Friday, 3 September 2010

నా బ్లాగ్ బర్త్ డే..... కావాలి మీ అందరి స్వీట్ విషెస్

ఎప్పుడో సంవత్సరం క్రితం మా నాన్న తీసుకువచ్చిన బిర్యాని పార్సిల్ లో వచ్చిన పేపార్ లో చూసాను స్నేహమా బ్లాగర్ రాధిక గారి గురించి.. అప్పటికి బ్లాగ్ అంటే ఏమిటో నాకు అస్సలు తెలియదు.

దీనిని బట్టి మీకు తెలిసిన నీతి ఏమిటి ?????
బిర్యాని బాగ తినడం వలన కొత్త కొత్త విషయాలు తెలుస్తాయన్నమాట!

అందుకే మీరు బిర్యాని బాగా తినండి మరో ముగ్గురి చేత తినిపించండి మీ బిల్ల్ తో

అలా ఆ స్నేహమా బ్లాగ్ లో కవితలు అన్ని పూర్తిగా చదివేసాను ఆ కవితలు నా లాంటి మట్టి బుర్రకి కూడా బాగా అర్ధమయ్యేలా చాల సరళం గా, ముచ్చటగా ఉండేవి ..ఆ బ్లాగ్ ద్వారా నాకు చాల బ్లాగ్ లింక్ లు దొరికాయి ..అప్పటికి నాకు ఈ అగ్రిగేటర్ లు కూడ తెలియదు... తెలిసినా బ్లాగ్ లు ఇవే ..

నాన తిప్పలు పడి బ్లాగ్ క్రియేట్ చేసుకున్నాను.. బ్లాగ్ క్రియేట్ చేసుకోవడం లో భ్లాగ్ గురువు బ్లాగ్ నాకు బాగా ఉపయోగపడింది. క్రియేట్ చేసిన మరుసటి రోజు పోస్ట్ రాసాను . .. నా పోస్ట్ లు చూసి అందరూ ఎగతాళిగా నవ్వుతారేమో అని భయం వేసేది ..ఏడిపించడం చాల ఈజీ నవ్వించడం చాల కష్టం ... పోనీలే ఎలాగయితే అందరిని నవ్వించామా లేదా అన్నది ముఖ్యం అనుకుని నా నిద్ర పోస్ట్ రాసాను

నా నిద్ర పోస్ట్ రాయడానికి రెండు నెలలు పట్టింది. కొట్టడం ,రాయడమే సరిపోయేది....పైగా ఇక్కడ ఏందరో మేధావులు రాస్తున్నారు.. అందుకే నాకు రాయడానికి చాల భయం వేసింది ...నాకేమో తెలుగులో ల - ళ కి ద- ధ కి కూడా తేడా తెలియదు. ఏది ఎక్కడ ఉపయోగించాలో కూడ తెలియదు.. తెలుగు కూడ సరిగా రాదంటే ఇంగ్లీష్ లో ఏదో ఇరగదీసి రాసేస్తానని కాదు... పాపం ఇంగ్లీష్ నేను చేసే అవమానాలకి తట్టుకోలేక ఎప్పుడో ఆత్మ హత్య చేసుకుంది....

అందుకే పొస్ట్ రాయడం కంటే కామెంట్ పెట్టడమే చాల ఈజీ అనిపించేది.. నేనెప్పుడు అంతే... చాల గుడ్ గర్ల్ ని కదా , అందుకే ఈజీ గా ఉండే పనులే చేస్తాను ఎక్కువ గా స్ట్రెయిన్ అయ్యే పనులు , అడ్వంచర్స్ చేయడం అస్సలు ఇష్టం వుండదు ..అందుకే నా బ్లాగ్ ని చక్కగా బజ్జోమని చెప్పి అందరి బ్లాగ్ ల లో కామెంట్ లు పెట్టడం మొదలు పెట్టాను

అలా కామెంట్ లు పెట్టిన వాళ్ళందరూ కూడా ఎంత సేపు నిద్రపోతావమ్మాయ్ కొత్త పోస్ట్ రాయి అనేవారు...

కిషన్ గారయితే తన బ్లాగ్ లో కామెంట్ పెట్టిన ప్రతి సారి రిప్లై గా కొత్త పోస్ట్ ఎప్పుడు రాస్తావు రంజని అని అడుగుతూనే వుండేవారు ... ఈ సార్ ఏంటీ కామెంట్ పెడితే చక్కగా ఆనందించక నా పోస్ట్ గొడవెందుకు ఈయనకి అనుకునేదాన్ని ... పాపం ఆ సార్ అలా encourage చేయ బట్టే ఈ రోజు కి రెండు పోస్ట్ లన్నా రాసాను లేకపోతే నా బ్లాగ్ ని ఎప్పుడో నెగ్లెక్ట్ చేసేసేదాన్ని ..

సరే లే అందరూ కొత్త పోస్ట్ రాయమంటున్నరు కదా చదివే వాల్లకే భయం లేనప్పుడు రాసే నాకెందుకు భయం అని అనుకుని నా బ్లాగ్ ని చూసాను కదా నా బ్లాగ్ నిద్రపొవడం లేదు..కాని చలనం లేకుండా పడి ఉంది ..

ఇదేమి కర్మ రా బాబు కొంపదీసి నా బ్లాగ్ కి పొలియో కాని వచ్చిందా?? అని అనుమానం వేసింది ..

అప్పడికి అమితాబ్, ఐశ్వర్యలు T.V లో చెబుతూనే ఉన్నారు.. మీ బ్లాగ్ కి పోలియో పోలియో డ్రాప్స్ వేయించండి ...పోలియో ని సమూలం గా నిర్మూలిద్దామని.... నేనే పెడ చెవిని పెట్టాను .. భాదపడి ప్రయోజనం లేదు .... అందుకే దానిని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాలని అనుకున్నాను...

కిషన్,నీహారిక, , సౌమ్యా, సీత, కవిత, నేస్తం , అపర్ణ ,నాగార్జున , హరేకృష్ణ, 3G, శేఖర్ , మంచుపల్లకీ, శ్రీనివాస్ పప్పు , జయ , మాల కుమార్ ,సునీత ,శ్రీలలిత , జ్యోతి, దీప , శిశిర , స్పురిత వంశీ కృష్ణ , రాణి , రిషి శ్రావ్య , శ్రీనివాస్ ,తార , శరత్,శివ బండారు , కొత్త పాళీ రాధిక అశోక్ హను మదురవాణి , రవీంద్ర, అవ్యయ ,శివ , , ప్రణీత , , మానస , వేణురాం , చంద్ర , కిరణ్ ఇంకా అజ్ఞాతలు గా కొందరు వీరందరు తమ చల్లని చేత్తో తలో పొలియో డ్రాప్ వేసేసరికి నా బ్లాగ్ ఈ మధ్యనే పాకడం మొదలు పెట్టింది .మీ అందరి అభిమానం కాని ఆప్యాయత కాని ఎప్పటికి మర్చిపోలేను ...నా బ్లాగ్ ని ఎప్పటికి ఇలా ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను కూడా ..


అందరి బ్లాగ్ ల్ల నా బ్లాగ్ చకా చకా నడిచేసి స్కూలుకెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదివేసి అంతకంటే పెద్ద ఆఫీసర్ కానక్కర్లేదు ..కనీసం అందరి బ్లాగుల్లా పరిగెత్తలేకపోయినా నడిచినా చాలు … నాకదే పదివేలు …


సరే …ఇంతకన్నా ఎక్కువ రాయలేకపోతున్నా బర్త్ డే అంటే బోలెడు పనులుంటాయి మీకు తెలియనిది ఏముంటుంది .?

నేనింకా మా బ్లాగాయిని చిట్టి చిలకమ్మలా అలంకరించాలి , గుడికి తీసుకెళ్ళాలి దాని పేరు మీద అర్చన చేయించాలి ..

అందుకే మీరంతా చకా చకా వచ్చి మీ sweet wishes అందించి ,మీ వంతు చాక్లేట్స్ తీసుకెళ్ళడం మరచిపోకండే .........

112 comments:

Ramakrishna Reddy Kotla said...

రంజనీ ముందుగా నీ బ్లాగుకి నా హృదయపూర్వక మొదటి జన్మదిన శుభాకాంక్షలు... నీ బ్లాగు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, మమ్మల్ని ఎంతో అలరించాలని కోరుకుంటున్నాను... నా గురుంచి ప్రస్తావించినందుకు ధన్యుడిని...నీలో చాలా టాలెంట్ ఉంది రంజనీ..మంచి హ్యూమర్ కూడా ఉంది..అందుకే నువ్వు రాసిన నిద్ర టపా నాకు చాలా నచ్చింది...ఆ టపా చూసిన తరువాత, తరువాయి టపా ఎప్పుడు రాస్తావా అని ఎదురు చూసే వాడిని..కానీ నువ్వు రాయలేదు..అందుకే ప్రతిసారీ అడిగేవాడిని కొత్త టపా రాయమని..ఎందుకంటే నీలో ఉన్న హ్యూమర్ గా రాసే టాలెంట్ నాకు తెలుసు కాబట్టి... మొత్తానికి నీ చేత మరో రెండు టపాలు రాయించి సఫలీకృతుడిని అయ్యాను...ఇంకా మరెన్నో టపాలు నీ చేత రాయిస్తాను తప్పదు, ఎందుకంటే నీకు నువ్వుగా రాయట్లేదుగా మరి...సరేనా?? :-)

జ్యోతి said...

యాపీ యాపీ బ్లాగ్ బర్త్ డే. మరి మాకు కేకు ముక్కో,చాక్లెట్టో ఇవ్వరా??

హరే కృష్ణ said...

మా శివరంజని బ్లాగ్ కి జన్మదిన శుభాకాంక్షలు
happy happy birthday

from
జాజిపూలు అభిమానులు మరియు
నాగార్జున అపర్ణ వేణూరాం మరియు హరే కృష్ణ

nagarjuna said...

శివరంజని....బిర్యోనిజురాలు (బిర్యాని నుండి పుట్టినది అని కనిపెట్టా ) అయిన నీ బ్లాగుకు య్యాపి య్యాపి బర్తుడే :)

నీలో నిజంగా సూపర్‌ టాలెంట్ ఉంది. నిజానికి ఆ ద్విశతక కామెంట్లు అయినరోజు వరకు నీ మొత్తం టపాలు చదవలేదు...ఒక్క ’నువ్వు నాకు నచ్చలేదు’ తప్ప. తరువాత రోజు మొదటినుండి చదివాను...OMG అనిపించింది. ఇంత బాగా రాస్తున్న అమ్మాయిని ఊరకె ఆటపట్టించామేమో అని తెగ ఫీలయ్యాను ( ఇది చెప్పి నేనేమి expect చేయట్లేదమ్మోయ్...మళ్ళి నువ్వు ఫీలయి ఏదేదో అనేస్తావ్ :D )

నువ్వు మరిన్ని టపాలు రాయాలని కోరుకుంటూ..నీ బ్లాగుకి పోలియో డ్రాప్స్ వేయమని సూచించిన బచ్చ్‌న్ ఫ్యామిలికి థ్యాంక్స్‌ చెప్తు........నా చాక్లె‌ట్‌ను పోస్టులో పంపగలవని ఆశిస్తున్నా....

nagarjuna said...

వ.బ్లా.స తరఫున కూడా య్యాపి బర్తుడే :)

తార said...

ఇంకొంచం కృషి చేస్తే ఇంకా మంచి టపాలు పడతాయి, మనం అప్పుడు చక్కగా నేస్తం అక్కాయ్ గారి మీద పోటి చేయొచ్చు..

ఇంతకీ పేరు మార్పిడి పూర్తి అయ్యిందా?

అప్పుడే సంవత్సరం అయ్యిందా, కానీ మూడు టపాలే అంటే కాస్త నిరాశగా ఉన్నది మరి..

శేఖర్ పెద్దగోపు said...

హేపీ బర్త్ డే టు 'శివరంజని' బ్లాగు...
మొత్తానికి పోలియో డ్రాప్స్ వేసి పాకించానంటారు మీ బ్లాగు..సరేగానీ ఆ చుక్కల మందేదో నాకూ ఇవ్వండి..నా బ్లాగుకి వేస్తాను...మీకో విషయం చెప్పనా ఈ సంధర్బంగా..మీ నిద్ర టపా చదివి ఈ అమ్మాయెవరో అచ్చంగా మనబాపతులానే ఉందని తెగ నవ్వొచ్చింది నాకు....ఒకసారి మీ ఇంట్లో కనుక్కోండి సంతలోనో, జాతరలోనో అన్నయ్యో/తమ్ముడో/కజినో తప్పిపోయిన లేదా ఆస్పటల్‌లో పిల్లలు మారిపోవడాలు లాంటి ఫ్లాష్ బ్యాక్‌లు గట్రా ఉన్నాయేమో మీకు...:-):-)

కవిత said...

Happy happy birth day to your blog,ranjani....Biryani thinadam valla kotha vishayalu thelusthaya???ithe ma intlo roju biryani konipettamani cheputha.Naku kuda neela chala vishayalu thelusthayi.Emantaav???

Poliyo chukkalu vesanu kabatti...naku oka biryani ,cake and chacolates panpinchu.Ledu ante nenu Kishan gari nunchi collect chesukunta mari.

కవిత said...

@shekar,

Super ga chepparu....alage mee intlo meeru kuda okasari confirm chesukondi.Nenu kuda me bapathe mari."andharu brathakadani ki pudithe,nuvvu nidra podani ke puttav anukunta " ani maa srivaaru roju thidathane untaru.

Ranjani...nuvvu kuda confirm cheyamma okasaari.

తార said...

వీరందరు తమ చల్లని చేత్తో తలో పొలియో డ్రాప్ వేసేసరికి నా బ్లాగ్ ఈ మధ్యనే పాకడం మొదలు పెట్టింది .మీ అందరి అభిమానం కాని ఆప్యాయత కాని ఎప్పటికి మర్చిపోలేను ...నా బ్లాగ్ ని ఎప్పటికి ఇలా ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను కూడా ..

------------

సెంటిమెంటు ఎక్కువయ్యి, నాకు ఎక్కిల్లు వచ్చాయి..
నాకు ఇంకా చెప్పడానికి మాటలు కుడా రావడం లేదు, కాసేపు, ఫీల్ అయ్యి వస్తాను..

మనసు పలికే said...

Happy Happy Birthday to Sivaranjani Blog..:)

ఇంకా టపా చదవలేదు.. చదివి మళ్లి కామెంటుతా..:)

మనసు పలికే said...

హిహ్హిహ్హీ.. రంజనీ చాలా చాలా బాగుంది నీ బ్లాగు ప్రయాణం పుట్టినప్పటి నుండి..;)
బాబోయ్ అన్ని పోలియో డ్రాప్స్ వేయించావా.?? తప్పకుండా పరిగెడుతుంది చూడు నీ బ్లాగు మరి కొద్ది రోజుల్లో. యు.బ్లా.సం. దృష్టిలో పడింది కదా.. ఏమంటారు సంఘ సభ్యుల్లారా!!
@ తార గారూ.. ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారా..?? అయిపోయిందా..:))

Anonymous said...

yu drank my polio drops

శ్రీనివాస్ పప్పు said...

బాగుంది సుక్కల మందు కత.సక్కటి 2-3 పోస్టులతో సంవత్సరం తిరక్కొట్టినందుకు అభినందనలు.ఇంకా ఇలానే యమాస్పీడుగా ఈ ఏడు కూడా బోల్డు కొన్ని పోస్టులు రాసేసి మాకు కన్నీళ్ళు(నవ్వి నవ్వి రావాలి సుమా)తెప్పించండి.

గంగిగోవుపాలు గరిటడైననేమి...ఆయ్ అదీ సంగతి మరి.

మంచు said...

సారి శివరంజని... నేను లేట్‌గా విషెస్ చెబుతున్నాను...సారి సారి సారి సారి సారి సారి సారి సారి సారి సారి :-) (నీ స్టైల్ లొ )

నీ బ్లాగు పెద్ద పెద్ద చదువులు చదువులు చదివేసి .. పెద్ద కలెక్టర్ ఉద్యొగం (చిన్న కలెక్టర్ కాదు) ఉద్యొగంచేస్తూ .. రొశయ్య తొ వీడియో కాంఫెరెన్స్ లొ మాట్లాడుతూ వుంటే ..నువ్వు పక్కనుండి చూస్తూ ఆనంద బాష్పాలు రాల్చాలని కోరుకుంటూ :-))))

Anonymous said...

కిషన్ 2
నీహారిక 2
సౌమ్యా 2
సీత,2
కవిత 2
నేస్తం 2
అపర్ణ 2
నాగార్జున 2
హరేకృష్ణ 2
3G 2
శేఖర్ 2
మంచుపల్లకీ 2
శ్రీనివాస్ పప్పు 2
జయ 2
మాల కుమార్ 2
మొత్తం 30
సునీత ,శ్రీలలిత , జ్యోతి, దీప , శిశిర , స్పురిత వంశీ కృష్ణ , రాణి , రిషి శ్రావ్య , శ్రీనివాస్ ,తార , శరత్,శివ బండారు , కొత్త పాళీ రాధిక అశోక్ హను మదురవాణి , రవీంద్ర, అవ్యయ ,శివ , , ప్రణీత , , మానస , వేణురాం , చంద్ర , కిరణ్25 x 2=50
ఎనభై పోలియో చుక్కలు తాగేసారా
great
happy happy birthday

మనసు పలికే said...

హహ్హహ్హా. మంచు గారి విషెస్ సూ...పర్..:))

Anonymous said...

బంగారం నీ బ్లాగ్ కి జన్మదిన శుభాకాంక్షలు

sunita said...

Happy Happy Birthday to Sivaranjani Blog:-)

వేణూరాం said...

mee blog ki janmadina subhaakamkshalu...

వేణూరాం said...

మా శివరంజని బ్లాగ్ కి జన్మదిన శుభాకాంక్షలు
happy happy birthday

from
జాజిపూలు అభిమానులు మరియు
నాగార్జున అపర్ణ వేణూరాం మరియు హరే కృష్ణ..

harekrishna...! Ekkadoo....TOuch chesaru...

Anonymous said...

అజ్ఞాత పేరు కూడా రాసినందుకు నా కల్లెంట నీళ్ళు ఆగడం లేదు శ్రియ గారు
thank you and happy birthday

తార said...

ఎక్కడా, ఇక్కడ ఇంకో సీరియల్ పెట్టారు, అది ఇంకా భయ, భాధ, పెడుతున్నది, ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నాను..

Anonymous said...
This comment has been removed by a blog administrator.
మనసు పలికే said...

వేణురాం గారూ.. నిజం. నాకైతే కళ్లు చెమర్చినంత పని అయింది..:). కృష్ణ నమ్మకపోవచ్చు కానీ,నిజ్జంగా నిజం అండీ బాబూ..
@ తార గారూ!! అయ్యయ్యో..:(( మీ బాధ చూసి నాకు కన్నీళ్లు వచ్చేస్తున్నాయి ఇక్కడ..

మాలా కుమార్ said...

బ్లాగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు .

శిశిర said...

శుభాకాంక్షలు.

జయ said...

హాయ్ డబుల్ సెంచురీ శివానీ, పుట్టిన రోజు జేజేలు. మంచు గారి దీవెనే నాది కూడాను. పోనీ మా కాలేజ్ లో చేర్పిస్తే మాంఛి సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తాం. డబుల్ సెంచురీ కదా, ఫ్రీ సీట్ గ్యారెంటీ. చాక్లెట్లో, కేక్ ముక్కలో మాత్రం మాకు సరిపోవమ్మాయ్.

చెప్పాలంటే.... said...

బ్లాగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు .

తార said...

మంచుగారు నాక్కుడా ఒక పది అపాలెజీలు చెప్పాలి మీరు..

3g said...

ఏంచెప్పాలో తెలియట్లేదండి, ఎలాచెప్పాలో తెలియట్లేదండి, ఎందుకుచెప్....ఛ... ఇది తెలుసు మీ బ్లాగు పుట్టినరోజు కదా!!! మీ బ్లాగు ఇలాగే మరిన్ని వసంతాలు పూర్తి చేసుకోవాలని, మీరిలాగే శివాలెత్తించే పోస్టులు జనరంజకంగా అందివ్వాలని, శివరంజని బ్లాగ్జన మనోరంజనం గావించాలని కోరుకొంటూ సెలవు తీసుకొంటున్నాం.. జై హింద్.

వేణూరాం said...

palike garu.. kallu chamarchayaa?? endukata??asalu meeranta jaaajipoolu abhimaanulenaa ani prasnistunna..?

bendapparao garini kaneesam khandinchaledu... malli dilogues matram chebutunnnaru..:) !!

గీతిక said...

హాయ్ హాస్యరంజని,

మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే.

ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో మన బ్లాగ్ మిత్రుల సమక్షంలో మరింత వేడుకగా చేసుకోవాలని మనసారా కోరుకుంటూ...

గీతిక

నీహారిక said...

రంజని,
శ్రీ లలితగారు, నీ బ్లాగులో మొదటి కామెంట్ పెట్టటం వల్లే నీ బ్లాగు దిగ్విజయంగా 200 కామెంట్లు అతి త్వరలో పూర్తి చేసుకుంది. కాబట్టి లలిత గారికి స్పెషల్ ధాంక్స్ చెప్పాలి, తెలిసిందా?
నా పేరునే కాకుండా నా బంగారాన్ని కూడా ఎవరో ఎత్తుకెళ్ళారు. నేను ఆలొచించి మరో చక్కటి పేరుతో పిలుస్తానే!!
వచ్చే సంవత్సరం మరిన్ని పోస్ట్ లతో అలరించాలని, మీ బ్లాగ్ పాపాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

నేస్తం said...

సంవత్సరానికి మూడే మూడు పోస్ట్లతో బ్లాగ్ లోకంలో ఇంతమంది అభిమానులని సంపాదించుకున్న ఘనత నీదే :) శుభాకాంక్షలు

Shiva Bandaru said...

శుభాకాంక్షలు

Anonymous said...

మీరు ఇదే విధంగా శివా లత్తి మరీ అపాలజీ లు చెప్పాలని కోరుకింగ్స్
బ్లాగు జన్మదిన శుభాశీస్సులు

enjoyy

శ్రీలలిత said...

బ్లాగు ప్రథమ జన్మదిన శుభాకాంక్షలు

Krishnapriya said...

శివరంజని,
బ్లాగు పుట్టిన రోజు శుభాకాంక్షలు!

శేషేంద్ర సాయి said...

మీ బ్లాగు పుట్టిన రోజు సంధర్భంగా శుభాకాంక్షలు

నేనూ ఈ మధ్యలోనే బ్లాగు మొదలెట్టా. మరి నేను టికాలు వేయించుకోవాలేమో ...అసలే సూది మందు అంటే నాకు భయం :(

Anonymous said...

ఆ ఆ ఆ ఆ ఆ ఆ
శివ రంజని
శివ రంజని శివానందలహరి శివశంకరి
శివానందలహరి శివ రంజని
శివానందలహరిశివ రంజని

చరణం1:

చంద్ర కలాధరి ఈశ్వరి ఈ ఈ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ
చంద్ర కలాధరి ఈశ్వరి
కరుణామృతమును కురియజేయుమా
మనసు కరుగగా మహిమ చూపవా దీనపాలనము సేయవే
శివ రంజని శివానందలహరి శివ రంజని
శివ రంజని శివానందలహరి శివానందలహరి శివ రంజని
శివ రంజని శివానందలహరి శివ రంజని
శివ రంజని శివానందలహరి శివ రంజని

చరణం2:

చంద్ర కలాధరి ఈశ్వరి
రిరిసనిదనిస మపదనిస దనిస దనిసదనిస
చంద్ర కలాధరి ఈశ్వరి
నిరి సనిపమదా రిగపా
రిరి నిస రిమపదా మపనిరి నిసదప
చంద్ర కలాధరి ఈశ్వరి
దనిస మపదనిస సరిగమ రిమపని దనిస
మపనిరి సరినిస దనిప మపనిసరి రిసరిగా ననీ
పని పనిమప గమ పని పనిమప గమ
గనిసా సరిమపనిదానిస సరిమపనిదానిస సరిమపనిదానిస
చంద్ర కలాధరి ఈశ్వరి
చంద్ర కలాధరి ఈశ్వరి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
శివ రంజని ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
శివ రంజని


తోం తోం తోం దిరితోం దిరితోం దిరితోం దిరితోం త్రిత్రియన దరితోం
దిరిదితోం దిరిదితోం దిరిదితోం పారియాన
దిరి దిరితోం తోం దిరిదిరితోం తోం తోం దిరిదిరితోం దిరిదిరితోం దిరిదిరి తక దిరితోం
దిరి దిరి దిరి దిరి దిరి దిరి నాందిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి నాందిరి దిరి
దిరి దిరితోం దిరి దిరి నాందిరి దిరి దిరి దిరి దిరితోం
నినినినినిని దనినిదనినిని పససనిగసదసనిని నిరిరి సరిరి సనినని
సగగ రిదగనిస సనిని సని
నిసస నిసస నిద దనిని దనిని దప
రిరి దద దగనిని రిరిదద దగరిరి దగరిరి రిరిదద హనిగిని గదదద
రీరిరీరి నినిని రీరిరి నినిని గాగగగ నినిని రీరీరీదమా
రిమని దనిస ననిస మపమరీగా
సరిగప మపమమ సరిగప పనిమప సరిగప పనిమపసరిమప పనిమపమపమపనిదద
మపమపనిదదమపమపనిదదమగమగదనీస మగమగదనీసమగమగదనీసమమమ
ససస గగన నినిని ససస రిరిరి సరి సని సా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ


శివరంజని అందుకో ఈ శుభాకంక్షల లహరి

swapna@kalalaprapancham said...

Happy birthday.
indaka rasina comment enduko radamledu. mi blog naku parichayam ledu thakkuvaga posts rasatara?
wish you all the best.

ఇందు said...

మీ బ్లాగు కి జన్మదిన శుభాకంక్షలు... :)

durgeswara said...

శుభాకాంక్షలు

Vinay Chakravarthi.Gogineni said...

blog look baagundi.........

వేణూ శ్రీకాంత్ said...

అభినందనలు శివరంజని గారు, బ్లాగ్ ప్రథమ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. నేస్తం గారు అన్నట్లు అతి తక్కువ టపాలతో ఇంతమంది అభిమానం సంపాదించుకున్న ఘనత మీదే :) మీ టపాలన్నీ ఇపుడే చదివాను చాలా బాగున్నాయ్ :-)

Jaabili said...

Happy blog birthday Sivudu..

Sai Praveen said...

Congrats శివరంజని.
నీ నిద్ర టపా నా favourites లో ఎప్పుడు ఉంటుంది. నీ బ్లాగు ఇలాగే మమ్మల్ని అలరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.
మరి పోలియో చుక్కలు వేసేస్తే సరిపోదు, నీ బ్లాగుని నీలాగా ఆటలో అరటి పండులాగ ఉంచకుండా తొందరగా పరిగెత్తించు :)

పరుచూరి వంశీ కృష్ణ . said...

happy birthday .wishes to sivaranjani blog........

హరే కృష్ణ said...

50 comments!
congrats

అశోక్ పాపాయి said...

తెలుగు బ్లాగ్ ప్రపంచంలో అంతో ఇంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి శివరంజని గారి బ్లాగు పేరు సుపరిచితమే అనుభవాలు ...అంతరంగాలు...అన్నీ సరద పరదాల పదాల పందిరిలో తెలుగు బ్లాగర్లపై హస్యపు జల్లుల్ని విరజిమ్ముతు ఈబ్లాగువనంలో మీదైన శైలిలొ ముద్రవేసుకున్నారు.నిజానికి వ్యంగం కలిసిన హస్యం ఒకదానికొకటి సహకరిస్తూ ఉంటే తప్ప అచ్చంగా హస్యం రక్తి కట్టకపోవచ్చు. కాని మీ బ్లాగులో మాత్రం కావలసినంత హస్యము అంతకుమించిన వ్యంగ్యము నిత్యం విలసిల్లుతూ ఉంటుంది.కొత్తపెళ్లికూతురిల హస్యం ఎప్పుడు ముస్తాబై కనబడుతుంది.ఇంక మరిన్ని శతకోటి టపాలతో మీబ్లాగు ముందుకు ఆశిస్తూ.....

వివినిపించు..మైమరపించు.. మీ హస్యంతో మమ్మల్ని సంతోషపరుచు మా రంజని హస్యరంజని శివరంజని ...మీ బ్లాగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు శివరంజని గారు.....

అశోక్ పాపాయి said...

తెలుగు బ్లాగ్ ప్రపంచంలో అంతో ఇంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి శివరంజని గారి బ్లాగు పేరు సుపరిచితమే అనుభవాలు ...అంతరంగాలు...అన్నీ సరద పరదాల పదాల పందిరిలో తెలుగు బ్లాగర్లపై హస్యపు జల్లుల్ని విరజిమ్ముతు ఈబ్లాగువనంలో మీదైన శైలిలొ ముద్రవేసుకున్నారు.నిజానికి వ్యంగం కలిసిన హస్యం ఒకదానికొకటి సహకరిస్తూ ఉంటే తప్ప అచ్చంగా హస్యం రక్తి కట్టకపోవచ్చు. కాని మీ బ్లాగులో మాత్రం కావలసినంత హస్యము అంతకుమించిన వ్యంగ్యము నిత్యం విలసిల్లుతూ ఉంటుంది.కొత్తపెళ్లికూతురిల హస్యం ఎప్పుడు ముస్తాబై కనబడుతుంది.ఇంక మరిన్ని శతకోటి టపాలతో మీబ్లాగు ముందుకు ఆశిస్తూ.....

వివినిపించు..మైమరపించు.. మీ హస్యంతో మమ్మల్ని సంతోషపరుచు మా రంజని హస్యరంజని శివరంజని ...మీ బ్లాగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు శివరంజని గారు.....

శివరంజని said...

ముందుగా నా బ్లాగ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ఆత్మీయులు అందరికి heart full గా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి …

అలాగే సారీ, సారీ,సారీ,సారీ,సారీ,సారీ,
సారీ,సారీ, సారీ,సారీ,సారీ,సారీ,లు కూడ చెప్పుకుంటున్నాను... ఎందుకంటే లేట్ గా రిప్లై ఇస్తున్నందుకు + మీ అందరికి ఈ పోస్ట్ లో పేరు పేరు న కృతజ్ఞతలు చెప్పలేకపోయినందుకు …..

నాకు ఒకే ఒక శత్రువు ఆ జన్మ శత్రువు వున్నడండోయ్.. ఆ శత్రువే electricity డిపార్ట్మెంట్ … నకస్సలు సహకరించడు … ఈ మద్యన మరీ బొత్తిగా సహ కరించడం మానేసాడు … పైగా వర్షం కారణం గా ఇంటెర్నెట్ కనెక్ట్ కావడం లేదు..

అరగంటలో వీలైంత చిన్న పోస్ట్ రాయలనే ఉద్దేశం తో హడావిడిగా రాసేసాను ...అందుకే అందరికి విడి విడి గా స్పెషల్ thanks చెప్పుకోలేకపోయాను....

కాని మీరందరు ఆ విషయమే పట్టించుకోలేదు ఎంతో ఆప్యాయం గా కామెంట్స్ పెట్టారు .....

రాసే తీరు ఎలా వుందో నాకే తెలియదు ఏదో రాసేస్తున్నాను కాని మీరు ప్రోత్సాహించే తీరు చూస్తే No మాటలు..only ఆనంద భాష్పాలు ..

మీరందరూ నాకు అభిమానులు కాదు ఆత్మీయులు ఇప్పటికీ ...ఎప్పటికే .....

అన్నట్టు తార గారు సెంటిమెంట్ ఎక్కువయ్యిందని మళ్ళీ ఫీల్ అవుతారేమో ...ఏమి చేస్తాం సెంటిమెంట్ కీ ఆయింట్మెంట్ లేదు ..తప్పదు

శివరంజని said...

@కిషన్ గారు: మీరు అన్నిసార్లు అడగకపోతే నేనస్సలు నా బ్లాగ్ పట్టించుకునేదానినే కాదు ..సో ఈ క్రెడిట్ అంతా మీకే ...
అన్నట్టు స్పురిత గారు కూడా అడిగేవారండోయ్ ... ఈ క్రెడిట్ లో ఆవిడ కి కూడా కొంచెం పార్ట్నర్ షిప్ ఇవ్వండి సార్...
నా బ్లాగ్ గురించి మరీ ఎక్కువగా పొగిడేసారు మీరు .
ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు లో సాంగ్ ఉంటుంది .."పొగడమాకు అతిగా చేసెయ్యమాకు పొగడ పూల లత గా" ..పొగడొద్దు అన్నాను కదా అని తిట్టడం మొదలు పెట్టేరు కనుక..

@జ్యోతి గారు: ధన్యవాధములు ...చాక్లేట్స్ అయితే మీకు స్పెషల్ గా పంపిస్తాను లేండి ... మీ బ్లాగ్ గురువు నా లాంటి బ్లాగ్గర్స్ కి ఎంతో useful ... blaag guruvu is one of my favorite blog మీకు స్పెషల్ థాంక్స్ ...

@ హరే కృష్ణ గారు: మీ కామెంట్ లో 'మా శివరంజని' అనే పదం చాల సంతోషాన్నిచ్చింది .. ఇకపోతే మీరు , అపర్ణ, నాగార్జున , వేణురాం గార్లయితే పోలియో డ్రాప్స్ ... చుక్కలపద్దతిన కాక లీటర్స్ చొప్పున నా బ్లాగ్ కి పట్టించేసారు...అందుకే అది ఏక్టివ్ గా పని చేస్తుంది ..ఈ క్రెడిట్ మీ అందరికి చెందుతుంది

శివరంజని said...

@సైంటిస్ట్ నాగార్జున గారు: మీరు భలే విషయాలు కనిపెట్టారండి ..
ముందుగా మీకు మరియు వ బ్లా స కి ధన్యవాదములు.. నా తరపున ..బచ్చన్ ఫ్యామిలీ తరపున కూడా .
నా మొత్తం పోస్ట్ లో కనిపించే టాలెంట్ కంటే మీ కామెంట్ లో అంత కంటే ఎక్కువ టాలెంట్ కనిపిస్తుంది ...అందుకు ఇప్పటి మీ కామెంటే ఉదాహరణ ..అఫ్ కోర్స్ ఇక్కడ అందరూ టాలెంట్ పర్సన్సే ఎక్కువ అనుకోండి ....

ఇకపోతే ( ఇది చెప్పి నేనేమి expect చేయట్లేదమ్మోయ్...మళ్ళి నువ్వు ఫీలయి ఏదేదో అనేస్తావ్ :D )అర్ధం కాలేదు? మరి...
OMG అంటే ఏమిటీ ?

@ తార గారు: ముందుగా మీకు ధన్యవాదములు.. నేస్తం అక్క మీద పోటీ నా???? పులి ని చూసి వాత పెట్టుకున్న నక్కలా అవుతుంది నా పరిస్థితి ...కొన్ని కొందరికే సాధ్యం ...కాని నాకు అంత టాలెంట్ లేదు.... కాని మీరు అన్నట్టుగా కృషి చేస్తాను ..సెంటిమెంట్ కి ఎక్కిల్లు వస్తే ఇంకో సెంటిమెంట్ పోస్ట్ చదవాల్సిందే .... అయినా అస్తమాను కామెడీ నే కాదు సెంటిమెంట్ కూడా ఉండాలండి ...

పాపం మంచు గారిని నా బ్లాగ్ లో సారీ లు అడక్కండి ..మంచు గారు బదులు నేను చెబుతున్నాను గా... మీకు పది సారీ లు

శివరంజని said...

@శేఖర్ గారు:ముందుగా మీకు ధన్యవాదములు... మీకు ఎంత ఆశ .....చక్కని మీ బ్లాగ్ కి పోలియో డ్రాప్స్ ఎందుకండీ??? ...మూల పడిన నా లాంటి బ్లాగ్ ల కి కాని ...
ఇంటిలో కనుక్కోనక్కర్లేదు మీరు చెప్పారు అంటే కరెక్టే అయ్యుంటుంది ...మన లా లోక కళ్యాణార్ధం పుట్టిన వారిలో కవిత గారు కూడా ఉన్నారంట ఆవిడ ఏదో అంటున్నారు చూడండి...
ఇప్పుడు మన ముగ్గురం ఒక పార్టీ అన్నమాట

@కవిత: మీ బాబు బన్నీ కి కేక్, చాక్లేట్స్ పంపుతాను .
మా ఇంటిలో బిర్యాని నేను చేస్తానంటే వద్దు బాబోయ్ అని తెగ భయపడుతున్నారు .... నువ్విలా అడిగేసరికి నాకు ఎంత ఆనందం గా ఉందో తెలుసా ? నువ్వు ఎక్కడున్నా సరే నేనే స్వయం గా వండి తీసుకొచ్చి నా చేతితో తినిపిస్తా ..వద్దు బాబోయ్ అనకూడదు మరి ..ఓకే నా
శేఖర్ గారు చెప్పింది నిజమేనేమో కవితా

శివరంజని said...

@అపర్ణ :ముందుగా మీకు ధన్యవాదములు. మీరు, హరేకృష్ణ,నాగార్జున , వేణురాం గార్లయితే పోలియో డ్రాప్స్ ... చుక్కలపద్దతిన కాక లీటర్స్ చొప్పున నా బ్లాగ్ కి పట్టించేసారు...

అంతే అప్పుడు మొదలు పెట్టిన పరుగు వెనక్కి తిరిగి చూడకుండా ఏక బిగిన పరిగెడుతూనే ఉంది ...నేను ఆగమన్న ఆగడం లేదు... దాని వెనుకాలా నేను పరిగెట్టడానికి మా మంచి అపర్ణ బూస్ట్ పంపించవా ,

@శ్రీనివాస్ పప్పు గారు:ముందుగా మీకు ధన్యవాదములు... గంగిగోవుపాలు గరిటడైననేమి.....మీ కామెంట్ రెండు లైన్ లు అయితేనేమి... ఆనందబాష్పాలు తెప్పించడానికి

@అజ్ఞాత గారు: మీకు నా ధన్యవాదములు...

శివరంజని said...

@మంచు గారు :ముందుగా మీకు ధన్యవాదములు... అయ్యో.... సారీ ఎందుకండీ??? ఇన్ని సారీ లు చెప్పించుకున్నందుకు నేనే మీకు పెద్ద సారీ చెబుతున్నా ...

మీరు లేట్ గా విషెస్ చెప్పినా చాల గ్రేట్ గా చెప్పారు. నా బ్లాగ్ ని రోశయ్య పక్కనున్నట్టు లైవ్ షో చూపిస్తుంటే, ఆ ఆనంద భాష్పాలు ఏవో ఇప్పుడే రాలిపోయాయి. Thanks for your compliment.


@అజ్ఞాత గారు: ముందుగా మీకు ధన్యవాదములు... హ.. హ... హ.. 80 చుక్కలు కాదు 82 చుక్కలు మీతో కలిపి... ఇంతకీ నాకు కాదు డ్రాప్స్ వేయించింది.. నా బ్లాగ్ కి

@అపర్ణ: మంచు గారి దీవెనలు ఎప్పుడు "మంచు" లా చల్ల గా ఉంటాయి

@అజ్ఞాత గారు:మీ బంగారం లాంటి కామెంట్ ముందుగా మీకు ధన్యవాదములు...

@సునీత గారు: మీ విషెస్ కి నా హృదయపూర్వక ధన్యవాధములు

@వేణురాం గారు: మీ విషెస్ కి నా హృదయపూర్వక ధన్య వాధములు ..నేను కూడా జాజి పూలు అభిమానినేనండి

శివరంజని said...

@అజ్ఞాత గారు మీరు కళ్ళనీళ్ళు పెట్టుకోవద్దు అజ్ఞాతలుగా కూడా కొందరు కామెంట్స్ పెట్టి ప్రోత్సాహించినప్పుడు వారిని కూడా ప్రస్తావించాలి కదా ... నేనే మీకు థాంక్స్ చెప్పాలి

@అపర్ణ , తార గారు: మీకెందుకు కళ్ళు చెమరుస్తున్నాయో నాకర్ధం కాలేదు

@మాలా కుమార్ గారు :మీ విషెస్ కి నా హృదయపూర్వక ధన్య వాధములు .మీ ఆశీర్వాధం కూడా వచ్చేసింది ..i am so happy

@శిశిర గారు:మీ విషెస్ కి నా హృదయపూర్వక ధన్య వాధములు .


@చెప్పాలంటే గారు:మీ విషెస్ కి నా హృదయపూర్వక ధన్య వాధములు .

శివరంజని said...

@జయ గారు:మీ విషెస్ కి నా హృదయపూర్వక ధన్య వాధములు.. నా పేరు కి టాగ్ లైనె చూసి ఎంత సేపు నవ్వుకున్నానో నాకే తెలియదు.. మీరు "డబుల్ సెంచురీ శివానీ" అన్నారు కాని ఇంకా నయం "సారీల శివానీ "అని అనలేదు.. మీ దీవెన కి నాకెంత సంతోషం వేసిందో ... ఫ్రీ సీట్ ఇస్తారా? అదే మాట మీదుండండే...చాక్లెట్లో, కేక్ ముక్కలో సరిపోదా మరి ఏమి కావాలబ్బా ?? పొనీ నా బ్లాగ్ రాసిచ్చేయనా ?

@3G గారు:మీ విషెస్ కి నా హృదయపూర్వక ధన్య వాధములు... మీ కామెంట్ నిజంగా గలా గోదారిలా మనోహరం గా ఉంది ... నా బ్లాగ్ గలా గోదారిలా నిత్య నూతనం గా ఉండాలని అని చెప్పాక సెలవు తీసుకోవాలి ఈ లైన్ మర్చిపోయినట్టునారే??? జై హింద్ ...జై శివరంజని అనాలి

శివరంజని said...

@గీతిక గారు: ఎన్నాల్లకి నా బ్లాగ్ కి విచ్చేసారు. మీ స్వీట్ విషెస్ కి మీ హాస్య రంజని మనస్పూర్తిగా అందిస్తున్నా స్వీట్ ధన్యవాదములు ..

@నీహారిక గారు: మీ బంగారం మీకు మనస్పూర్తిగా అందిస్తున్నా ధన్యవాదములు .. మీ పేరు మర్చిపోతానా చెప్పండి .మీ పేరు ఉందిగా ..చూడ లేదా…ఇక పొతే ఈ బంగారం ఎప్పుడు మీ బంగారమే … శ్రీ లలిత గారికి స్పెసల్ థాంక్స్ అరటిపండు పోస్ట్ లోనే చెప్పాను .. ఈ సంధర్భం గా మళ్ళీ చెబుతా … ఎన్ని సార్లు చెప్పినా తక్కువే గా మరి

@నేస్తం: అక్కా మీకు మనస్పూర్తిగా అందిస్తున్నా ధన్యవాదములు.. ఎంతైనా నీ బ్లెస్సింగ్స్ వల్ల బాగా ఆత్మీయులని సంపాదించుకున్నానన్న మాట ...మరి నా బ్లాగ్ బర్త్ డే కి ఈ చెల్లి కోసం సింగపూర్ లో అందరికి చాక్లేట్స్ పంచిపెట్టడం మర్చిపోవద్దు... ఇంతకీ మీ బాబు కి జ్వరం తగ్గిందా

@ శివ బండారు గారు: మీకు నా హృదయపూర్వక ధన్య వాధములు

@అజ్ఞాత గారు: మీకు నా హృదయపూర్వక ధన్య వాధములు..రోజు సారీలే చెబుతున్నాను కదా ఈ రోజు బర్త్ డే కదా ఈ సారికి థాంక్స్ లు చెబుతాను … ఇంకా ఎన్నాళ్ళు చెప్పాలండి ఈ సారీ లు

శివరంజని said...

@అజ్ఞాత గారు: మీకు నా హృదయపూర్వక ధన్య వాధములు.. రోజు సారీలే చెబుతున్నాను కదా ఈ రోజు బర్త్ డే కదా ఈ సారికి థాంక్స్ లు చెబుతాను … ఇంకా ఎన్నాళ్ళు చెప్పాలండి ఈ సారీ లు

@కృష్ణ ప్రియ గారు: మీకు నా హృదయపూర్వక ధన్య వాధములు..

@శేషేంద్ర సాయి గారు:మీకు నా హృదయపూర్వక ధన్య వాధములు.. సూది మందు అక్కర్లేదు చుక్కల మందు సరిపోతుంది .. మీరు కొత్త పోస్ట్ త్వరగా రాస్తే నా వంతు చుక్కల మందు మీ బ్లాగ్ కి వేస్తాను ..సరే నా

@అజ్ఞాత గారు:మీకు నా హృదయపూర్వక ధన్య వాధములు.. మీ అబిమానానికి నోటిమాట రావడంలేదు …మీ అభిమానాన్ని శివరంజని రాగం లో తెలిపారు … కాని ధన్యవాదములు తెలుపుకోవడానికి ఏ రాగం నాకు దొరక లేదు ..

@స్వప్న గారు :మీకు నా హృదయపూర్వక ధన్య వాధములు.. మీది కలల ప్రపంచం అయితే నాది నిద్ర ప్రపంచం లేండి .. అందుకే తక్కువగా పోస్ట్ లు రాస్తుంటా ..

@ఇందు గారు :మీకు నా హృదయపూర్వక ధన్య వాధములు..

వినయ్ చక్రవర్తి గారు: మీకు నా హృదయపూర్వక ధన్య వాధములు..

దుర్గేస్వర గారు :మీకు నా హృదయపూర్వక ధన్య వాధములు..

శివరంజని said...

@శ్రీ లలిత గారు:మీకు నా హృదయపూర్వక ధన్య వాధములు.. మొదటి పోస్ట్ లో మీ మొదటి కామెంట్ నేనెప్పటికి మరువలేను ... ఎందుకంటే మీ చేతి మహత్యం వల్లే ఇంత మంది ఫ్రెండ్స్ దొరికారు నాకయితే ఈ కామెంట్స్ కంటే వీరందరి ఆత్మీయత కి నిజం గా ఏడుపొస్తుంది ఆనందం తోనె సుమా

@వేణు శ్రీకాంత్ గారు:మీకు నా హృదయపూర్వక ధన్య వాధములు.. ముందుగా నా బ్లాగ్ కి విచ్చేసినందుకు ధన్యవాదములు …మీరెప్పుడు నా బ్లాగ్ లో కామెంట్ పెట్టలేదు నేనకునేదాన్ని నా పోస్ట్ లు చాల చెత్త గా అనిపించి ఉంటాయి ఈ సార్ కి అందుకే కామెంటడం లేదు అనుకునేదాన్ని.. ఇప్పుడు i am so happy

శివరంజని said...

@జాబిల్లి గారు: మీకు నా హృదయపూర్వక ధన్య వాధములు..

@వంశీ కృష్ణ గారు: మీకు నా హృదయపూర్వక ధన్య వాధములు..

@సాయి ప్రవీణ్ గారు :మీకు నా హృదయపూర్వక ధన్య వాధములు..
@హరే కృష్ణ గారు: 50 కామెంట్ మీదే

తార said...

>>@అపర్ణ , తార గారు: మీకెందుకు కళ్ళు చెమరుస్తున్నాయో నాకర్ధం కాలేదు

ఇలా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పావు చుడూ, నీ ఆతిధ్యానికి, నీ ఆత్మీయతకీ, నీ సెంటిమెంటుకీ, ఇలా అన్నిటికీ కలిపి నాకు వెక్కిళ్ళతో పాటు, ఆనంద భాష్పాలుతో మా ఊరిలో వరదొచ్చింది..

నువ్వు ఎప్పటికైనా పెద్ద కలెక్టర్ అవుతావమ్మ, అవుతావు..

వేణూ శ్రీకాంత్ said...

అయ్యోరామచంద్రా!! మీరు అలా ఫిక్స్ అయిపోయారా శివరంజని గారు, నేను మీ బ్లాగ్ లో మొదట చూసింది "నువ్వు నాకు నచ్చలేదు" పోస్టేనండీ కానీ ఆటపా కాస్త నిడివి ఎక్కువ ఉండటంతో ఆరోజు కాస్త పని ఉండి పూర్తిగా చదవలేక తర్వాత చదువుదాం అని పోస్ట్ పోన్ చేశాను. మళ్ళీ నిన్నే మీ టపాలన్నీ చదివాను. చాలా బాగా రాస్తున్నారు అందులో ఏమాత్రం సందేహం లేదు :-) ఇంకా తరచుగా రాస్తుండండి.

కెక్యూబ్ said...

మీ బ్లాగు పాపాయికి మొదటి సం.పు పుట్టినరోజు శుభాకాంక్షలు..

సామాన్యుడు said...

శుభాకాంక్షలు...

nagarjuna said...

>>ఇది చెప్పి నేనేమి expect చేయట్లేదమ్మోయ్...<< నేను ఫీలయ్యాను అని చెప్పి నువ్వెక్కడ ఫీలవుతావోనని...అలా ఫీలవద్దని నేను తెగ ఫీలయ్యి రాసాను. ప్చ్..కనీసం ఏం ఫీలవ్వలో కూడా తెలీనంతగా రాసానా...హతవిధీ

OMG అనగా O My God (ఆశ్చర్యార్థకంతో..) - తెనూగీకరిస్తే ’అమ్మ నాదేవుడోయ్’ అని. ’వార్నానోయ్’, ’బాప్ రే బాప్’ దీనికి పర్యాయ పదములు.

>>ఇంకా ఎన్నాళ్ళు చెప్పాలండి ఈ సారీ లు ...<< అదీ శివరంజని...అలా కడిగెయ్, ఇంకెన్నాళ్లు చూసిన ఖుషి సినిమానే చూస్తాం చెప్పు...’సారీ’ల నుండి విముక్తురాలైపో...విప్లవం విప్లవం... :)

nagarjuna said...

అన్నగారి పాట సాహిత్యాన్ని అందించిన అజ్ఞాతగారికి కృతజ్ఞతలు

జయ said...

అమ్మా శివానీ, నీ బ్లాగ్ నాకెందుకు తల్లీ...నీ అభిమానులందరూ నామీద దాడిచేస్తే నేనేమై పోవాలి బంగారు తల్లి. వద్దమ్మా....నీకే వంద సారీలు. సరిపోవంటే ఇంకో వెయ్యి సారీలు. సరేనా. కాబట్టి, మంచిదానివి కానీ ఇంకోమాటేదైనా చెప్పమ్మా...తొందరగా, నిద్రపోయేలోపే.

శివరంజని said...

అశోక్ గారు మీ కామెంట్ కి నా హృదయపూర్వక ధన్య వాధములు...మీ కామెంట్ కి నాకు నోబుల్ ప్రైజ్ వచ్చినంత సంతోషం కలిగింది...మీ అభిమానం ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను.

శివరంజని said...

@తార గారు:: హ.. హ.. హ .. మీ కామెంట్ కి నా హృదయపూర్వక ధన్య వాధములు..

@కెక్యూబ్ గారు: మీ కామెంట్ కి నా హృదయపూర్వక ధన్య వాధములు..

@సామాన్యుడు గారు: మీ కామెంట్ కి నా హృదయపూర్వక ధన్య వాధములు..

@వేణు శ్రీకాంత్ గారు: నేను సరదాగా అన్నాను లేండీ.. మీరు అంత సెన్స్ టీవ్ గా ఫీల్ అవ్వకండి .. నేను మీ కంటే సెన్స్ టీవ్ .. మీరు ఫీల్ అవుతున్నారని నేను ఫీల్ అవ్వాల్సివస్తుంది ... ఇక పోతే మీ కామెంట్ కి మరొక్కసారి మీ కామెంట్ కి నా హృదయపూర్వక ధన్య వాధములు..

@నాగార్జున గారు: నాది కొంచెం మట్టి బుర్ర కదండీ అర్ధం చేసుకోలేకపోయాను .. మీరు అంత ఫీల్ అయ్యారా అయ్యయ్యో ... మీరు ఫీల్ అవ్వకండి ...నేను ఫీల్ అవ్వను.. సరే నా ... లేక పోతే ఈ రోజంతా సారీల తో టే సరిపోతుంది .. మీ కామెంట్ కి నా హృదయపూర్వక ధన్య వాధములు..

@జయ గారు : ఏమిటీ ఏమనుకుంటున్నారు నాకు సారీలు చెప్పడం నాకేమి నచ్చలేదు నచ్చలేదు.. అన్ని సారీలు చెబితే మిమ్మల్ని నొప్పించానేమో అని నాకు, నా బ్లాగ్ కి ఎంత భాదేసిందోదోదోదోదోదో తెలుసా ? ఇక పోతే మా వాళ్ళందరూ చాల మంచివాళ్ళు ఎవరిని ఏమి అనరు ...నేను మీకు పెద్ద ఫాన్ ని గా కాబట్టి మా వాళ్ళందరూ మీ వాళ్ళే ...

మనసు పలికే said...

శివరంజనీ.. అసలిక్కడ ఏం జరుగుతుంది. నాకేమీ అర్థం కావడం లేదు..:( ఒక్కసారి అన్నీ చదివేసి తరువాత పేరు పేరునా సమాధానమిస్తా...:)

మనసు పలికే said...

శివరంజనీ.. మొత్తానికి సారీలు చెప్పడం మాత్రం మానవన్నమాట..:)
>> పాపం మంచు గారిని నా బ్లాగ్ లో సారీ లు అడక్కండి ..మంచు గారు బదులు నేను చెబుతున్నాను గా... మీకు పది సారీ లు

మంచు గారు ఇది చూసి ఆనందాన్ని తట్టుకోలేక గోదావరి, గంగ, కృష్ణ, పెన్న, తపతి, నర్మద ఇంకా భారత దేశంలో ఎన్నైతే నదులు ఉన్నాయో అవన్నీ కళ్లలోంచే కార్చేసి ఉంటారు.. ఏమంటారు మంచు గారూ..!!

>>మా ఇంటిలో బిర్యాని నేను చేస్తానంటే వద్దు బాబోయ్ అని తెగ భయపడుతున్నారు .... నువ్విలా అడిగేసరికి నాకు ఎంత ఆనందం గా ఉందో తెలుసా ? నువ్వు ఎక్కడున్నా సరే నేనే స్వయం గా వండి తీసుకొచ్చి నా చేతితో తినిపిస్తా ..వద్దు బాబోయ్ అనకూడదు మరి ..ఓకే నా

నాకు కూడా ప్లీజ్.. :))

Anonymous said...

అంటే వాళ్ళ కామెంట్లు మాత్రమే మీకు నోబెల్ ప్రైజు లా
మా కామెంట్లు మాత్రం మీకు బాలకృష్ణ కి వచ్చిన నంది అవార్డ్ లా :( :( :(

మేము ఇంత అభిమానంతో కామెంట్ రాస్తే అది నోబెల్ ప్రైజ్ కాదా
అందరకీ సారీ చెప్పాలి

శివరంజని said...

@అపర్ణ: నేను వండింది తినే ధైర్యం నీకు ఉండాలి కాని తప్పుకుండా నీకు తీసుకొస్తా బిర్యాని...

@అజ్ఞాత గారు: నాకు వచ్చే ప్రతీ కామెంట్ అమూల్యమైనదే..మీ అభిమానం అంత కన్న అమూల్యమైనది ..అయినా అభిమానాన్ని కొలిచే వస్తువు ఏమి లేదు సుమా ....

హ హ హ నా చేత సారీ చెప్పించుకుంటారా ??? పాపం రంజని ..... తన మీద ఎవ్వరికి జాలి లేదా ?

శివరంజని said...

@అపర్ణ: మంచు గారి కళ్ళలోంచి ఇన్ని నదులు పుట్టాయా ? కొంపదీసి ఆయనేమి శ్రీ మహా విష్ణువు కాదు కదా... అంటే గంగ విష్ణువు వేలి నుండి పుట్టిందంటారు కదా అందుకే అడిగా

శివరంజని said...
This comment has been removed by the author.
భాస్కర రామి రెడ్డి said...

శివరంజని గారికి బ్లాగు పుట్టినరోజు స్వీట్ విషెశ్. కూసింత లేటుగా ;)

శివరంజని said...

భాస్కర రామిరెడ్డి గారు మీ విషెస్ కి నా హృదయపూర్వక ధన్య వాధములు

భాస్కర రామి రెడ్డి said...

శివరంజని గారూ...,"సంకటహర చతుర్థి" రోజున వినాయకుణ్ని అర్చించుదాం. వినాయక చతుర్థి శుభాకాంక్షలు

హారం

sivaprasad nidamanuri said...

Happy Happy Birthday to Sivaranjani Blog..:)

శివరంజని said...

@Sivaprasad గారు: మీ కామెంట్ కి నా ధన్య వాధములు.

ధరణీరాయ్ చౌదరి said...

Happy Birthday to Sivaranjani gaaroo...

నీహారిక said...

నెలకోసారయినా నీ తెలివితేటలు బీరువాలోంచి తీసి ఒక పోస్ట్ రాయి బంగారం

రాధిక(నాని ) said...

శివరంజని గారు ,మీ పోస్ట్ లు చాలా నచ్చాయండి.నేనూ మీ నిద్రా సంగం సభ్యురాలునేనండి.మీ బ్లాగ్ మొదటిపుట్టినరోజు శుభాకాంక్షలండి .తొందరగా టీకాలు గట్రా వేయించేసి పరిగేట్టించేయండి మీ బ్లాగ్ ని.

శివరంజని said...

@ధరణీరాయ్ చౌదరి గారు: ధన్యవాదములండి

@నీహారిక గారు: వర్క్ బిజీ వల్ల రాయలేకపోయా ..మీరు చెప్పినట్టు ఇక నుండి నెలకి ఒక సారైనా రాస్తూ ఉంటాను ..థాంక్ యూ

@రాధిక గారు: థాంక్స్ యువర్ కాంప్లిమెంట్ ... నిద్ర సంఘమాండి ? బాగుంది మీ అయిడియా ..అయితే ఈ సంఘం లో శాశ్వత సభ్యులు ఇంకా ఉన్నారండి వాళ్ళే నేను, మీరు, కవిత , శేఖర్ (పెద్ద గోవు ) గారు..

madhumanasam said...

hi sweetie siva ranjani,
ippude puttina paapayilaa unde nee blog ki birthday wishes cheppalante kashtam gaa undi ...:) :)
ever green baby girl laa nee blog eppudoo ilaa innocent gaa cute gaa undipovaalani, mammalni navvullo munchaalani korukuntoo..
manasa... :)

మనసు పలికే said...

రంజనీ.. కొత్త పోస్ట్ ఎప్పుడూ..?? ఇక్కడ వెయిటింగ్..:)

Anonymous said...

శివరంజని గారికి నా హృదయపూర్వక నమస్కారములు
నా పేరు యమున
నేను ఎన్నోరోజులు నుండి మీ బ్లాగ్ చదువుతున్నాను, ముఖ్యం గా మా పాప సంహిత కి మీ బ్లాగ్ అంటే చాలా ఇష్టం
ఆటలో అరటి పండు పోస్ట్ అంటే ఇంకా చాలా ఇష్టం ,రంజనీ ఆంటీ అరటిపండు పోస్ట్ అని ఒక యాభై సార్లైనా నన్ను చదవమంటుంది
ప్రింట్ అవుట్ తీసి దాని డెస్క్ లో పెట్టాను మీ పోస్ట్ మీరు ఏమీ అనుకోరు కదా :( :(.. మీ అనుమతి లేకుండా ప్రింట్ అవుట్ తీసుకున్నందుకు క్షంతవ్యురాలుని
ఈ మధ్య మా సంహి అసలు నా మాట వినడం లేదు గోల గోల చేస్తోంది రంజని ఆంటీ పోస్ట్ రాయడం లేదు అని మళ్ళీ గొడవ ప్రతిరోజూ ఇదే సీన్ ఇంట్లో రిపేట్ అవుతోంది మా అయన నన్ను తిడుతున్నారు చదివి వదలకుండా పిల్లలకి ఇవన్నీ అలవాటు చేస్తున్నావు అని,మీరు కొత్త పోస్ట్ రాసి మా మీ సంహిత గొడవ తగ్గించడం కోసమైనా ఒక పోస్ట్ రాయగలరు
మీకు laptop లేదు అని పాపకు చెబుతున్నా కూడా రంజనీ ఆంటీ కి laptop ఎప్పుడు కొంటారు డాడీ అని మా ఆయన బుర్ర తినేస్తోంది పిల్లది.


మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమాపణలు తెలియచేసుకుంటూ
యమున మరియు సంహిత

మాలా కుమార్ said...

దసరా శుభాకాంక్షలు .

శివరంజని said...

@యమున గారు : నా పోస్ట్స్ ఎలా వుంటాయో తెలియదు కాని మీ పాప చేత కూడా చదివించాను అన్నారు మీ అభిమానానికి నా ధన్యవాదములు ........ ఎందుకంటే నిజానికి నా పోస్ట్ రెండవ సారి చదువుకుంటే నాకే వెగటు గా అనిపిస్తుంది ....

క్షమాపణలా????? అంత పెద్ద పెద్దమాటలెందుకండి (నిజం చెప్పొద్దు ఎవరివైనా నచ్చిన పోస్ట్ లు నేను కూడా ఇలాగే print out వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసేసుకుంట (నిజం చెప్పేసా ఎవరు కోప్పడకండేం ) ..ఇకపోతే కొత్తపోస్ట్ రాయలేకపోవడానికి కారణం కొంచెం వర్క్ బిజీ అందువళ్ళనేనండి ...

డియర్ సంహీ : ఎంత బాగుంది నీ పేరు .... God bless you sweet samhee

శివరంజని said...

@మాలా కుమార్ గారు: .. ..... మీకు కూడా దసరా శుభాకాంక్షలు .
అలాగే అందరికి దసరా శుభాకాంక్షలు ..... కొంచెం లేట్ గా

ఆ.సౌమ్య said...

ఈ పోస్ట్ నేనెలా మిస్ అయ్యానబ్బా??????
ఏమిటో ఇక్కడందరూ సెంటిమెటుతో ఏడ్చేస్తూ ఉంటే నేను ఏడవకపోతే బాగుండదనిపిస్తున్నాది....సరే నేనూ ఏడ్చేస్తా శిజ్జనకా. నువ్వు ప్రస్తావించిన మొదటి మూడు పేర్లలోనే నా పేరు ఉండండం....వా వా నాకు ఏడుపు ఆగట్లేదు.

నీ బ్లాగుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే చేత్తో ఓ పేద్ద సలహా: నీకున్న టేలెంట్ ని నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావ్. చాలా మంచి కామెండీ టపాలు రాయగలిగే శక్తి ఉంది నీకు. సంవత్సరానికి మూడు టపాలు కాకుండా కనీసం ఓ 12 టపాలైనా రాయి. బ్లాగ్లోకంలో నిన్ను శిఖరాగ్రంపై చూడాలని కోరుకుంటూ వా వా వా...వస్తా, (ముక్కు చీదుకుంటూ) ఇంకో పోస్ట్ రాయి, మళ్ళొస్తా.

హరే కృష్ణ said...

విజయదశమి శుభాకాంక్షలు

హరే కృష్ణ said...

97

హరే కృష్ణ said...

98

హరే కృష్ణ said...

నా బ్లాగ్ లో చెయ్యని వంద కామెంట్లు మీ బ్లాగ్ లో చేస్తున్నాం రంజనీ

హరే కృష్ణ said...

వంద కామెంట్లు అందుకో ఆభినందనలు కళ్ళు తుడుచుకుంటూ

హరే కృష్ణ said...

సచిన్ కంటే నీ బ్లాగ్ రికార్డ్ చాలా బాగుంది కంటిన్యూ

congrats :)

మధురవాణి said...

హాయ్ శివరంజని,
మీ బ్లాగుకి పుట్టినరోజు శుభాకాంక్షలు..ఆలస్యంగా! మీ బ్లాగుకొస్తే ఏ మూడ్లో ఉన్నా కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు. మీరు మమ్మల్ని నవ్వించాలే గానీ, రోజుకోసారి వచ్చి పోలియో డ్రాప్స్ వెయ్యమన్నా వేస్తాం! ;)

మనసు పలికే said...

రంజనీ.. అభినందనలు సెంచరీ పూర్తి చేసినందుకు మరియు బోల్డంత మంది గొప్ప అభిమానులని సంపాదించుకున్నందుకు..:)
కృష్ణ.. మళ్లీ వచ్చేశావా సెంచరీ దగ్గర పడే సరికి..:)) నువ్వసలు కేక..:)
సౌమ్య గారి కోరిక ఫలించాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.:)

శివరంజని said...

@సౌమ్య గారు: మీ అభిమానానికి నా హృదయ పూర్వక ధన్యవాదములు ...ఈ పోస్ట్ రాసే సమయానికి మీరు మధుర వెళ్ళారు అనుకుంటా ..అందుకే చూడలేదు ... మీ సలహా నాకెప్పుడు అమూల్యమైనదే.... కాని ఆచరణలో పెట్టలేకపోతుంది ఈ పిల్ల ప్చ్... ఒక వారం లో రాస్తానండి.... Thanks for your valuable suggestion...


@హరే కృష్ణ గారు: విజయదశమి శుభాకాంక్షలు ... మరలా నా చేత సెంచరీ చేయించినందుకు 100 ధన్యవాధాములు ... మీరు ఎప్పటికైనా ఇలా సెంచరీ లు చేయించి చేయించి వి వి ఎస్ లక్ష్మణ్ అంత గొప్పవారు కావాలని కోరుకుంటున్నాను

శివరంజని said...

@మధుర గారు: మీ అభిమానానికి నా హృదయ పూర్వక ధన్యవాదములు ... ఈ పోస్ట్ రాసే సమయానికి మా మధుర గారు కొత్త పెళ్ళి కూతురు కదా అందుకే చూసి ఉండక ఆలస్యం అయి ఉంటుంది .. డ్రాప్స్ వేస్తారా అయితే ఓకే


@అపర్ణ : నీ అభినందనలకు థాంక్స్ బంగారం ... అభిమానులా (అంత పెద్దమాటే ) ????? అయ్య బాబోయ్ అంత లేదు బంగారం ...............మీరందరూ ఫ్రెండ్స్ అంటే ఆత్మీయులన్నమాట
(మీరందరూ అన్న అనక పోయినా నేనే అనేసుకుంటున్నా)

శివరంజని said...

@మంచు గారు: హహహహహ ....సారీ సారీ సారీ సారీ .. రాస్తానండి ...కొంచెం ఫ్రీ అయ్యాక

వైదేహి said...

happy birthday to you sivaranjani
(blog)

ఆ.సౌమ్య said...

మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

శిజ్జనకా ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఒక కొత్త resolution పెట్టుకో, నువ్వు పెట్టుకోకపోతే నేనే పెట్టేస్తాను అదేమిటంటే

"ఈ కొత్త సంవత్సరంలో ఎక్కువ పొస్టులు రాయాలి."

ఇది ఒక 100 సార్లు డిక్టేషన్ రాయి. అప్పటికైనా విరివిగా పోస్టులు రాస్తావేమో! :)

వేణూరాం said...

శివరంజని గారు.. నూతన సంవత్సర సుభాకాంక్షలండి.. మీ పాత పోస్ట్ కి కొత్త సంవత్సరం లో నా మొదటి కామెంట్... త్వరగా కొత్త పోస్ట్ వేసెయ్యండి మరి.. :)

తృష్ణ said...

Happy New Year...మీ బ్లాగ్ గురించి ఈ టపాలో రాసానండి. వీలున్నప్పుడు చూడండి. http://trishnaventa.blogspot.com/2010/12/2-discovered-blogs.html

ప్రణవ్ said...

చాలా బాగా వ్రాసారు. కాసేపు హాయిగా నవ్వుకున్నా.
బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు! నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు! :)

snigdha said...

శ్రియ గారు... ఇన్ని రోజులు మీ బ్లాగ్ని ఎలా మిస్సయ్యాను....అందరి బ్లాగ్స్లో మీ కామెంట్స్ చూసేదాన్ని...బ్లాగ్మితృలు మిమ్మల్ని ఆట పట్టించడాన్ని చూసి ఎందుకా అనుకునేదాన్ని....
అబ్బో మీ పోస్టులు కేకండీ....
:),మొన్నే కామెంటుదామంటే వీలు కుదరలేదు ...సారి...
పోస్ట్ రాయడం కంటే కామెంటడమే వీజీ అనుకుంటా....ప్రస్తుతం నేను కూడా ఆ పనే చేస్తున్నాను....
మీ బ్లాగ్ కి యాపీ బర్త్డే చెప్పడం మర్చిపోయా...అందుకే ఈ పోస్ట్లో కామెంటుతున్నా ...నెక్స్ట్ బర్త్డే కి మీ బ్లాగ్లో మరిన్ని మంచి టపాలు ఉండాలండోయ్...
మరో సారి శ్రియ గారు అభినందనలు...