల్ అని నా మనసు హెచ్చరించడం తో ఆగిపోయాను ….

అయినా అందరూ పెళ్ళి చేసుకునే వయసులో పెళ్ళే చేసుకుంటారు కాని నాకు లా నామకరణం చేయించుకునే బంపర్ ఆఫర్ ఎవరికో గాని రాదు ..

ఈ మద్యన ఏదో T.V లో నా పేరు మీద సీరియల్ కూడ వచ్చేసింది ...ఇంకేం ఆ హీరోయిన్ ని అష్ట కష్టాలు పెట్టేస్తారు ఈ తెలుగు సీరియల్స్ వాళ్ళు.... అది చూస్తూ నేను వెక్కి వెక్కి ఏడవాలా?? పక పక నవ్వాలా ?? తెలుసుకోలేని లక్కీ చాన్స్ నాకొద్దు బాబోయ్

ఇంకా ఈ ఘోరాలు నేను చూడలేను అందుకే . పక్క నున్న agriculture ఆఫీస్ కి పోయి" I want a bottle of పురుగుల మందు" అని అడిగాను.. No stock అంది ఆ మేడం .. లేదు ..లేదు ...నాకు 10:10 నిమిషాలకి కావాలి అని అడిగాను.... కచ్చితం గా ఆ టైం కి అంటే బయటకొనుక్కోండి అని ఓ ఉచిత సలహా పడేసింది .. అబ్బ చా …………ఇక్కడయితే 50% సబ్సిడీ ఇస్తారు .....బయట ఎక్కువ రేటు పెట్టుకొని కొనుక్కోడానికి ..నేనేమి తింగరి దాన్ని కాదమ్మా ....నేనసలే చాల గడుసుదాన్ని ...

ప్చ్ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని అడిగాను కాని కుదరలేదు.... అందుకే ముక్కలయిన నా చిట్టి హృదయాన్ని అతికించే పనిలో పడ్డాను ....

అయినా పిల్లలకి పేర్లు పెట్టేముందు 7 తరాల చరిత్ర చూడాలి ఆ పేరు ఆ పిల్లకి సూట్ అవుతుందా లేదా ? ఆ పేరు తో ఆ పిల్ల సుఖపడుతుందా లేదా??? అని చూడరే ఈ పెద్దవాళ్ళు .

అందుకే ఆడపిల్లలకి 18 సంవత్సారాలు మగ పిల్లలకి 22 సంవత్సారాలు నిండిన తరువాత మాత్రమే తమ కి నచ్చిన పేరు ని నిర్ణయించుకునే హక్కు రావాలని,, నూతన రాజ్యంగ సవరణలోనైనా ఇది చట్టబద్దం చేయాలని కోరుతూ సెలవుతీసుకుంటున్నాను యువరానర్!

244 comments:

1 – 200 of 244   Newer›   Newest»
శ్రీనివాస్ said...

ఆ పాటలో చివరి నాలు మాటలు నీవే నా దానివి నీవే నా దానివి అనుకుంటా లొల్ ... :)బాగా వ్రాశారు.

Sravya Vattikuti said...

సూపర్ నాకు నచ్చింది :)

హరే కృష్ణ said...

నేను పెట్టిన చాక్లెట్ల తిని తిని వాడు పళ్ళు పుచ్చిపోయిన గున్న ఏనుగు లా తయారయ్యడు...

అలా బస్ ఎంత పాస్ట్ గా వెలుతుందో అంత కన్న స్పీడ్ గా ఒకరి డప్పు ఒకరు కొట్టేసుకుంటున్నాము

ROFL

చాలా బాగా రాశారు :D

మంచు said...

పేరు నాకు నచ్చింది........నచ్చింది !!!!

ఇప్పుడింతకీ మీకేపేరు కావాలి చెప్పండి "శి"యమ్మా ...ఆ పేరుతోనే పిలిస్తాం

తార said...

హ్మ్,

ఇప్పుడు మార్చుకోండి ఏమున్నది,..మీ ఇష్టం, శ్రియ గారు

కవిత said...

అప్పు డార్లింగ్ ...చాల చాలా బాగా రాసావు...కొన్ని మచ్చు తునకలు...

"శిజ్జినకా శిజ్జినకా అంటారు ..నాకయితే జజ్జినకా జజ్జినకా అన్నట్టు వినిపిస్తుంది "

"అలా బస్ ఎంత పాస్ట్ గా వెలుతుందో అంత కన్న స్పీడ్ గా ఒకరి డప్పు ఒకరు కొట్టేసుకుంటున్నాము"

"అయినా అందరూ పెళ్ళి చేసుకునే వయసులో పెళ్ళే చేసుకుంటారు కాని నాకు లా భారసాల చేయించుకునే బంపర్ ఆఫర్ ఎవరికో గాని రాదు .."

అవును శివ..మా టీవీ లో శివ రంజని సీరియల్ వస్తుంది...ఆ టైటిల్ వినగానే నాకు నువ్వే గుర్తుకు వస్తావు ...ఎంత అందమయిన పేరు నచ్చలేదు అంటావా ????
మరి ఇంతకి నీ బారసాలకు(పెళ్లి ??) మమ్ముల్ని పిలుస్తున్నావా ,లేదా ???

Krishnapriya said...

శివరంజని పాట లా మీ టపా కూడా చాలా బాగుంది!

Anonymous said...

Good name but y don`t u like it...!!

పరుచూరి వంశీ కృష్ణ . said...

టపా చాలా బాగుంది.........చాలా బాగా రాశారు

నీహారిక said...

పోనీ రంజని అని పిలవమంటావా,బంగారం?

Rishi said...

Very hillarious post..Good job.Keep it up.Wanna write a bigggggggg comment but feeling lazy..ఏమీ అనుకొకండేం :)

నాగప్రసాద్ said...

శ్రియా గారు, ఇంకో గూగుల్ ఐడీ, బ్లాగు ఓపెన్ చేసి, వాటిలో మీకు నచ్చిన పేరుతో రాయండి. :-))).. కనీసం బ్లాగుల్లోనయినా మీకు నచ్చిన పేరుతోనే పిలుస్తారు అందరూ... :-))).

శేఖర్ పెద్దగోపు said...

:) బాగుంది.
అదేంటండీ..అంత మంచి పేరు మీకలా ఎందుకనిపిస్తుంది చెప్మా?

నేస్తం said...

శిజ్జినక ఎంత బాగుంది జజ్జినక లాగా ..ఏంటి శివ రంజని..నీపేర్లన్నీ ఇంత బాగుంటే .. మా చెల్లి కూడా నీలాగే ఒకటే గోల దానిపేరు మహేశ్వరి ..కాని మేమందరం మైశ్రీ అనిపిలుస్తాం.. అదీ గొడవే అమ్మదగ్గర ఒక్కళ్ళన్నా కరెక్ట్ గా పలుకుతున్నారా అని :)

జయ said...

నేనైతే చక్కగా శివాని అని పిలుస్తాను. నాకీ పేరు చాలా ఇష్ఠం. నాకీ పేరు పెట్టలేదని ఇప్పటికీ పోట్లాడుతాను. బస్ లో పోతున్నంతసేపు చెప్తూనే ఉన్నాగా...నా కా పేరెంత ఇష్టమో:(

'Padmarpita' said...

టపా చాలా బాగారాశారు!

3g said...

మిమ్మల్ని శ్రియ అని పిలిస్తే చాక్లెట్లవీ ఇస్తారా............ అయితే అదే ఖాయం చేసేద్దాం.
>>అందుకే ఆడపిల్లలకి 18 సంవత్సారాలు మగ పిల్లలకి 22 సంవత్సారాలు నిండిన తరువాత మాత్రమే తమ కి నచ్చిన పేరు ని నిర్ణయించుకునే హక్కు రావాలని,, నూతన రాజ్యంగ సవరణలోనైనా ఇది చట్టబద్దం చేయాలని

ఇది మాత్రం సూపర్ ఈ విషయంలో నామద్దతు కూడా మీకే.

శరత్ 'కాలమ్' said...

పెద్ద టపా కాబట్టి మొత్త౦ చదవలేకపోయాను కానీ భలే సరదాగా వ్రాసారు :D

మాలా కుమార్ said...

శివరంజని పేరు బాగానే వుంది కదా , ఏమైంది ? ఐనా ఈ కాలం పిల్లలకి అమ్మానాన్నలను ఏదైనా అనక పోతే తోచదు సుమీ .

ఆ.సౌమ్య said...

శియా...భలే రాసారు పోస్ట్...నవ్వలేక చచ్చాను పొండి.
మా కోరిక మన్నించి టపా తొందరగా పెట్టినందుకు ధన్యవాదములు.

సి.నారాయణ రెడ్డి పాట ఎపిసోడ్ మాత్రం అదిరింది...ఎంతసేపు నవ్వుకున్నానో అది చదివి.

ఇలాగే పేరు మీద నేనూ ఓ టపా రాసాను, ఇష్టంతోనే సుమండీ. వీలైతే చదవండి.

http://vivaha-bhojanambu.blogspot.com/2010/06/blog-post_07.html

Ramakrishna Reddy Kotla said...

రంజనీ భలే రాసావు...నిజంగా చాలా నవ్వించావు...అయినా నీ పేరుకే నువ్విలా ఫీల్ అయితే, పాపం ఇంకొంత మంది పేర్లకి వాళ్ళెలా ఫీల్ అవ్వాలి?..నువ్వన్నట్లు " పిల్లలకి పేర్లు పెట్టేముందు 7 తరాల చరిత్ర చూడాలి ఆ పేరు ఆ పిల్లకి సూట్ అవుతుందా లేదా ? ఆ పేరు తో ఆ పిల్ల సుఖపడుతుందా లేదా??? అని"..అది నిజమే..పిల్లలకి వాళ్ళ తాత ముత్తాతల పేరులో..లేక దేవుడు పేరులో పెట్టేసి, వాళ్ళు హాపీగా ఫీల్ అవుతారు...కానీ కష్టాలు మనకి తర్వాత స్టార్ట్ అవుతాయి...కానీ, నీకేం అన్యాయం జరగలేదు...నీ పేరు బాగుంది...శివ తీసేసి, రంజనీ చాలా బాగుంది...అందుకే నిన్ను నేను స్టార్టింగ్ నుంచి రంజనీ అనే పిలుస్తున్నా...ఇకపోతే రాజ్యలక్ష్మి, రామలక్ష్మి,శివపార్వతి,నాగలక్ష్మి ఇలాంటి పేర్ల పెట్టబడ్డ వాళ్ళు చేసిన పాపమేమీ .....సుష్మ,శ్రియా,సంహిత,సుస్మితా పేర్లు పెట్టబడ్డ వాళ్ళు చేసిన పుణ్యాలేమి...ఏమిటీ వివక్ష??..నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను..అందుకే నువ్వు చెప్పినట్లు "అందుకే ఆడపిల్లలకి 18 సంవత్సారాలు మగ పిల్లలకి 22 సంవత్సారాలు నిండిన తరువాత మాత్రమే తమ కి నచ్చిన పేరు ని నిర్ణయించుకునే హక్కు రావాలని.." కోరుకుంటున్నాను...

Shiva Bandaru said...

:)

శివరంజని said...

@శ్రీనివాస్ గారు: అవునండీ... ఆ చివరి లైన్స్ అవే...ఆ లైన్స్ విన్నప్పుడు ఏమిటో భయం... ధన్యవాదములండీ పోస్ట్ నచ్చినందుకు.

@శ్రావ్య గారు : మీకు నచ్చిందా ? ఇంతకీ ఎమి నచ్చింది? నా పేరా ? నా పొస్టా ? కామెంట్ నందుకు ధన్య వాదములు..

@హరే కృష్ణ గారు: Thanks అండి నచ్చినవి కోట్ చేసినందుకు :)

శివరంజని said...

@ మంచు గారు:శివరంజని పేరు నచ్చిందా. అయితే శివరంజని పేరు తోనే పిలిచేయండీ... మంచు గారు మనసు ఎప్పుడూ మంచే కద .. నా పేరు లో వంకలు తీస్తున్నారని ఫీల్ అవుతున్నాను అంతే గాని లేక పోతే ఆ పేరంటే నాకు ఇష్టమే...

@ తార గారు: పేరు మార్చుకోమంటారా ? ఇంటిలో కొట్టేస్తారేమోనండి ...అన్నట్టు మీ పేరు చాలా బాగుంది

శివరంజని said...

@హేయ్ కవిత: నా పోస్ట్ నచ్చినందుకు ..నచ్చినవి కోట్ చేసినందుకు Thanks ...thanks ..thanks ...

ఏమిటి ? శివరంజని సీరియల్ చూసినప్పుడు మాత్రమే గుర్తుకు వస్తానా ? మిగతా టైంస్ లో గుర్తుకు రానా ? నేను అలిగాను పో ...

నా పెళ్ళి కి నిన్ను తప్పకుండా పిలుస్తాను .. నువ్వొస్తానంటే నేనొద్దంటానా ????

@ కృష్ణ ప్రియగారు: మీ పేరు లా మీ కామెంట్ కూడా చాలా బాగుంది!

@Anonymous గారు: ఎందుకు నచ్చలేదు అంటే ఏమి చెప్పను ..పేరు ని కూని ని చేసేస్తున్నారని నా భాద

@వంశీ గారు: చాలా Thanks అండి

శివరంజని said...

@నీహారిక గారు: మీ పేరు ఎంత బాగుంటుందో నాకు చాలా ఇష్టం ...
నన్ను రంజని అని పిలుస్తారా ? రంజని అని పిలిస్తే ఇష్టమే కాని ఆ చివర బంగారం అని పిలిచారు కదా మీరు ... హుమ్మా అలా పిలిస్తే ఇంకా ఇష్టం ..సో ఆ బంగారం అలాగే కంటిన్యూ చేసేయండీ ...

@రిషి గారు: మీ కామెంట్ కి biggggggggggg thanks . అంత lazy అయి కూడా నాకు కామెంట్ పెట్టడమే గ్రేట్..నేను కూడా lazy నే లేండి... ఏమి అనుకోను లేదండీ

శివరంజని said...

@నాగ ప్రసాద్ గారు: మీరు ఇలా శ్రియా అని పిలుస్తుంటే నాకెందుకో మీరు ఆ తేజా గాడి బ్రదర్ ఏమో అని నాకు డౌట్ గా ఉంది సుమా !! ఇంకో బ్లాగ్ ఓపెన్ చెయ్యమంటారా? ఇంకా నయ్యం.. నా నాలెడ్జ్ కి ఒక బ్లాగే ఎక్కువ

@శేఖర్ గారు :పేరు బాగానే ఉంటుందండి ..దాని వెనుక పడే తిప్పలు చదివారు కదా అవి కూడా అంతే బాగుంటున్నాయండి ..

@నేస్తం గారు : అబ్బా!! నా పేర్లన్నీ ఎంత బాగున్నాయో అంటారా ??? చూసారా మీకు అంత కామెడీ గా ఉందే?? చెబుతా చెబుతా ఇక నుండి మహేశ్వరి అక్కా నేను ఒక జట్టు అన్నమాట

శివరంజని said...

@ జయ గారు: మీకు ఆ పేరు ఇష్టమయితే అలాగే పిలవండి ... హ హ హ హ హ ఆ బస్ లో జయ గారేనా మీరు.. అప్పుడే అనుకున్న మా జయ గారు కాబట్టే నిలబెట్టడం ఇష్టం లేక సీట్ ఇచ్చారని

@ పద్మార్పిత గారు:Thanks అండి.. ఇన్నాల్లకి నా బ్లాగ్ లో స్వర్ణ కమలం విరిసినందుకు ... ఇంతకీ కమలం, పద్మం ఒకటేనా నాకు తెలియదండి

@3g గారు:వద్దు.. వద్దు... చాక్లేట్స్ తినొద్దు పళ్ళు పాడయిపోతాయి ..ఆ తేజా గాడి లా :):) పేరు సెలెక్సన్ విషయం లో మీ మద్దతు నాకేనా అయితే ఓకే నండి :)

@శరత్ కాలం గారు: అవును టపా పెద్దదేనండి. పూర్తిగా చదవలేక పోయినా పర్వాలేదండి . కామెంట్ నందుకు ధన్య వాదములు

శివరంజని said...

@మాలా కుమార్ గారు: మీ కామెంట్ చూస్తే మా అమ్మ అన్నట్టే అనిపించింది .. మా అమ్మ కూడ ఇంతే.... అబ్బా !! ఈ కాలం పిల్లలకి మనం వేసే జడలు నచ్చవు .. కలర్స్ నచ్చవు అని అంటూ ఉంటారు ...
ఇకపోతే పేరు పెట్టినవాళ్ళని ఏమి అనడం లేదు కాని ఆ పేరు ని కూని చేసేస్తుంటే భాదేసేస్తుంది ..
ఈ కాలం పిల్లలేకాదు ఆంటీ...... పేరెంట్స్ కూడ మాతో మంచి ఫ్రెండ్లీ గా ఉంటున్నారు గా అందుకే ఇంత ఫ్రీ గా మాట్లాడేస్తున్నాం? కోపమొచ్చిందా నా పోస్ట్ కి ఆంటీ(మిమ్మల్ని ఇలా పిలవచ్చా?)


@సౌమ్య గారు: మీ అభిమానం నిర్వచించలేకపోతున్నా... Thank you my friend ..... మీ పోస్ట్ నాకీ ఈ రోజు ఖాళీ లేక చదవలేకపోయాను... రేపు చదువుతానండి ... ఇష్ట పడే సుమా ! కష్టపడి కాదు

శివరంజని said...

@కిషన్ గారు: నాకోసం ఇంత పెద్ద కామెంటా? బాగుంది ...

నా జీవితాంతం రాసిన పోస్టులన్నీ కలిపినా మీ కామెంట్ అంత బరువుండవు .. కాని మీరు అన్ని నిజాలే చెప్పారు ... ఈ విషయం లో మీరు నాకు మద్దతు ఇచ్చారు కదా..మనం అందరూ ఒకటే జట్టన్నమాటా ..

@శివ బండారు గారు: :):):)

శివరంజని said...

@శ్రీనివాస్ పప్పు గారు: మీరు చెప్పినది కరెక్టేనండీ ... . నేను పోస్ట్ ఓన్ గా రాసేయడమే తప్ప ఎవరిని సంప్రదించను ..అందుకే ఆ చిన్న మిస్టేక్ .... ఆ మిస్టేక్ పొరపాటున రాసింది కాదు. Half knowledge తో రాసింది మాత్రమే.. మీరు చెప్పిన ఆ ఉప్పు కళిక తీసేసి పంచదార గుళిక వేసాను చూడండీ .... మీ సలహా చాలా అమూల్యమైనది ...అందుకే ఇలాంటి సలహాలు నాకు చాలా అవసరం .. మిస్టేక్స్ వచ్చినప్పుడు కష్టమనుకోకుండా చెబుతూ ఉండండీ .. మీ కామెంట్ పబ్లిష్ చేయడం లేదు(అర్ధం చేసుకోగలరు) .మీరు వేరే కామెంట్ ఇస్తే హేపీ గా పబ్లిష్ చేస్తా

మాలా కుమార్ said...

అయ్యో కోపం ఎందుకు ? నేను సరదాగా రాశాను . అంతే . పిలవండి ఆంటీ అని , తప్పేమి వుంది ?

శ్రీనివాస్ పప్పు said...

నేను కామెంటు రాస్తున్నప్పుడే అనుకున్నానండి మీరు పబ్లిష్ చెయ్యకుండా విషయం గ్రహిస్తేనే మంచిది అని,ఎనీవే పనిజరిగిందికదా.అదీ సంగతి.

పంచదార గుళిక వేసాక ఇప్పుడు పోస్ట్ అద్దిరింది.

kranthi said...

superga rasaru sivaranjani garu

nagarjuna said...

మీ కష్టాలకు కాదుగాని ఆ screenplay ఉంది చూసారు..అదీ నవ్వాపొకోలేక చచ్ఛా. అదేదో జంధ్యాల సినిమా చూస్తున్నటు క్యామెడి in ట్రాజెడి , త్రివిక్రమ్ సినిమా చూస్తున్నట్టు అక్కడక్కడ పంచ్ డైలాగులూ...హహ్హహ్హ enjoyed a lot :)

చాక్లెట్లు గనక నిజంగా ఇస్తానంటే చెప్పండి, నేను ఇక నా బ్లాగులో రామకోటి రాసినట్టు శ్రియకోటి రాసేస్తాను

ఇక నా పేరు కష్టాలు కూడా సూడండిమరి

http://naa-payanam.blogspot.com/2010/06/blog-post_02.html

శివరంజని said...

@మాలా కుమార్ గారు: thank you ...ఇక నుండి అలాగే పిలుస్తానండీ

@శ్రీనివాస్ పప్పు గారు:Thanks అండి అర్ధం చేసుకున్నారు ..once again thanks a lot

@క్రాంతి గారు:మీ వాల్యుబుల్ కామెంట్ కి నా ధన్యవాదములు

@WIT Real గారు : అయ్యబాబోయ్!! ఉన్న ఒక్కపాటే జీర్ణించుకోలేక ఛస్తుంటే.... మీరేటండి బాబూ???? నా పేరు మీదున్న పాటలన్నీ చెప్పేస్తారా? ఏమిటీ?? మీరు, మీ సి.నారాయణ రెడ్డి గారు మనసులోనే దాచుకోండీ ఆ పాటలన్నీ ...ఇలా ఆ పాటలన్ని ప్రపంచానికి తెలియకూడదని మీ కామెంట్ పబ్లిష్ చేయడం లేదు .. ఏమి అనుకోకండీ .. క్షమించండీ

sunita said...

hahaha!chaalaa navvinchaaru.

శివరంజని said...

@నాగార్జున గారు: పేరు కష్టాల లిస్ట్ లో మీరు ఉన్నారన్నమాట..congratulations :):)..

మీరు చెప్పారు కదా మీ పోస్ట్ చదివా ..కామెంట్ పెట్టాను చూడండి మీ పోస్ట్ లో ....

నిజం చెప్పొద్దూ నా పోస్ట్ కంటే వెయ్యి రెట్లు బాగా రాసారు ..మీ పోస్ట్ చదువుతూ ఆఫీస్ అనే సెన్స్ కూడ మర్చిపోయి,గట్టిగా నవ్వేసాను..

@సునీత గారు: హుం... మీ కామెంట్ కోసమే ఎదురుచూస్తున్నా ..ఇంకా రాలేదేమిటా?? అనుకుంటున్నాను.. నచ్చినందుకు thanks అండీ

3g said...

>>చాక్లేట్స్ తినొద్దు పళ్ళు పాడయిపోతాయి ..ఆ తేజా గాడి లా
అనుకున్నానండి ఇలాంటి కౌంటర్ పడుతుందని. మిస్సవ్వలేదు మీరు. ఇంతకీ ఈ పంచదార గుళిక ఏమిటండీ అదెక్కడుందో చెప్పేస్తే మాకు వెతికే పని తప్పుతుంది.

కొత్త పాళీ said...

కామెడీ బానే ఉంది కానీ మీ పేరుకేం, చాలా చక్కటి పేరు. శివుడికి ప్రీతికరం కావాలంటే మాటలు కాదు! అందుకే ఆ రాగం అంత మధురం. కావాలంటే ఒక్కసారి సువర్ణసుందరి సినిమాలో హాయి హాయిగా ఆమని సాగే పాట వినండి, మీ పేరిటి రాగం ఎంత మధురమో ఐడియా వస్తుంది. తూర్పు పడమరలో బాలు పాడిన పాట బానే ఉంటుంది కానీ రాగం పూర్తి స్వరూపం వినబడదు.

nagarjuna said...

నాకన్నా బాగా రాసాను అంటే మిమ్మల్ని ఏమి అడగకుండానే శ్రియ అని పిలుస్తానని అనుకుంటున్నారేమో శివరంజనిగారు...అలా అనుకుంటే బెంగాళ్ బంగాళాదుంపలో కాలేసినట్టే. చాక్లెట్లు ఇస్తానంటేనే పిలిచేది

సీత said...

amma siva.. sivuduu... sivaalu.. :D :D :D :D :D

hahahahahahahaha!
entasalu aa hatred!

తార said...

@ తార గారు: పేరు మార్చుకోమంటారా ? ఇంటిలో కొట్టేస్తారేమోనండి ...అన్నట్టు మీ పేరు చాలా బాగుంది

ఇంట్లొ చెప్పకండి ఏముంది..
నా పేరు మీకు నచ్చిందా ఎదో మీ అభిమానం...

ఏకాంతపు దిలీప్ said...

baagundi :-)

శివరంజని said...

@3g గారు: కౌంటర్ పడుతుందని వూహించేసారా .హ హ హ ..అయితే పోస్ట్ లో సుగర్ ఎక్కడుంది అని అడగకూడదు మీరు ... పోస్ట్ అంతా షుగరే అని అనాలి...

@కొత్త పాళీ గారు: నా పేరు శివుడికి ప్రీతికరం అయ్యింది కాని అందరికి వెటకారం అయ్యిందండి .. మీరు చెప్పిన సాంగ్ బాగుంటుందా అయితే తప్పకుండా వినాలండి .. నా బ్లాగ్ కి మీరు రావడం ఇదే మొదటి సారి... Thanks alot

@నాగార్జున గారు : మీ దగ్గర కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ పేస్ట్ ఉందా?? అలా అయితే చాక్లేట్స్ పంపిస్తానులేండి .. చాక్లేట్స్ తిన్నాందుకు అయినా మీరు శివరంజని అని నా పేరు తోనే పిలవాలి

శివరంజని said...

@ సీత: హుం... నేను అలిగాను పో ....మిగతా టైంస్ లో స్వీటీ , బంగారం అంటావు ...
ఇప్పుడేమో ఇలా అంటావా? Thanks a lot for your affectionate comment!

@తార గారు: బాగుంది...బాగుంది.. మీ సలహా

@ దిలీప్ గారు: Thanks a lot:}

Anonymous said...

bagundi

hanu said...

chala manchi peru anDi, meeku enduku nachaDam ledo naku ardam kavaDam ledu...... but nijam ga chala manchi peru

అశోక్ పాపాయి said...

బాగ నవ్విస్తున్నారు శివరంజని అని పేరు చాల బాగుదండి.

మనసు పలికే said...

హహ్హహ్హా.. చాలా చాలా బాగుంది మీ టపా శ్రియ గారూ..:) నవ్వు ఆపుకోలేకపోయాను..

శివరంజని said...

@Anonymus: Thanks అండి ...

@Hanu గారు : మీరెంత మంచివారండి నా పేరు ని మెచ్చుకున్నారు ... నిజంగా మంచి పేరే కదూ... కాని అందరు వంకలు పెడుతున్నారని నచ్చడంలేదు...

@అశోక్ గారు : నా పేరు నా పోస్ట్ మీకు నచ్చినందుకు Thanks అండి

@మనసు పలికే (అపర్ణ) గారు ... మీ పేరు చాలా బాగుంది కదా అని నా పేరు మీద కష్టాలు చూస్తే మీకు నవ్వొస్తున్నాయా.. అయ్ ..Thanks for your comment

హరే కృష్ణ said...

శివరంజని గారు జ్వరం నుండి కోలుకున్నారా

హరే కృష్ణ said...

అర్ధ century కామెంట్లు కొట్టిన సందర్భంగా జాజిపూలు అభిమానుల తరుపున ఆభినందనలు

Anonymous said...

Hi sivaranjani,
Visit my Blog : http://gsystime.blogspot.com/

This is having spiritual and general society information.
The way of thinking of thoughts are wonder with my intent to write the Blog.
I written from 2009 December onwards.
I wtitten in Telugu and English languages (In English few things are wrote).
Main Topics covered from Dec 2009 (Note: Important topics I mentioned before
the title as symbol of '*').
Main Topics are : (Read in order to better understand
Tel - (Dec, 2009) 'samaajaanni maarchagalavaa maaragalavaa'
Tel - (Jan, 2010) ' * kshanam antaa telisipoyenaa'
Eng - (Jan, 2010) ' * Second - Everything Knows'
Eng - (Jan, 2010) ' * How Brain Works'
Eng - (Jan, 2010) ' * Where Dream World?'
Eng - (Jan, 2010) ' * Why the Food?'
Eng - (Jan, 2010) ' * About Soul - Six Sense's '
Tel - (Feb, 2010) ' * Jana ganamuna'
Tel - (Feb, 2010) ' * Prakrutigaa panchaboothamulu yelaa '
Eng - (Feb, 2010) ' * How Nature starts in Universe '
Tel - (Feb, 2010) ' * Medhassu yelaa pani chestundi? '
Tel - (Feb, 2010) ' * Kalala lokam yekkada? '
Tel - (Feb, 2010) ' * Aahaaram enduku? '
Tel - (Feb, 2010) ' * Aatma - Aaru "yeruka"lu '
Tel - (Feb, 2010) ' * Nidra Yelaa Vastundi? '
Tel - (Feb, 2010) ' eenaadu nedai rojugaa '
Tel - (Mar, 2010) ' * Neti samaaja sthiti yevariki '
Tel - (Jun, 2010) ' Hithamu palikinatlu chetulu - Caption: "Aatmgnaanam
chendavaa shwaasa neelone kadaa!" '
Tel - (Jul, 2010) ' Mounangaa unnaanani naalo agnaanam - Caption:
"Aatmgnaanam chendavaa shwaasa neelone vishwamaa!" '
These two caption's so many written along with these.
* * * Tel - (May, 2010) ' * Naa Naannanu ' - In this topic I written single
letter of words and sentences in telugu (In Note book I wrote more than 1000
lines : for Record).

As soon as possible please give reply to my mail, about my Blog.

Regards,
Nagaraju G
Contact : +91 9741005713 for any queries"

మనసు పలికే said...

శివరంజని గారూ.. కోప్పడకండీ.. నా పేరు గురించి ఎందుకు అడుగుతారు లెండి. దాని గురించి కూడా ఒక పెద్ద టపా రాసెయ్యొచ్చు..:)
ముందుగా మీకు అభినందనలు 50 కామెంట్లు పూర్తి చేస్కున్నందుకు.. ఈ సారి సెంచరీ కన్ను మీ బ్లాగు మీదే ఉంది కృష్ణ గారికి..:)హిహ్హిహ్హి..

శివరంజని said...

@ హరే కృష్ణ గారు: జ్వరం తగ్గిందండి ..

నాకస్సలు జ్వరమంటేనే తెలియదు అలాంటిది నాగార్జున గారి బ్లాగ్ లో చేసిన సారీ ల వ్రతానికి జ్వరం వచ్చి ఉంటుందండి ...
మర్చిపోలేదు.. గుర్తుంది.. గుర్తుంది...ఆ సారీల వ్రతం వెనుక హస్తం మీదే కదూ :):)

మీ ఆభినందనలు కి నాకు జ్వరం దెబ్బకి పోయింది. Thank youuuuuuuuu.

@Anonymus గారు : మీ బ్లాగ్ తప్పకుండా చూస్తానండి

@@మనసు పలికే (అపర్ణ) గారు : అరే ! మీకు నేను కోప్పడినట్టు అనిపించిందా??లేదండి బాబు మీ పేరు చూసి కుళ్ళు కుంటున్నానంతే :).
ఏదో అర్ద సెంచరీ కొట్టుండొచ్చుకాని మీ లా , నేస్తం అక్కలా సెంచరీలు కొట్టేంతా టాలెంట్ మాత్రం లేదండీ బాబు నాకు ...once again Thanks అండి మీ అభినందనలకి ...

హరే కృష్ణ said...

హేమిటో! మీ జ్వరం నాకు అంటగట్టుకుంది
వరలక్ష్మి వ్రతం పోస్ట్ లో రెండొందలు కామెంట్లు అయ్యాక తగ్గుతుందేమో చూడాలి

హరే కృష్ణ said...

ఆ సారీల వ్రతం వెనుక హస్తం మీదే కదూ
నా మీద బూర్జువా వ్యవస్థ కుట్ర ఇది

మనసు పలికే said...

శివరంజని గారు, మీకు సెంచరీ కొట్టే టాలెంట్ లేదా..? హెంత మాట హెంత మాట.. చూడండి.. ఈ రోజు మీతో సెంచరీ కొట్టిచ్చి కానీ నిద్ర పోము నేను కృష్ణ..;)
ఏమంటావు కృష్ణ?
మొత్తానికి మీ సారీ ల వ్రతం, కృష్ణ గారి సెంచరీల వ్రతం త్వరగా ముగించి జ్వరం తగ్గించుకుంటున్నారన్న మాట. నేస్తం అక్క బ్లాగులో 2 సెంచరీలు త్వరగా పూర్తి కావాలనిన్నూ, కృష్ణ జ్వరం త్వరగా తగ్గిపోవాలనిన్నూ మనస్పూర్తిగా కోరేస్కుంటున్నాను..:)

శివరంజని said...

@హరే కృష్ణ గారు: అయ్యో! మీకు కూడా జ్వరమేనాండీ ?? ఇప్పుడు ఎలా ఉందండి??..

వరలక్ష్మీ దేవి కి ప్రతి రూపం లాంటి నా చేత తార గారికి సౌమ్య గారికి సారీ చెప్పించారు కదా అందుకే వచ్చి ఉంటుంది జ్వరం ... నేను చాలా గుడ్ గర్ల్ ని నా జ్వరం ఎవరికి అంటగలప లేదు బాబోయ్ .... మీ జ్వరం రేపటికల్లా పోతుందండి ...

మనసు పలికే said...

ఏదీ ఎక్కడ.. నా వ్యాఖ్య కి ప్రతి వ్యాఖ్య..?

హరే కృష్ణ said...

కనకదుర్గ అమ్మవారికి ప్రతిరూపం ఎవరో తెలుసా మీకు

హరే కృష్ణ said...

వ్యాఖ్య కి ప్రతి వాఖ్య రాయాల్సిందే

హరే కృష్ణ said...

మధిరేంద్రుడుకి ప్రతిరూపం తార
పైడి తల్లి అమ్మవారికి ప్రతిరూపం సౌమ్య గారు

మీరు చెప్పారు కదా మీ ప్రతిరూపం
సేవ్ చేసి పెట్టుకుంటా :)

శివరంజని said...

@అపర్ణ గారు: హ...హ..హ... అబ్బో మీ వాక్య కి ప్రతి వాక్య ఇవ్వాలంటే టాలేంట్ తో పాటు చురుకుదనం కూడా కావలండోయ్

మనసు పలికే said...

శివరంజని గారు.. మీరు మరీ అలా పొగిడెయ్యకండి ప్లీజ్.. నాకు కొంచెం సిగ్గెక్కువ;) మీకు మరీ నన్ను పొగడాలనిపిస్తే, ఆఫ్ లైన్ లో పొగిడెయ్యండి..:P

హరే కృష్ణ said...

ఎక్కడ ఎక్కడ నేను రాసిన కామెంట్
చురుకుదనం కావాలంటే బూస్ట్ తాగండి

శివరంజని said...

@అపర్ణ గారు: ఏమిటండీ దగ్గరుండి కొట్టిస్తారా సెంచరీ వద్దు బాబోయ్ నాకు సిగ్గేస్తుంది కూడా....

అపర్ణ గారు ఎక్కడుంటే అక్కడ సెంచరీలేనన్నమాట ...మీ రాక తో నా బ్లాగ్ కి అదృష్టం పట్టేసింది...

హరే కృష్ణ said...

మీ రాక తో నా బ్లాగ్ కి అదృష్టం పట్టేసింది...
అంటే మా రాక తో మీ బ్లాగ్ కి దరిద్రం పట్టుకుంది అనేగా
i hurted

మనసు పలికే said...

సెంచరీలు కొట్టిచ్చేది నేను కాదండీ బాబూ.. మన కృష్ణ గారు. ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది..:) నా టపాలో అయితే మరీ దగ్గరుండి కొట్టించారు సెంచరీ, ఆయనొక్కరే బౌలింగ్, ఫీల్డింగ్ చేసుకుంటూ..

మనసు పలికే said...

కృష్ణ గారూ.. మరి నేనెవరి ప్రతి రూపం..??

శివరంజని said...

బాబోయ్ హరే కృష్ణ గారు భలే చెప్పారండి మీరు వస్తే దరిద్రం పట్టుకుంటుంది అని అన్నానా ... పోనీ మల్లి చెప్పేయమంటార సారీ

హరే కృష్ణ said...

భలే చెప్పారండి
ఏం చెప్పాను భలేగా
???

మనసు పలికే said...

ఇదేంటి కృష్ణ.. నేస్తం అక్క దాంట్లో 200 పూర్తి చేద్దామంటే అలా బ్లాగుని ఒంటరిగా వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయారు..:( ఇలా అయితే ఎలా..?

శివరంజని said...

బాబోయ్ ఇంత ఫాస్ట్ గా కామెంట్ కి రిప్లై పెట్టడానికి బూస్ట్ కాదు కదా సెలైన్స్ ఎక్కించుకున్నా సరిపోయేలా లేదు

మనసు పలికే said...

నేను అలిగాను. నా వ్యాఖ్య కి ప్రతి వ్యాఖ్య ఎవ్వరూ పెట్టడం లేదు..

హరే కృష్ణ said...

Aparna
వేణురాం ఇంకా రాలేదు అందుకే ఆగాను

హరే కృష్ణ said...

అపర్ణ
మీ అద్దం లో చూసుకుంటున్నప్పుడు ఒక మొహం కనిపిస్తుంది మీరు వారి ప్రతిరూపం :) :)

మంచు said...

ఎంటీ హాడావుడి :-)) శివరంజని కొత్తగా సారీలు ఎమయినా చెబుతుందా... :-))

శివరంజని said...

హరే కృష్ణ గారు ఎంత మాట అండి మీరు వస్తే దరిద్రం పట్టుకుంది అని నేను అంటానా చెప్పండి ??? నేను గుడ్ గర్ల్ ని కదా అలా అనను

శివరంజని said...

అబబ్బా ...ఎవరు అలగొద్దు .. మద్యలో పవర్ కట్ అయింది అందుకే రిప్లై ఇవ్వడానికి లేట్ అయ్యింది

మనసు పలికే said...

ఏం కట్ అయినా నాకు సంబంధం లేదు. మీరు నాకు ఆన్ టైం రిప్లై ఇవ్వనందుకు హరే కృష్ణ నాకు సారీ చెప్పాలి.. అంతే..
మంచు గారు.. ఎప్పుడూ శివరంజని గారేనా..? ఈ సారి కొత్తగా కృష్ణ గారితో చెప్పిద్దామని నా ప్రయత్నం.. నాకు సపోర్ట్ చేస్తారా..?

మనసు పలికే said...

కృష్ణ.. ఏంటీ..? నేనూ అద్దం లో చూస్కుంటే నా ప్రతి రూపం కనిపిస్తుందా..? ఇప్పుడు నాకు సారీ లు చెప్తున్నావుగా..

మనసు పలికే said...

శివరంజని గారూ.. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సారీ లు చెప్పొద్దు.. మళ్లీ జ్వరం తెచ్చుకోవద్దు..:) నేను మీ వెనకాలే ఉంటాను ఈ సారి..

మనసు పలికే said...

ఏవీ..? ఎక్కడ..? హరే కృష్ణ గారి సారీలు..? వెయ్యి కళ్లతో (క్లిక్కులతో) ఎదురు చూస్తూ ఉన్నాను ఆ సారీ ల కోసం..:)

శివరంజని said...

అపర్ణ గారు నాకు సపోర్ట్ ఇస్తానన్నరు కదా మరి పవర్ పోయినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి మరి

మనసు పలికే said...

శివరంజని గారూ.. ఇంత లేట్ అయితే ఎలా అండీ..? బూస్ట్ , గ్లూకోన్D, హార్లిక్స్, బోర్న్ విటా.. ఇంకా చాలా తాగేసి చురుకుదనం తెచ్చేస్కోండి. .:)

మనసు పలికే said...

అందుకే కదా మిమ్మల్ని కాకుండా హరే కృష్ణ గారిని సారీలు చెప్పమంటున్నాను..:)

మనసు పలికే said...

ఇదేంటి.. ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోయారు..?? ఇక్కడ సెంచరీ పూర్తి చెయ్యాలి అన్న దృఢ సంకల్పంతో ఈ రోజు శివరంజని గారి బ్లాగు తలుపులు తడితే..!!

శివరంజని said...

అపర్ణ గారు , హరే కృష్ణ గారు మీ కామెంట్ ల వర్షం లో నేను తడిసిపోయి మల్లీ జ్వరం వచ్చేసేలా ఉంది .. కామెంట్ కి రిప్లై పెట్టాలంటే నేను సెలైన్స్ పెట్టించుకోవాలేమో

మనసు పలికే said...

వద్దు వద్దు.. మీరు అంత పని చెయ్యకండి. మీరు లేట్ గా రిప్లై ఇచ్చినా పర్వాలేదు.. మా పని మేము చేస్కుంటూ వెళ్లిపోతాము..:) జస్ట్ మా కామెంట్లు పబ్లిష్ చేస్తే చాలు..;)

3g said...

ఏం జరుగుతుందండీ ఇక్కడ.... మాలికలో ఓపక్క మొత్తం మీ బ్లాగ్ కామెంట్లే ఉంటే మీ కొత్తపోస్ట్ ఏమైనా మిస్సయ్యానేమో అనుకున్నా....

హరే కృష్ణ said...

మీరు రెస్ట్ తీసుకోండి శివరంజని గారు

శివరంజని said...

అపర్ణ గారు ,నాకు తోదు ఉంటాను అన్నారు కదా అందుకే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయుంటారు . భయ పడకండి నేను ఉన్నానులే మీకు

హరే కృష్ణ said...

అపర్ణ మీకు towel ఇస్తుంది లెండి మరేం ఫర్వాలేదు

హరే కృష్ణ said...

అపర్ణ గారు ,నాకు తోదు ఉంటాను అన్నారు కదా అందుకే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయుంటారు

this is about me???

మనసు పలికే said...

హమ్మయ్య.. అంతా వచ్చేసినట్లున్నారు కదా..:)

హరే కృష్ణ said...

అవును మొత్తం మీ బ్లాగ్ కనిపిస్తోంది మాలిక లో

హరే కృష్ణ said...

అపర్ణ మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని అన్నారా ?

హరే కృష్ణ said...

అపర్ణ మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని అన్నారా ?

మనసు పలికే said...

ఇప్పుడు, ఎంచక్కా అంతా దగ్గరుండి సెంచరీ పూర్తి చేపించొచ్చు శివరంజని గారితో.. :)

హరే కృష్ణ said...

వంద కామెంట్స్ చేరువ లోనికి వచ్చేసారు

హరే కృష్ణ said...

బావుంది ఈ హడా వుడి

శివరంజని said...

హరే కృష్ణ గారు , అపర్ణ గారు , మీరు ఇంతలా కష్టపడుతుంటే నేనేలా రెస్ట్ తీసుకుంటాను ... Thank You my friends

హరే కృష్ణ said...

99

హరే కృష్ణ said...

100 comments :D :D

మనసు పలికే said...

ఇప్పుడు ఆనందం గా ఉంది నాకు..:)

హరే కృష్ణ said...

మళ్లే వందవ కామెంట్ నాదే
:P

హరే కృష్ణ said...

yahoo :P :P

మనసు పలికే said...

ఈసారి ఎవరిదో 100..;)

మనసు పలికే said...

నాదేనా..?

మనసు పలికే said...

శివరంజనీ.. మీరు సెంచరీ పూర్తి చేశారూ.. !! అభినందనలు.. మీరు ఇలాగే సెంచరీల మీద సెంచరీలు కొట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..:)

శివరంజని said...

బాబోయ్ నాకు సిగ్గేస్తుంది ...ఇలా 100 కామెంట్ లు చూసేసరికి

హరే కృష్ణ said...

అపర్ణ మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని అన్నారా ?

this is 100th comment
belongs to me :)

హరే కృష్ణ said...

శివరంజని గారు మొదటిసారిగా వంద కామెంట్లు పూర్తిచేసుకున్నదుకు అందుకోండి ఆభినందనలు

మనసు పలికే said...

కృష్ణ..హిహ్హి.. మళ్లీ 100 గుంజిళ్లు మీకే..;)

హరే కృష్ణ said...

Friends అని అంటారు
హరే కృష్ణ గారు , అపర్ణ గారు అని పిలుస్తారు

అపర్ణ వచ్చ్చి కూడా చెప్పాల్సిందే గార్లు తగిలించొద్దు అని

మనసు పలికే said...

ఈ విషయంలో నేను కృష్ణ కే సపోర్ట్ చేస్తున్నాను..:)

మనసు పలికే said...

116 కూడా చదివించేసుకున్నాం..:)

శివరంజని said...

బాబోయ్ నాకు సిగ్గేస్తుంది ...ఇలా ఇన్ని కామెంట్ లు చూసేసరికి .. హరేకృష్ణ గారు అపర్ణ గారు మీ అభినందనలు అందుకున్నాను అలాగే నా ధన్యవాదములు కూడ అందుకోండి మీరిద్దరు

హరే కృష్ణ said...

హరేకృష్ణ గారు అపర్ణ గారు
we dont like this at all
హరేకృష్ణ , అపర్ణ అని పిలవాలి
otherwise we feel tht we are not your friends

మనసు పలికే said...

అలా పిలవకపోతే మీ ధన్యవాదాలు మాకొద్దు..

శివరంజని said...

ఏకవచనంలో వెంటనే పిలిచేయమంటే ఎలా అండీ .. అలవాటు చేసుకోనివ్వండి

మనసు పలికే said...

అయితే మీరలా సిగ్గు పడుతూనే ఉండండి.. ;)
మేమెళ్లి నేస్తం అక్క టపాలో 200 చేసే పనిలో ఉంటాం..:):)

శివరంజని said...

ఏకవచనంలో నే పిలుస్తాను సరేనా మా మంచి ఫ్రెండ్స్ కదూ

మనసు పలికే said...

అదీ.. అలా రా దారికి..:)

హరే కృష్ణ said...

:) :)
good girl

శివరంజని said...

వంద కామెంట్ లు వచ్చినందుకు సిగ్గేస్తుంది కాని . .. Heart full గా చెబుతున్నా ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికినందుకు చాలా చాలా happy గా ఉంది . మరి ఈ ఫ్రెండ్ ని ఎప్పుడూ వదలకూడదు అలా అయితేనే ఫ్రెండ్స్

మనసు పలికే said...

మరద్దే.. పుసుక్కున ఫ్రెండ్స్ అనేసుకున్నాక ఎక్కడైనా వదిలేస్తారేటి..? మరీ ఎకసెక్కాలు,..(L.B.Sreeram Dialog)

మనసు పలికే said...

nagarjuna said...

ఆఆర్రే...ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ ఏదో బావున్నట్టుంది. ఒకరికొకరు బాగా సాయం చేసుకుంటున్నాం. కాబట్టి మిత్రులారా మనందరం కలిసి వ.బ్లా.స (వంద కామెంట్ల బ్లాగర్ల సంఘం) కాని యు.బ్లా.స (యువ బ్లాగర్ల సంఘం) కాని పెడదాం. అవసరమైన వాళ్లకు సారిలు గాని, కామెంట్లుగాని సప్లై చేయడం ఈ సంఘం పని. స్థాపించే ముందు మన సభ్యులు ఎవరెవరో వాళ్ల బ్లాగులో సెంచరీ కొట్టాలి. హరేకృష్ణ తదుపరి చాన్స్‌ నీదేనోయ్ :) :)

మనసు పలికే said...

Good Idea నాగార్జున..:) ఫాలో అయిపోదాం.. అదెంత పని, కృష్ణ బ్లాగుని ఒక్క పూట కబ్జా చేస్తే చాలు, కామెంట్ల వర్షం కురుస్తుంది..:) Attack..

Anonymous said...

వంద కామెంట్లు అయ్యాయని మీరొక్కరే పార్టీ చేసుకోవడం అన్యాయం

100 comments చేయిపించిన మిత్రులకు కూడా ఇవ్వకపోవడం దారుణం

శివరంజని said...

హేయ్ అపర్ణ: సారీ అంత అవసరమా?అవసరమా ?? అని అడుగుతున్నా ... అయినా నువ్వు పెట్టిన కామెంట్ లో తప్పేమి కనిపించడం లేదు నాకు ... నువ్వు అనవసరం గా ఫీల్ కాకు... పైగా నా సారీ ల వ్రతం నువ్వు తీసుకున్నావా? ఏమిటీ ? నీ కామెంట్ కి రిప్లై పెట్టడానికి లేట్ అయ్యింది అందుకు నేనే చెప్పలి సారీ...
నాకు ఓన్ Laptop లేదు .. పైగ పవర్ ప్రోబ్లం అందుకే లేట్ రిప్లై ... ఏమి అనుకోకు . నేను లేట్ గా కామెంట్ పబ్లిష్ చేసినా లేట్ గా రిప్లై ఇచ్చిన ఇదే కారణం ...

@ నాగార్జున గారు మీ ఐడియా కెవ్వు కేక....

శివరంజని said...

@Anonymus గారు: పార్టీనా అండి? సరే నండీ .. పార్టీ అంటేనే ఫ్రెండ్స్ తో కదండి నేనొక్కరిదాన్నే ఎలా చేసుకుంటాను మీరందరు లేకుండా ?

హరే కృష్ణ said...

నిన్న పొద్దున్న కల్లా జ్వరం తగ్గిపోతుంది అని అన్నారు నాకు ఇంకా నీరసం తగ్గలేదు
అందరికీ జ్వరం తగ్గినప్పుడే పార్టీ పెట్టుకుందాం

Anonymous said...

ఇక్కడ ఎవరో సారీల వ్రతం మొదలెట్టినట్టున్నారు, నాకు కూడ ఒక సారి చెప్పుకోండి, లేకపొతే మీ వ్రతం ఫలవంతం కాదు..

శివరంజని said...

అదేమిలేదు పార్టీ ఇప్పుడే... ఎందుకంటే ఇప్పుడు పార్టీ అంటేనే పార్టీ కోసమైనా జ్వరం తగ్గించుకుంటారు ... ఇంతకీ పార్టీ పార్టీ అంటున్నారు అందరూ ఇంతకీ ఏ పార్టీ తెలుగుదేశం ,కాంగ్రెస్ . బిజేపి ఏ పార్టీనబ్బా?

శివరంజని said...

@తార గారు : వావ్ ! సారీల కి కూడా ఇంత డిమాండ్ ఉందాండీ

హరే కృష్ణ said...

మేమంతా అపర్ణ పార్టీ కే
మీరు మాకు అపర్ణ పార్టీ ఇవ్వాలి

హరే కృష్ణ said...

మా అందరి పళ్ళు పుచ్చిపోయేవరకు పార్టీ ఇవ్వాల్సిందే

హరే కృష్ణ said...

తార కి స్పెషల్ పార్టీ ఇవ్వాలి
మధిర ను ధారబోస్తేనే తను తన దీక్ష ని విరమించుకుంటాడు :)

హరే కృష్ణ said...

హేమిటో మా కామెంట్లకు రిప్లై నే ఇవ్వడం లేదు ఇంక పార్టీ ఏం ఇస్తారో
తారా శివరంజని వద్దు అపర్ణ నే మంచిది

శివరంజని said...

హ ..హ... ఇంతకీ సారీ లు కావాలా? పార్టీ లు కావాలా? ఈ విషయం అపర్ణ గారికే వదిలేస్తున్నా

హరే కృష్ణ said...

మాలిక లో మళ్ళా form లోనికి వచ్చేసింది మీ బ్లాగ్

హరే కృష్ణ said...

తార కు సారీ
మాకు పార్టీ
అపర్ణ కి chocolates కావాలి

శివరంజని said...

అపర్ణ Take care నువ్వు మంచిదానివని అంటే పార్టీ ఇస్తావంట అందుకే అలా ఐస్ పెడుతున్నాను అని చెప్పారు నాకు హరే కృష్ణ గారు

శివరంజని said...

నాకు ఓన్ Laptop లేదు .. పైగ మాది విలేజ్ కాబట్టి పవర్ ప్రోబ్లం అందుకే లేట్ రిప్లై ... ఏమి అనుకోకోకండి . నేను లేట్ గా కామెంట్ పబ్లిష్ చేసినా లేట్ గా రిప్లై ఇచ్చిన ఇదే కారణం

nagarjuna said...

>>ఇంతకీ ఏ పార్టీ తెలుగుదేశం ,కాంగ్రెస్ . బిజేపి ఏ పార్టీనబ్బా << ఛా...సెటైరా..!!??

సరే అలాగేకాని..,
కాంగ్రెస్ పార్టి: జాతీయ పార్టి, అనగా ఏ స్టార్‌ హోటళ్ళొనో ఇవ్వాలి.

బీజేపీ: జాతీయ పార్టి, కొంచెం స్టార్ హొటల్లో ఇచ్చినా సరిపెట్తుకుంటాం, ఫ్రెండు పార్టి ఇస్తుంటే ఆమాత్రం సర్దుకోగలం

తెలుగుదేశం:లోకల్‌ పార్టి, అనగా జనాలు ఎంతమందైనా రావచ్చు. మాహాసభలా దద్దరిల్లాల్సిందే.

హరే కృష్ణ said...

అపర్ణ కి ఎందుకు ఐస్
మీరు తార కి supply చేస్తున్నారు ఐస్

హరే కృష్ణ said...

నూట యాభై కామెంట్లు బాబోయ్
సిగ్గేస్తోంది అని అనేయండి :)

హరే కృష్ణ said...

150 comments
ఆభినందనలు :)

హరే కృష్ణ said...

నాగార్జున కెవ్వ్
:))))

హరే కృష్ణ said...

నా కామెంట్లు పబ్లిష్ చెయ్యలేదు వా ఆ...

శివరంజని said...

@ హరే కృష్ణ గారు సారీ నేను సరదాగా అన్నాను కోప్పడకండీ ..మీరు పార్టీ కోసం ఐస్ పెడుతున్నారు అన్నాను అంతే . నేను ఎవరికి ఐస్ పెట్టడం లేదు బాబోయ్...అయినా అంత అవసరం ఏముందండీ మీకయినా నాకయినా ? కదా ?

@ నాగార్జున గారు మీ తెలివితేటలకి నా జోహార్లు ... ఎంతైనా అంధ్రా బెంగాల్ తెలివితేటలు మిక్స్ చేసి కొడుతున్నారు ? ఈ బ్లాగ్ కి మహాసభ లా అంత పార్టీ అవసరం ...

హరే కృష్ణ said...

హరే కృష్ణ గారు సారీ నేను సరదాగా అన్నాను కోప్పడకండీ

గారు అని కూడా సరాదా కనే అన్నారా శివరంజని :)

శివరంజని said...

హమ్మో అందరూ తెలివైన వాల్లే నేను తప్ప

హరే కృష్ణ said...

నిన్న ఫ్రెండ్ అని మమ్మల్ని పిలిచి ఈరోజు గారు అని పిలుస్తారా
మా మనోభావాలు గాయపడ్డాయి

హరే కృష్ణ said...

ఆభినందనలు చెబితే ధన్యవాదాలు చెప్పనందుకు నాగార్జున కి కూడా పార్టీ ఇవ్వాల్సిందే

హరే కృష్ణ said...

మీ తెలివితేటలూ అమోఘం కావాలంటే తార ని అడగండి

nagarjuna said...

పోనీ 150 కామెంట్లు వచ్చిన సంధర్బంగానైనా బీరువాల దాచిన దాన్ని బయటకు తీయి. అడిగితే ఇది కూడా పండగ అని చెప్పేయొచ్చు ;)

హరే కృష్ణ said...

నేను క్లినిక్ కి వెళ్ళాలి
శివరంజని నిన్న తగ్గిపోతుంది అని చెప్పింది ఇంకా తగ్గాలా అని మీ మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నా
రాజ్ ధాకరే తో వస్తా గోదావరికి ఆయ్
బై

శివరంజని said...

ఫ్రెండ్స్ అని చెప్పి ధన్యవాదములు అడిగినందుకు నా మనోభావాలు గాయపడ్డాయి

nagarjuna said...

కృష్ణ: కలియుగంలో వెంకన్న అప్పులన్నా తీరుతాయేమోగాని మనకు పార్టిలు తీసుకునే భాగ్యం లేదనుకుంటానయ్యా. ఇవ్వాల్సినవాళ్ళందరూ ఐసు, నైసు అని పక్కన పెట్టేస్తున్నారు...ప్చ్

nagarjuna said...

@శివరంజని:>>ఫ్రెండ్స్ అని చెప్పి ధన్యవాదములు అడిగినందుకు నా మనోభావాలు గాయపడ్డాయి<<

అదీ..ఎక్కడా తగ్గొద్దంతే, రెచ్చిపో... గోదావరి అమ్మాయిల తడాఖా చూపించంతే. చెప్పగానే బీరువా తెరిచినట్టున్నావు :)

శివరంజని said...

కృష్ణ గారి కి జ్వరం అలాంటప్పుడూ మనం పార్టీ ఎలా చేసుకుంటాము చెప్పండీ పాపం కదా

హరే కృష్ణ said...

ఆభినందనలు చెబితే ధన్యవాదాలు చెప్పనందుకు నాగార్జున కి కూడా పార్టీ ఇవ్వాల్సిందే

ధన్యవాదాలు చెప్పమన్నది నాకు కాదు నాగార్జున కి

nagarjuna said...

కృష్ణ: వచ్చీరాగానే అక్క బ్లాగుకొచ్చెయ్..ఇవ్వాళ డబుల్‌ కొట్టాల్సిందే..

శివరంజని said...

నా తెలివితేటాలు బీరువాలోనన్నా ఉన్నాయి కదా అని ఇంతకు ముందు అనిపించేది ఈ బ్లాగ్ లో మీ అందరి తెలివితేటలు చూసాక నాకింక

హరే కృష్ణ said...

శివరంజని said...

అదేమిలేదు పార్టీ ఇప్పుడే... ఎందుకంటే ఇప్పుడు పార్టీ అంటేనే పార్టీ కోసమైనా జ్వరం తగ్గించుకుంటారు

అలాంటప్పుడూ మనం పార్టీ ఎలా చేసుకుంటాము చెప్పండీ పాపం కదా

ముమ్మాటికీ పాపం మీ ద్విచక్షణ వైఖరి

శివరంజని said...

ధన్యవాదాలు చెప్పమన్నది నాకు కాదు నాగార్జున కి


Note this point నాగార్జున గారు

అంటే నాగార్జున గారు ఫ్రెండ్ కాదా అని అడగండి హరే కృష్ణ గారిని

హరే కృష్ణ said...

హేమిటో! అక్క శివరంజని అంత ఖాళీగా ఉండరు కదా కాస్త బిజీ ఉంటారు

తప్పకుండా చేద్దాం 250 +

హరే కృష్ణ said...

కాదు నాగార్జున మీకు ఫ్రెండ్ కాదు ఫ్రెండ్ కాదు

హరే కృష్ణ said...

నాగార్జున
నిన్ను మళ్ళీ నాగార్జున గారు అని పిలిచి నీ ఏకవచన సంబోధన పోస్ట్ ని కించపరిచింది
తను శరత్ కి అపాలజీ చెప్పాల్సిందే

శివరంజని said...

నా తోడు మా అపర్ణ గారు వచ్చాక చెబుతా అందరికి సారీలు

nagarjuna said...

శ్రరత్ భాయ్...!! ఇప్పుడు ఆయనెందుకు సామి.హైదరాబాదులో ఎదోమూల దర్జాగా ఉన్నాడు. అపాలజీ అంటే వాళ్ల అమ్మాయి ఫంక్షన్‌ మానేసి బ్లాగులో సెటిలైపోతాడు, తరువాత మనల్ని అపాలజీ అడుగుతారు

మంచు said...

ఒక కన్ను ఇటు వేసే వుంచాను...జాగ్రత్త... మా గొదావరి అమ్మయిలను ఏమన్నా అంటే అప్పుడు చేప్తా.... :-))

nagarjuna said...

ఇంతకీ అపర్ణేది...హేమిటి ఇంకా అటెండెన్సు వేయలేదు. వీకెండ్‌ అని నిద్రపోతూనే ఉందా.. :D

nagarjuna said...

ఉర్కోండి మంచుగారు..., అసలే పార్టి ఇస్తానంటుంది అట్టాంటిది మేము ఎందుకు అంటాం (ఆ తంతు ఏదో ముగిసాక మాకు సంబంధంలేదు)

శివరంజని said...

హేమిటో !!!అందరూ నన్ను తింగరి దాన్ని చేసేసి పార్టీ లు , సారీలు తెగ అడిగేస్తున్నారు

హరే కృష్ణ said...

అపర్ణ మా తోడు

హరే కృష్ణ said...

జాజిపూలు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచినందుకు మీరు అపాలజీ చెప్పాల్సిందే

మంచు said...

సరే తన బదులు నేను పార్టీ ఇస్తాలే.. పార్టి కావాల్సిన వాళ్ళందరు వరసగా శివరంజనికి, నాకు, నేస్తం గారికి అపాలజి చెప్పేయండి...

హరే కృష్ణ said...

కాసేపట్లో వేణూరం కూడా వచ్చి సగటు జాజిపూలు hardcore అభిమానిగా మిమ్మల్ని డిమాండ్ చేయబోతున్నాడు

శివరంజని said...

హ...హ...హ...నేను కూడా జాజిపూలు అభిమానినే

హరే కృష్ణ said...

:)))
ఇప్పుడు అపాలజీ చెప్పేస్తే రెండు వందలు ఎవరు చేస్తారు

శివరంజని said...

హ...హ...హ...నేను కూడా జాజిపూలు అభిమానినే...ఇంక అపాలజీ ఎందుకు

nagarjuna said...

అనుకున్నదే జరిగింది. కృష్ణ.., శ్రియ మనకు పార్టి ఇచ్చినా తిసుకోవద్దు. మనం తనని ’తింగరి’ ని చేస్తున్నాం అని మన మీద కుట్రపన్ని మంచు గారితో కలిసి ప్లాన్ చేసి కూల్ డ్రింక్‌లో ఏదన్నా కలిపితే !? నహీ....నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి బాబోయ్, దేశానికి మనలాంటి సుజనులు కావాలి‌. ’శ్రియ...’ మా బంగారం కదూ నాకు పార్టి ఏం వద్దులే....కావాలంటే మా పేరుతో బ్యాంకులో డిపాజిట్టొ, ఓ చెక్కో పడేసెయ్. నీ పేరు తలచుకొని మేమే సెలబ్రేట్‌ చేసుకుంటాం

హరే కృష్ణ said...

మీరు జాజిపూలు అభిమాని
కాని శరత్ కాదు అందుకే :)

శివరంజని said...

నీహారిక గారు బంగారం అని పిలుస్తారు ఇప్పుడు మీరు బంగారం అని అన్నందుకైనా పార్టీ ఇస్తానులేండి

వేణూరాం said...

avunu.. nenu demand chestunna...
:)
SIvaranjani garu... post adirindi...

శివరంజని said...

వేణురాం గారు పోస్ట్ సంగతేమో కాని కామెంట్స్ మాత్రం అదిరిపోతున్నాయి

nagarjuna said...

హర్జంటుగా నేస్తం ఆన్లైన్‌ రావాలని డిమాండు చేస్తున్నా...అభినానులందరు ఉన్నారు. సీనియర్ డబుల్‌ కొట్టకుండా జూనియర్ డబుల్‌ కొట్టేసేలా ఉంది పరిస్థితి

nagarjuna said...

వ.బ్లా.స లేక యు.బ్లా.స ఎంటే అదే మరి

వేణూరాం said...

post sangati emo antaaremitandi? sooper ga undi..
ika comments antaraa..! mana batch undigaa ikkada..:) :)
thanks to harekrishna... tanu cheppaka pote mee blog miss ayyi undevadini.

nagarjuna said...

ఎవరు కామెంటితే మీటరు తిరిగి బ్లాకైద్దో ఆళ్ళె వ.బ్లా.స

హరే కృష్ణ said...

బంగారం శివరంజని గారి అమాయకత్వం వర్ధిల్లాలి

శివరంజని said...

సీనియర్ డబుల్‌ కొట్టకుండా జూనియర్ డబుల్‌ కొట్టేసేలా ఉంది పరిస్థితి

నేనేమి కొట్టాను నా మొహం.. ఇదంతా నా టాలెంట్ ఏమి కాదు ..మీరందరు పోనీలే ఫ్రెండ్ కదా అని దగ్గరుండి కొట్టిస్తున్నారు కామెంట్స్

హరే కృష్ణ said...

i second nagarjuna

హరే కృష్ణ said...

నాగార్జున
బంగారం అంటే అపర్ణ కదా
శివ అయితే కాదు

«Oldest ‹Older   1 – 200 of 244   Newer› Newest»