Monday, 27 June 2011

అమ్మ నాన్న ఓ తెలుగు అమ్మాయి

సోది కబుర్లు తో పాటు చిన్నప్పుడు నాకో సుత్తి అలవాటు ఉండేది ... మా అమ్మమ్మ ఎవరిని ఏమని పిలిస్తే నేను అలాగే పిలిచేదాన్ని... కంగారు పడకండి ... తాతయ్యని మాత్రం తాతయ్య అనే పిలిచేదాన్ని లే ...


అలా అరుంధతి లో జేజమ్మ లా నేను అమ్మమ్మ పాత్ర పోషిస్తూ మా అమ్మని " అమ్ములు" అని మా నాన్నని " ఏరా తమ్ముడు" అనేదాన్ని ........ అంతే కాదు మా ఇంటి పక్కన 70 ఏళ్ళ మామ్మ గారిని కూడా అక్క అనే పిలిచేదాన్ని మా అమ్మమ్మ పిలుస్తుందని ............


నా ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటివరకూ మా నాన్న నన్నెప్పుడూ చిన్న మాట కూడా అని ఎరగరు...దానితో

పువ్వు పుట్టగానే పరిమళించినట్టు .... నాలో ఉన్న సుగుణం కాస్తా నాకంటే ముందే పుట్టి పెరిగి పెద్దదయి పెద్దదయి ... ఇంతింతై వటుడింతై మా ఇంటి పైకప్పంతై అన్న రేంజ్ లో మా పెద్దనాన్నలని కూడ ఒరేయ్ తమ్ముడూ... మీ ఆవిడని అమ్మమ్మ పిలుస్తుంది రా అనడం మొదలు పెట్టాను ...


అంతే కాదు మా ఇంటికి చుట్టాలెవరయినా వస్తే ... మొన్న వచ్చి డ్రింకులు బోలెడు స్వీట్లు పంది కొక్కుల్లా తినేసి పోయారు కదా అంకుల్ గారు ఆంటీ గారు (కాసింత గౌరవంగా ?) వచ్చారు డాడీ అని వాళ్ళ మొహం మీదే గారాలు పోతూ ముద్దుముద్దుగా మురిసిపోతూ చెప్పేదాన్ని... అంత అపరిమితమయిన గౌరవం ఇచ్చే సరికి ఇంత లేత వయస్సులోనే నా లో దాగున్న అంత వినయాన్ని చూసి వచ్చిన వాళ్ళు , పుత్రికోత్సాహంతో మా నాన్న ఆనందం తో ఉబ్బితబ్బిబ్బు అయిపోయేవారు...


. అంత గొప్ప ఆనంద సమయంలో మా అమ్మ సంతోషం తో గోల్డ్ మెడలో , డాక్టరేటో ఇచ్చి నన్ను పొగడ్తలతొ ముంచేసి ముద్దులతో మురిపించేస్తుంది అని ఆశగా ఆత్రుత గా నిలబడి ఎదురు చూస్తున్న నన్ను ఇంటి చుట్టూ పరుగులు పెట్టించి మరీ ఆయాసం వచ్చేవరకు నన్ను చితకబాదేసి... అలా పిలవడం మానేస్తావా లేదా అని నా నోటిలో కారం రాసేసి... నా వినయ విధేయతలని కాలరాసేసేది మా అమ్మ ...గారం గారెలకి ఏడిస్తే వీపు దెబ్బలకి ఏడ్చిందంటే ఇదేనేమో ....


మా అమ్మకి నాన్న మేనమామ అవుతారు .... అందుకే మా అమ్మకి నాన్న దగ్గర చనువెక్కువ ... అదేమిటో కాని మా నాన్నకి మాత్రం మా అమ్మంటే బోలెడంత భయం...బత్తి....


భయం ఎంతంటే ఎలా చెప్పేది ??? ఎలా వర్ణించేది?? .....నిద్రపోతున్న మా నాన్న దగ్గరికెళ్ళి డాడీ నీ వెనకాలా అమ్మ అనగానే మెరుపు తీగలా పరిగెత్తుకెళ్ళి సోఫా కిందో బీరువాలోనో దాక్కోనేంత . ...... ( మాట ఎక్కడ చెప్పొద్దూ సుమీ........ మరేమో నాన్న గారు చెప్పారండి ఇంటిలో విషయాలు బయట అస్సలు చెప్పకూడదని.. ... )


ఏమిటి నాన్నా అన్యాయం.. అరాచకం... దురాచారం నేను భరిస్తూ ఇక బ్రతకలేను అర్జెంట్ గా వెళ్లి నుయ్యో గొయ్యో చూసుకుంటాను అవీ దొరక్కపోతే సుమన్ బాబు సినిమా చూసో చచ్చిపోతాను అని ఏడుస్తుంటే నా బాధ చూసి తట్టుకోలేని మా నాన్న ... ఒరేయ్ విధి ఆడే వింత నాటకంలో కేవలం మనం ఇద్దరు పావులం మాత్రమే...జీవితం అనే సీరియల్ లో అమ్మ డైరెక్టర్ మనం ఆర్టిస్ట్ లు ..........మీ అమ్మ చెప్పినట్టు మనం వినాలి కాని మనం చెప్పినట్టు మీ అమ్మ వినదు... వినబోదు... ఆరు నూరు అయినా నూరు నూట పదహారు అయినా సరే గెలుపు మాత్రం ఎప్పుడూ అమ్మ వైపే ఉండాలి ... .. అప్పుడే మన జీవితం ఆనందంగా ఆహ్లాదంగా సాగిపోతుంది ...ప్రేక్షకులు కూడా నూటికి నూరు మార్కులు వేస్తారు ..మూడు ఎపిసోడ్ లకి ఇలా బాధపడితే మిగతా వేల ఎపిసోడ్ లు ఏమయిపోవాలి ....చేయించేది అమ్మ ... చేసేది అమ్మ మధ్యలో నేను నిమిత్తమాత్రుడిని అని మా నాన్న బిక్క మొహం వేసుకుని వా పోతుంటే ... ఇంక చేసేదేమీ లేక, ఏమి చెయ్యాలో చేత కాక ఏమి చెయ్యడానికి పాలుపోక , వేరే దారి లేక అప్పటి నుండి కారం కూడా కేడ్బరీ లా ఆస్వాదించడం ఎలాగో మా నాన్న దగ్గర ట్యూషన్ చెప్పించుకుని మరీ నేర్చుకునేదాన్ని...


అలా ట్యూషన్లో మా నాన్న చెప్పిన జీవిత సత్యాలు వినేసరికి నాకున్న చిన్న మెదడు, పెద్ద మెదడు,అరికాళ్ళు ,మోకాళ్ళు ,వేళ్ళు ,గోళ్ళు పళ్ళు , వగయిరా వగయిరా లన్ని మొద్దుబారి పోవడం మొదలుపెట్టాయి ...


food corporation of India కి వెళ్ళాల్సిన ఫుడ్ అంతా నాకు ఒక్కరోజులోనే తినిపించే మా అమ్మ .... రోజు ఫుడ్ గ్రెయిన్స్ స్కాంలో ఇరుక్కొంటానో తెలియక భయంతో బాధతో బ్రతుకు భారంగా ఈడ్చుతున్న నేను... క్యారెట్ కోడిగుడ్డు కలిపి వండిన కూర చూసికూడా కోడిగుడ్డు పొట్లకాయలా భావించకుండా తినే మా నాన్న... నేను చెబుతున్న సోది భారతం అంతా శ్రద్దగా చదివే మీరు అందరం విధి వంచితులమే .... విధి కి బానిసలమే


అమ్మవారికి కుంభాభిషేకం జరిపినట్టుగా నాకు ఏడు ఇడ్లీలు పెట్టినా ఏడవకుండా తినాల్సోచ్చేది ... నాకసలే బద్ధకం ఎక్కువ ... అలాంటిది ఇవన్నీ శ్రద్దగా నమలాలంటే ఎంత కష్టమో నమిలే నాకు తప్ప పెట్టే మా అమ్మకి , చూసే మీకు తెలియదు ..... తెలియదు.... తెలియదు.


ఇంత తిండి నమిలి నమిలి ఇంకో పది సంవత్సరాలకి నా నోటిలో పళ్ళు అన్నీ అరిగిపోతే ... బ్లడ్ బ్యాంక్లు , కళ్ళు బ్యాంక్లు ఉన్నట్టు ..... డ్రెస్ మీదకి కలర్ మేచింగ్ పళ్ళ సెట్ పెట్టుకున్దామంటే ......పళ్ళ బ్యాంక్లు ఎక్కడా లేవు ...


ముంతాజ్ కి తాజ్ మహల్ లా ,వాణిశ్రీ కి ప్రేమ నగర్ లా ............. నాకోసం కనీసం ఒక్కటంటే ఒక్క పళ్ళ బ్యాంక్ కట్టించేవారు కూడా కరువయ్యారే లోకం లో ... ఇప్పుడు నాకు ఎవరు దిక్కు మొక్కు అని నాలో నేనే బాధపడేదాన్ని...


నా బాధ చూసి మా నాన్న కరిగి నీరై వరదై ... పోనీలేవే ... అది చెప్పింది నిజమే కదా ఒక్కసారి ఆలోచించరాదు అని నాకు సపోర్ట్ చేస్తే... " తిన్నందుకు ఊడిపోవు నీకులా అరగంట పళ్ళు తోమితే అరిగిపోతాయి " అని మా నాన్న మీద కయ్యమనేది అమ్మ...


మా అమ్మ చెప్పిన దానిలోను నిజం ఉంది . నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది అంటారు కదా అని తినడం పళ్ళు తోమడం అనే lesson లో మా అమ్మ ఎంత గైడెన్స్ ఇచ్చినా పనిలో పర్ఫెక్షన్ సాధించలేకపోయాము... సాధించలేకపోతే సాధించలేకపోయాము కనీసం పుకారు వైరస్ లా ఊరంతా పాకి పదిమందికి సోకక ముందే సైలెంట్ గా ఉండడం మంచిదని కుక్కిన పేనులా కిక్కురుమనకుండా పడి ఉండేవాళ్ళం ....


చిన్నప్పటి నుండి ఇదే తంతు ... తిండి ... తిండి... తిండి... స్కూలుకి వెళ్ళేటప్పుడు ఇంటి ఆడపడుచుని వట్టి చేతులతో పంపించకూడదని మా అమ్మ బ్యాగ్ నిండా పుస్తకాలకి బదులు తిండే పెట్టేది ...


మా క్లాస్ లో ఎవరివైనా పెన్నులో పుస్తకాలో పొతే క్లాస్ లో అందరి బ్యాగ్ లు చెక్ చేసే వాడు మా క్లాస్ లీడర్ పీ.వి. నరసింహారావు ..


నా బ్యాగ్ దులిపి దులపగానే పురావస్తు శాఖ త్రవ్వకాలలో బయటపడ్డట్టు నా తిండి అంతా వచ్చి కుప్పలు తెప్పలుగా పడిపోయేది .... పాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరకాల్సిన తిండి అంతా ఫ్రీగా నా బ్యాగ్ లో దొరికేసరికి నా ఫ్రెండ్స్ కి నా మీద అభిమానం బుసలు కొట్టుకుంటూ పొంగుకోచ్చేసి ఎత్తుకుని మరీ తిప్పేవారు...



" మాష్టారు నా మీద కోప్పడుతున్నారు... నువ్వు బ్యాగ్ లో ఏమీ పెట్టకు తల్లోయ్ నేను తీసుకువెళ్ళను " అని ఏడుస్తుంటే ... మా అమ్మమ్మ వచ్చి ... అన్నీ నువ్వు ఒక్కదానివే తినేయకు ... కొన్ని మాస్టారుకి కూడా పెడుతూ ఉండవే అని ఉచిత సలహా ఒకటి పారేసేది...


ఒక్క రోజు నేను స్కూల్ కి రాకపోతే నా ఫ్రెండ్స్ అందరూ ఎంతగానో విలవిల్లాడిపోయి ..తల్లడిల్లిపోయి ... బెంగ పడిపోయేవారు .. నేను లేని లోటు కనీసం నా బ్యాగ్ ని చూసయినామర్చిపోతామని... కనీసం నా బ్యాగ్నన్నా పంపించమని ప్రాధేయపడేవారు ...


దశ బాగున్నవాడు ఈశాన్యంలో మంటపెట్టినా హేపీగానే ఉన్నాడట... నాలాంటి దానికి .. దిశ మారినా దశ మారే రాతా , యోగ్యతా లేవు ... అలా నా జీవితం స్కూల్ బ్యాగ్ నుండి కాలేజి బ్యాగ్ కి మారినా మన దశలో మార్పు చేర్పూ లేకుండా ఉండి పోయింది ....డిగ్రీ లోకివచ్చినా మాత్రం డిగ్రీ పెరిగే అవకాసం లేకుండా పోయింది



పైగా మా కాలేజీ పక్కనున్న సిటీలో ఉండడం వల్ల కొంప కాస్త కొల్లేరయిపోయింది ... అక్కడ నుండి కావలసిన సామాన్లన్నీ నా బ్యాగ్ ద్వారానే రవాణా అయ్యేవి ....


కన్నతల్లి కోరిక కాదనలేని నా చిట్టి హృదయం నయాపైసా కూలి తీసుకోకుండా ఏవి పడితే అవి ఊరికే మోసుకోచ్చే మనేది... ఇంత కష్టపడి పక్క ఊరి నుండి స్మగ్లింగ్ చేసుకొస్తుంటే చివరికి నీళ్ళ మగ్గులు, బకెట్లు కూడా కొని తీసుకురమ్మని ఆర్డర్ పడేసేది అమ్మ ...


చూసేవాడికి ..... మోసేవాడు ఎప్పుడూ లోకువే ... ఎదవ చెర....ఎదవ జీవితం... ఇలాంటి కష్టాలు పగవాళ్ళకి కూడా రాకూడదు ...


ఇలాంటి మాస్స్ ఐటమ్స్ నేను తీసుకువచ్చేది లేదని బల్లలు , పీటలు గుద్ది చెబితే చేతికి దెబ్బ తగులుతుందని మా చెల్లిని గుద్ది గట్టిగా అరిచి చెప్పేదాన్ని ... మా చెల్లి ఇంకో నాలుగు వాయించేది నన్ను.......మా చెల్లి ఎప్పుడూ అంతే నేను ఒక్కటిస్తే నాకు మాత్రమే ఎప్పుడూ స్వీట్ గా తిరిగి నాలుగిస్తుంది నేనంటే అంత ప్రేమ దానికి ...



ఇక నేను తీసుకురానని కిందా పైనా పడి దొర్లిదొర్లి ఏడుస్తుంటే ఆఖరి అస్త్రం మా నాన్న మీద సంధించేది ... తెచ్చిన వస్తువు బాగుందని మా అమ్మ చేత అనిపించలేక షాపు వాడికి తిరిగి ఇవ్వలేక మా నాన్న పడే కష్టాలు చూసి నా మనస్సు తరుక్కుపోయేది ..షాపు వాడు మా అమ్మ ఎడా పెడా ఆడేసుకునేవారు ......... పాపం పసివాడు అని అనిపించేది కాని .........అయ్యో పాపం అని గట్టిగా అంటే పాపం నా నెత్తికి చుట్టుకుంటుంది మనకెందుకు లే అని నోరు మూసుకుని చూసేదాన్ని...


PG లోకి వచ్చిన KG చదివే పిల్లకి చెప్పినట్టు ఇప్పటికీ ఎన్ని జాగ్రత్తలు చెబుతుందో ... రోజు చెప్పేవే, అన్నీ తెలిసినవే అయినా నాకు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఒకేసారి చెబుతున్నాను వినండహో అన్నట్టుగా... వీధి చివరి వరకు చెబుతూనే ఉంటుంది..


కంప్యూటర్ని తడిచేతులతో ముట్టుకోవద్దని ... అన్నం పడేయోద్దని ... రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా చూసుకోమని ... అంతగా కష్టమయితే ఎవరినయినా రోడ్డు దాటించమని ....


నేనేమన్నా పసి పిల్లనా తెలియక పాక్కుంటూ రోడ్డు దాటేయడానికి ... రోడ్డు కూడా దాట లేకపోవడానికి , ఎవరినో దాటించమనడానికి నేనేమన్నా చిన్నదాన్నా చితకదాన్నా , గుడ్డిదాన్నా ముసలిదాన్నా..... ఛీ ఎదవ జీవితం ఎంత తియ్యగా ఉంటే మాత్రం ఏం లాభం ...


అలాగే ఇంకో భయకరమైన ఆయుధం ఒకటి నాకెప్పుడూ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపుతుంది మా అమ్మ .... అది కత్తో, గన్నో , వేటకొడవలో అనుకుంటే పొరపాటు అది ............అది........ గొడుగు ..........


మా వూరిలో కాలం.. కాలం.. కాలం .. అనే తేడా లేకుండా సర్వ కాలాల్లో సర్వావస్థలయందు గొడుగు వేసుకుని తిరిగే ఏకైక యువతిని నేనే ... యముడికి గద లాగా, కర్ణుడికి కవచకుండలాలు లాగా... గొడుగు ఎప్పుడూ నా తోనే... నేనెక్కడుంటే అది అక్కడే ఉంటుంది .నన్ను విడిచి అది దాన్ని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేము తింగరి మొహం .. మా వూరిలో గొడుగుల కంపెనీ తరపున ఏకైక బ్రాండ్ అంబాసిడర్ ని కూడా నేనే ...


వచ్చే వాళ్ళు... వెళ్ళే వాళ్ళు వెనక్కి వెనక్కి తిరిగి చూస్తుంటే గొడుగు వల్లే నేను లేడీ జేమ్స్ బాండ్ లా కనిపిస్తున్ననేమో అని చాలా గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని ... నన్ను నా గొడుగుని చూసుకుని ... ఇలాంటి సమయంలో నల్ల కళ్ళజోడు కూడా ఉంటే ఎంత బాగుండేది... మంచి రిచ్ లుక్ వచ్చేది అనుకునేదాన్ని...


ఫొజులు కొడితే ఫ్యూజులు మాడిపోతాయని తరువాత తరువాత తెలిసింది .....



రోజు అదేదో టివి చానెల్ యాంకర్ లా గొడుగేసుకుని బయలుదేరాను... మా ఆఫీసుకి వెళ్ళే దారిలో వినాయకుడి ఉంది ... వినాయకచవితి సందర్భంగా గుడిలోనుండి పాత పాటలు వస్తున్నాయి... కడవెత్తు కొచ్చింది అని ...

ఏమరుపాటుగా ఉన్న నాకు పాట గోడుగేసుకోచ్చింది అని వినిపించి.... ఒక్కసారిగా నా గుండె గుభేల్మంది ... ఎంత ప్రయత్నించిననా కొట్టుకోనని మొరాయించింది ... ఇంకా నయం డౌట్ నాకొచ్చింది కాబట్టి సరిపోయింది ... ఎంత అవమానం ...ఎంత అవమానం.... గొడుగు నన్ను మింగేయడానికే వచ్చింది... ఇక గొడుగు నేను చస్తే తీసుకెళ్ళను అని ఎన్నిసార్లు నెత్తి నోరు బాదుకున్నా మా అమ్మ వినిపించుకోదు ...



పైగా ఎండలో తిరిగితే జ్వరాలు వస్తాయి అని, కలర్ తగ్గిపోతామని ......నలుపు వచ్చేసి నీగ్రోజాతి బాల బాలికలా తయారవుతానని... ఇంకా ఏవో ఏవో పుస్తకాలలో చదివినవి, చదవనివి, చదవకూడనివి కూడా చెప్పి భయపెట్టేస్తుంది



అమ్మో జ్వరమా... నాకెప్పుడన్నా సెలవలు కావాలంటే అప్పుడు జ్వరాన్ని ప్రకటించుకునేదాన్ని కానీ నిజం జ్వరం మాత్రం సంవత్సరానికి ఒక్కసారే ...........అంటే సంవత్సరానికి ఒక్కసారి పరీక్షలు వచ్చేవి... పరీక్షలే నాకు జ్వరాన్ని తెచ్చి పట్టేవి .. .......


అదీ నేను మరీ బలవంత పెట్టేస్తే నన్ను భాధపెట్టలేక నా మాట కాదనలేక ఏదో మొహమాటం కొద్ది వచ్చేది పలకరించడానికి ...అలాంటి జ్వరం అంతే ఏంటో గౌరవ, అభిమానం, ఆరాధనా .......... అలా వచ్చిన జ్వరం అని తెలియక ... మా అమ్మ నాకు దెయ్యం పట్టిందానికి కట్టినట్టు ఒంటినిండా రకరకాల తాయెత్తులు కట్టేస్తుంటే ముడుపులు కట్టిన చెట్టులా కనిపించేసరికి జ్వరానికి కూడా వణుకు ,జ్వరం వచ్చేసేవి .......అలా జ్వరానికి కనీస మర్యాదలు కూడా చెయ్యలేక పోయేదాన్ని .....కనీసం జాకెట్టు ముక్క కూడా పెట్టకుండా వట్టి చేతులతో పంపించేసేదాన్ని ........ అందుకే జ్వరం కంటే గొడుగులు , మరచెంబుపట్టుకుని తిరగడమే కాస్త నయం అనిపిస్తుంది...



ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే నీ వెదవ ఏడుపు ఆపి నా పెళ్ళికి వచ్చి అక్షింతలు వెయ్యి అని అడిగాడంట వెనకటికి ఎవరో ఒక పేద్ద మనిషి ... పోనీలే మా నాన్న అయినా నాకు సపోర్ట్ ఉంటారనుకుంటే రివర్స్ లో నేనే మా నాన్నకి సపోర్ట్ ఇవ్వాలి


అమ్మతో కలిసి అడ్డమైన చానెల్స్ చూస్తూ తలకిమాసిన టివి సీరియల్స్ లు చూడడం లో పాలు పంచుకుంటాడు ... సీరియల్ లో కారెక్టర్ కి అన్యాయం జరిగినా మహా ఘోరం , నేరం మా నాన్నే చేసాడు అంటుంది అమ్మ ... నువ్వు తుమ్మినప్పుడు వెళ్ళాడు కాబట్టి సీరియల్ లో హీరో కి ఏదో అయింది అంటుంది .. హీరో ఫేమిలీకి నువ్వే అన్యాయం చేసావు అంటుంది


ఎప్పుడన్నా పోనీలే మా అమ్మ సైలెంట్ గా ఉంది కదా అని అనుకుంటే ... ఎవరైనా పొగడమని రిక్వెస్ట్ చేస్తారు కానీ మా నాన్న తిట్టమని రిక్వెస్ట్ చేస్తాడు మా అమ్మని.... ఇలాంటి విచిత్రాలు విడ్డూరాలు మా ఇంటిలో మాత్రమే జరుగుతూ ఉంటాయి


. ఎందుకు నిద్రపోయే సింహం జోలికి వెళతావు అని మా నాన్నకి ఎన్ని చెప్పినా షరా మామూలే...పైగా అలా నటే మా అమ్మకి నా మీద ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది


"అదేలేవే రేపొద్దున్న నువ్వు కూడా నాలాగే ఉంటావు" అని మా అమ్మ నన్ను కోప్పడుతుంది .


"అయినా నేనేమి అలా ఉంటానా ?ఏమిటి ?? ... అయినా మా ఫేమిలీ విషయాలు మా అమ్మకేందుకో నాకు అస్సలు అర్ధం కాదు ...


అమ్మ ఎప్పుడూ పప్పుడబ్బాలు ఉప్పుడబ్బాలు అందించమంటుందే తప్ప వంట మాత్రం నేర్పడంలేదు. నా జీవితం సగం అవి అందించడంలోనే గడిచిపోయింది .

.. కనీసం నా అవసానదశలోనయినా ... కాస్త సొంతంగా వంట చేసి నీకు పెట్టనా నాన్నా అని ఎంతో ఆశగా అడుగుతానా

బాబోయ్ నీ వంట "వద్దురా నీకెందుకు అంత శ్రమ ...నిన్ను కష్టపెట్టలేను రా....... ఫ్యూచర్ లో మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా నీ చేత వంటచేయింఛి నిన్ను కష్ట పెట్టలేను ... అప్పుడు కూడా మీ అమ్మతో కేరేజీ పెట్టించుకుని తెచ్చుకుంటాను అంటారు...అంటా సుత్తి


ఎప్పుడో ఒకసారి తోటకూర వేపుడు లో ఉప్పు బదులు సర్ఫ్ వేస్తే మాత్రం ... రోజూ సర్ఫ్ వేసి వండుతానా .... వేస్తే మాత్రం ఎప్పుడూ అదే కంపెనీ సర్ఫ్ వేస్తానా ఏమిటి ? ... మాత్రం నాకు తెలియదా... హిందూ స్త్రీ అయినా తన వంటని విమర్శిస్తే ఒప్పుకుంటుందా ????? మాత్రం దానికే నాలో కుక్ ని ఇంతలా చిన్న బుచ్చేయాలా...హుమ్మ్


మా నాన్న ఎప్పుడూ ఇంతే ... మా అమ్మ మా నాన్నని ఏదన్నా అంటే ... మా నాన్న " ఒరేయ్ నాకు సపోర్ట్ చేయరా " అని నన్ను జాలిగా అడగడం ... నా వెదవ గుండెకాయ కరిగిపోయి 'కంటే కూతుర్నే కను' సినిమాలో రమ్యకృష్ణ లా ఫీల్ అయిపోయి ముందు వెనకా ఆలోచించకుండా దూకేయడం ... తీరా దూకేసి దెబ్బలు తగిలించుకున్న తరువాత ఆయింట్మెంట్ కాదు కదా కనీసం నా వంక చూడనన్నా చూడకుండా ఇలా సగం లోనే హేండ్ ఇచ్చి మా అమ్మ పార్టీ లో కలిసిపోయి నన్ను వెన్నుపోటు పొడిచేయడం...


లోకులు కాకులు అని ఊరికినే అన్నారా ... లోకం అంతా మా నాన్నకి నేనంటే బోల్డంత ఇష్టం అనుకుంటుంది కాని.... మాయా మాయా అని మా అమ్మ మా నాన్నని పిలిచే పిలుపులో ఏం మాయ ఉందో తెలియదు కాని ... మా నాన్నకి మా అమ్మ అంటేనే చాలా ఇష్టం ......ఇదే అసలు సిసలైన పచ్చి నిజం..


లోకం ఇలాంటి పచ్చి నిజాన్ని ఎప్పుడూ అంత తొందరగా గ్రహించదు ... అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకోని సమాజం అంటే నాకు అప్పుడప్పుడూ చాలా కోపంవస్తుంది ...............అందుకే కోపంతో అప్పుడప్పుడు నేను కొనుక్కున్న ఐస్ క్రీమ్స్ , చాక్లెట్స్ దానికి ఇవ్వడం మానేసాను ... అలాగే అప్పుడప్పుడు గాజులు, రబ్బరు బేండ్లు లాంటివి కొనుక్కున్నా సరే దానికి ఇవ్వకూడదనుకున్నాను ...


కాకిని కొట్టవే అని మా అమ్మ చెబితే వెళ్లి కాకిని కొట్టడం మానేసి .. మా అమ్మతో చెప్పమంటావా అని దానిని బెదిరించి పంపేసేవాళ్ళం నేను.. మా నాన్న ...


మీ అమ్మతో నేను వేగలేకపోతున్నా... పిన్నిని తీసుకురానా అని సరదాగా అనేవారు మా నాన్నా... మేము కూడా తీసుకురా డాడీ అని జోక్ చేసేవాళ్ళం ...కానీ పైన తదాస్తు దేవతలు ఉంటారని... నాన్న పులి కథలా ... సరదాకి కూడా కొన్ని మాటలు అనకూడదని.. అన్నా సరదా శృతి మించకూడదని టైంలో మాకు తెలియలేదు...


రోజు ఆదివారం ... పండగ దగ్గర పడిందని ఇల్లు శుభ్రం చేస్తున్నాం .. సన్ సైడ్ మీద ఉన్న సామాను దింపుతూ బిపి డౌన్ అయ్యిందో లేక కాలు స్లిప్ అయిందో తెలియదు కాని మా అమ్మ ఒక్కసారిగా నిచ్చెన మీద నుండి దబ్బున కింద పడిపోయింది... తలకి పెద్ద దెబ్బ తగిలింది ... నా కళ్ళ ఎదురుగానే రక్తం, పడిపోయిన మా అమ్మ ... ఏడుస్తూ అమ్మని తీసుకుని మా నాన్న, నేను డాక్టర్ దగ్గరికి పిచ్చిదానిలా పరిగెత్తుకుంటూ వెళ్లాను...


నాకు రోజూ మా అమ్మే అన్నం తినిపించేది... అప్పటివరకు నా చేతితో అన్నం తినే అలవాటు కూడా చేసుకోలేదు ... అంత గారం గా చూసుకునేది ... అలాంటిది మా అమ్మ హాస్పిటల్ లో పడి ఉంటే ఇంటిదగ్గర నా చేతితో నాకు అస్సలు అన్నం తినబుద్దేసికాదు......... నిద్రపట్టేది కాదు... పిన్నిని తీసుకు రా అనే మాట గుర్తొచ్చి ఎక్కడ ఆమాట నిజం అయిపోతుందేమో అని భయంతో వెక్కి వెక్కి ఏడ్చేసేదాన్ని..


అప్పుడు ఎన్ని దేవుళ్ళకి ఎన్నేసి మొక్కులు మొక్కుకున్ననో నాకే తెలియదు ... నా మొక్కులే ఫలించాయో లేక మా అమ్మ మంచితనం కాపాడిందో కానీ .... దేవుని దయ వల్ల మా అమ్మ సేఫ్... ఇది జరిగి ఇంచుమించు రెండు సంవత్సరాలు అవుతుంది కాని భయం నా మనసులోనుండి ఇంకా పోలేదు... ఇప్పటికీ విషయం గుర్తొస్తే చెవులు రెండూ గట్టిగా మూసేసుకుంటా ... భయంతో...




పరమేశ్వరా! నిజంగా నువ్వంటూ ఉంటే నా వాళ్ళందరిని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా చూడు తండ్రీ .... వాళ్ళకి నువ్వు హాని చేసినా తట్టుకునే మానసిక స్థైర్యం నాకు మాత్రం లేదు ... నీకు అంతగా కావాలనిపిస్తే ఆల్టర్నేట్ గా నా ఆయుష్షు తీసేసుకో ...

--------------------------------------------------------------------------------------------------

(ఎనిమిది నెలలనుండి నా బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ రాయ మని ఎంత బుద్దిగా చెప్పిన వినడం లేదని చివరికి నాతో దెబ్బలాడి మరీ వేయించిన పోస్ట్ .... సామ ,దాన ,బేధ, దండో పాయలకి కూడా మాట వినకపోయేసరికి ఇంక థర్డ్ డిగ్రీ టార్చర్ కూడా పెట్టి నా చేత పోస్ట్ వేయించిన నా బెస్ట్ ఫ్రెండ్ కే ఈ క్రెడిట్ అంతా కే చెందుతుంది )

58 comments:

మంచు said...

కేవ్వ్వ్వవ్వ్వ్వవ్..... కేక :-))))))

మొత్తం మీద ఇన్నాళ్ళకి మా మీద దయ కలిగింది అన్నమాట :-)))
పోస్ట్ అంతా ఎంత నవ్వించావో చివర్లో అలా ఎడిపించావ్...
ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చదివి అప్పుడు మళ్ళీ కామెంట్ పెడతా

శిశిర said...

బాగా రాసారు. అయినవాళ్ళకి ఏమైనా జరిగితే తట్టుకోవడం చాలా కష్టం. అమ్మ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని అనుకుంటున్నాను. మీ ఆయుష్షు ఇవ్వనక్కరలేదు. దేవుడు మీ అందరినీ ఎప్పుడూ చల్లగా చూస్తాడు. కాకపోతే అప్పుడపుడు ఎపుడైనా చిన్న చిన్న స్లిప్ టెస్ట్ లు పెడుతూ ఉంటాడు. మనం ఎలా ఆన్సర్ చేస్తామో చూస్తూ కూర్చోవడం దేవుడికి సరదా అన్నమాట. :)) మీరూ, మీకు కావలసినవాళ్ళు ఎప్పుడూ ఇలాగే మమ్మల్ని నవ్విస్తూ హాయిగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.

మధురవాణి said...

కెవ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్.... సూపర్ రాశావ్ బుజ్జీ పోస్ట్.. చాలా నవ్వించావ్ చాలా చాలా రోజుల తరవాత.. చివరికి బిక్క మొహం వేసేలా కూడా చేసావ్.. :( ఆ లాస్ట్ పేరాలో అచ్చంగా నువ్వు చెప్పినట్టు నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను. హుమ్మ్.. మా అమ్మ గుర్తొచ్చింది.. నిజంగా అమ్మంటే మాత్రం అమ్మే కదా! వేరే మాటలు కూడా ఏం చెప్పలేం! :)

హమ్మయ్యా.. ఏమైతేనేం.. మొత్తానికి ఇన్ని రోజులకి ఒక పోస్ట్ రాసావ్.. నీకూ, నీ బెస్ట్ ఫ్రెండ్ గారికీ కూడా థాంక్స్..
అలాగే, ఏవండీ శ్రియా బెస్ట్ ఫ్రెండ్ గారూ.. మీరు అప్పుడప్పుడూ ఇలాగే బెత్తం పుచ్చుకుని మీ ఫ్రెండ్ చేత పోస్ట్లు రాయిస్తూ ఉండండి.. :))

రవికిరణ్ said...

LOL
--------
ఎప్పుడో ఒకసారి తోటకూర వేపుడు లో ఉప్పు బదులు సర్ఫ్ వేస్తే మాత్రం ... రోజూ సర్ఫ్ వేసి వండుతానా .... వేస్తే మాత్రం ఎప్పుడూ అదే కంపెనీ సర్ఫ్ వేస్తానా ఏమిటి ? ... ఆ మాత్రం నాకు తెలియదా... ఏ హిందూ స్త్రీ అయినా తన వంటని విమర్శిస్తే ఒప్పుకుంటుందా ????? ఈ మాత్రం దానికే నాలో కుక్ ని ఇంతలా చిన్న బుచ్చేయాలా...

---------
ఈ విషయంలో మేము కూడా మీతో ఏకీభవిస్తున్నాము అద్యక్షా!!!
(అలా అని మా ఆవిడ కామెంటమందని గమనించ ప్రార్ధన!)

Sravya Vattikuti said...

బాగా రాశావ్ రంజని !
ఆ చివరి పేరా మాతం హ్మ్ ! ఇప్పుడు మీ అమ్మ గారికి ఆరోగ్యం బానే ఉంది అనుకుంటున్నాను . అలాగే శిశిరగారు చెప్పినట్లు "నీ ఆయుష్షు ఇవ్వనక్కరలేదు. దేవుడు మీ అందరినీ ఎప్పుడూ చల్లగా చూస్తాడు ".

తృష్ణ said...

nice post ! happy to know that your mom is safe. keep blogging sivaranjani...all the best !

కృష్ణప్రియ said...

చాలా హిలేరియస్ గా రాసి అంతలో భయపెట్టి మళ్లీ అమ్మయ్య అనిపించారు. మళ్లీ, మళ్లీ చదవాలనిపించే పోస్ట్ ఇది. Very nice..

ఆ.సౌమ్య said...

అమ్మయ్యా తల్లీ శిజ్జనకా...ఇన్నాళ్ళకి పోస్టు రాసావు. జగన్నాధ రథ చక్రాల్లా నువ్వు నీ పోస్టులు, బాగా తిట్టించుకుంటేనేగానీ కదలవు కాబోలు. పోతే పోయిందిగానీ కరువు తీరేలా పేద్ద పోస్ట్ రాసావు....బలే నవ్వించావు....

ఏ డ్రెస్ మీదకి ఆ కలర్ మేచింగ్ పళ్ళ సెట్ పెట్టుకున్దామంటే ......పళ్ళ బ్యాంక్లు ఎక్కడా లేవు

స్కూలుకి వెళ్ళేటప్పుడు ఇంటి ఆడపడుచుని వట్టి చేతులతో పంపించకూడదని మా అమ్మ బ్యాగ్ నిండా పుస్తకాలకి బదులు తిండే పెట్టేది ...

నీ ఫ్రెండ్స్ నిన్ను ఎత్తుకు తిప్పేవారా

మా చెల్లిని గుద్ది గట్టిగా అరిచి చెప్పేదాన్ని

ఛీ ఎదవ జీవితం ఎంత తియ్యగా ఉంటే మాత్రం ఏం లాభం ...

ముడుపులు కట్టిన చెట్టులా కనిపించేసరికి

జ్వరానికి జాకెట్టు ముక్క

ఆ మహా ఘోరం , నేరం మా నాన్నే చేసాడు అంటుంది అమ్మ

తోటకూర వేపుడు లో ఉప్పు బదులు సర్ఫ్ ....ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం పోస్టు రాసేయాల్సొస్తుందిగానీ ఇక్కడితో ఆపేస్తా.

చివరికి సెంటిమెంటు పిండేసావు...బలే నవ్వించి అంతకన్నా బలేగా ఏడిపించావుగా చివరికి...మొత్తానికి మా కళ్ళ నీళ్ళు తెప్పించావు నవ్విస్తూ, ఏడిపిస్తూ...చాలా బావుంది. :))

బులుసు సుబ్రహ్మణ్యం said...

మొత్తానికి చాలాకాలం తర్వాత టపా వ్రాసి నవ్వించేశారు. నవ్వించి నవ్వించి చివరగా అల్లాంటి ట్విస్ట్ ఇచ్చారెమిటి? మీ అమ్మ గారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారనుకుంటాను.

అన్నట్టు ఆ చివరి వాక్యం కానీ అలాంటివి కానీ మరెప్పుడూ వ్రాయకండి.

నేస్తం said...

ఎంతనవ్వించావో అంత భయపెట్టావ్ రంజని నీ స్టైల్ లో చాలాబాగా నవ్వించావ్

durgeswara said...

అమ్మతనం గూర్చి వ్రాయాలంటే ఆడవారే వ్రాయాలి. అందులోనూ ఆమమతానురాగాలను ఇంత సున్నితంగా హాస్యంతో మేళవించి వ్రాసిన మీకు అభినందనలు.
అమ్మకేమీ కాదు . అమ్మమీద మీప్రేమను మీరేతెలుసుకోవటానికి భగవంతుడు పెట్టిన చిన్నస్లిప్ టెస్ట్ అన్నారు సోదరులు అదేకావచ్చు.

జయ said...

మీ అందరూ ఎప్పుడూ ఆనందంగా ఇలాగే ఉంటారు శివాని.
అవును గాని, రేపు మీ వారిని ఏమని పిలుస్తావు. మీ అమ్మమ్మ లాగానా. అంటే ఎలా... ఒక్క సారి పిలిచి చూపించవా....ప్లీజ్.

రాజ్ కుమార్ said...

ఓహో నా రాజా.. ఎన్నాళ్లకెన్నాళ్లకండీ మీ బ్లాగ్ లో టపా? మొదటి నుండీ చివరిదాకా పీ.టీ ఉష లాగా పరిగెత్తించి చదివించారు. సిచువేషన్ కి సింక్ అయ్యేట్టూ సామెతలు కుమ్మేశారు.

>>>
ముంతాజ్ కి తాజ్ మహల్ లా ,వాణిశ్రీ కి ప్రేమ నగర్ లా
దశ బాగున్నవాడు ఈశాన్యంలో మంటపెట్టినా హేపీగానే ఉన్నాడట
మా చెల్లిని గుద్ది గట్టిగా అరిచి చెప్పేదాన్ని
ఛీ ఎదవ జీవితం ఎంత తియ్యగా ఉంటే మాత్రం ఏం లాభం .
ఉప్పు బదులు సర్ఫ్
>>>
తర్వాత ఇంకేదో రాసారు. ప్రేమ బుసకొడుతూ వచ్చిందనీ..హహహ.. ఇంచ్ ఇంచ్ కీ పంచ్ లతో చించేసారు.

ఇలా చెప్పుకుంటాపోతే మొత్తం పోస్ట్ రాసేస్తానేమో.. ఇలా కేకలాంటి పోస్ట్ లతో ఇదే స్పీడ్ కంటిన్యూ చేసెయ్యండీ..

మీరూ, మిమ్మల్ని అభిమానించేవారూ, మీరు అభిమానించేవారూ అందరూ ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా..

loknath kovuru said...

ఇంతకీ మీ బెస్ట్ ఫ్రెండ్ చదివార? తన కామెంట్ ని కూడ చెప్తే వినాలని ఉంది...సారీ చూడాలని ఉంది కామెంట్ నే..

వేణూ శ్రీకాంత్ said...

హమ్మయ్య చాలా రోజుల తర్వాత రాసినా.. కరువుతీరేలా పెద్ద టపా రాసినందుకు నీకు, నీతో రాయించినందుకు నీ నేస్తానికి థ్యాంక్సులు చెల్లాయ్... నీ ఫ్రెండ్ గారికి నాదీ సేం రిక్వెస్ట్.. ఫ్రెండుగారండీ ఫ్రెండుగారండీ మా అందరికోసం మీరు బెత్తంపుచ్చుకుని మా చెల్లాయ్ తో నెలకోసారైనా ఇలాంటి చక్కని పోస్ట్ రాయించేయండేం..

టపా అంతా చాలా బాగా నవ్వించావ్.. ఇంచుమించు నాకు నచ్చిన లైన్స్ అన్నీ సౌమ్య కోట్ చేసేసారు. టపా అంతా మళ్ళీ మళ్ళీ చదువుకోగలిగేలా ఉంది. చివరికొచ్చేసరికి కొంచెం బాగానే టెన్షన్ పెట్టావ్ కానీ ముగింపు చూసాక రిలాక్స్ అయ్యాను. నీ ప్రార్ధనలో చల్లగా చూడు తండ్రీ వరకూ బాగుంది కానీ నువ్వు ఇచ్చిన ఆల్టర్నేటివ్ నాకు అస్సలు నచ్చలేదు అలాంటి పిచ్చి పిచ్చి లైన్లు రాయకు.. దేవుడు మంచివాడు నిన్నూ నీ ఆత్మీయులందరినీ కూడా చల్లగా చూస్తాడు.

మంచు said...

రంజని:
ఎం రాసావ్ అసలు. రొజుకి ఏడు ఇడ్లీలు తింటావా :-))) మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కాఫీ , టిఫిన్స్ వద్దే వద్దు:-) డ్రెస్ మీదకి ఆ కలర్ మేచింగ్ పళ్ళ సెట్ ఎంటి బాబొయ్ :-))) దశ బాగున్నవాడు ఈశాన్యంలో మంటపెట్టినా హేపీగానే ఉన్నాడట , ఫొజులు కొడితే ఫ్యూజులు మాడిపోతాయని తరువాత తరువాత తెలిసింది - కెవ్వు కేక.... అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి నీకు. సౌమ్య, రాజ్ చెప్పినట్టు నచ్చినవన్నీ రాయాలంటే మొత్తం పొస్ట్ రాసెయ్యాలేమో.

పొస్ట్ అఖరిలొ చాలా కంగారు పెట్టావ్. ఆఖరి లైన్ నాకూ నచ్చలేదు. మంచివాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది.

చివరగా ..పైన సౌమ్య గారు రాసిన కామెంట్ లొ నాకు బాగా నచ్చిన ఒక వ్యాక్యం నేను మళ్ళీ రాస్తున్నా...
"మొత్తానికి మా కళ్ళ నీళ్ళు తెప్పించావు నవ్విస్తూ, ఏడిపిస్తూ...చాలా బావుంది. :))"

SHANKAR.S said...

హమ్మయ్య ఎర్రబస్సు కదిలింది. కాపోతే యమా స్పీడు గా కదిలి చివర్లో కళ్ళల్లో తడి తెప్పించింది. ఇదిగో ఇంకో సారి ఆ చివరి డైలాగ్ లాంటి రాతలు రాస్తే బాగోదమ్మాయ్ ముందే చెప్తున్నా.

గిరీష్ said...

ఇవి సూపరు :)
>>
అలాగే ఇంకో భయకరమైన ఆయుధం ఒకటి నాకెప్పుడూ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపుతుంది మా అమ్మ .... అది కత్తో, గన్నో , వేటకొడవలో అనుకుంటే పొరపాటు అది ............అది........ గొడుగు

సర్వ కాలాల్లో సర్వావస్థలయందు గొడుగు వేసుకుని తిరిగే ఏకైక యువతిని నేనే

ఆ సీరియల్ లో ఏ కారెక్టర్ కి అన్యాయం జరిగినా ఆ మహా ఘోరం , నేరం మా నాన్నే చేసాడు అంటుంది అమ్మ ... నువ్వు తుమ్మినప్పుడు వెళ్ళాడు కాబట్టి ఆ సీరియల్ లో హీరో కి ఏదో అయింది అంటుంది ..ఆ హీరో ఫేమిలీకి నువ్వే అన్యాయం చేసావు అంటుంది

మా ఫేమిలీ విషయాలు మా అమ్మకేందుకో నాకు అస్సలు అర్ధం కాదు

>>
మీరు పి.వి.నరసింహారావు క్లాస్‌మేటా, చెప్పనేలేదు సుమీ.. :)

After long time super post andi. thanks to ur friend.. :)

ఇంత బా రాసి చివర్లో ఆ వాఖ్యం బాలేదండి.. అంత అంత పెద్ద పెద్ద పదాలతో మనకి అవసరం ఉండదనుకుంట.. ఐన మనం ఇష్టపడేవాళ్ళు, మలల్ని ఇష్టపడే పాళ్ళు చెడుగ కోరుకుంటే జరగదంట..తెలుసా :)

ఆ.సౌమ్య said...

శివా...ఇవాళ్ళ మళ్ళీ చదివాను నీ పోస్ట్. ...మీ అమ్మగారికి నీ పై ఉన్న ప్రేమ...మీ నాన్నగారికి నీ పై ఉన్న అభిమానం, మీ అమ్మగారిపై ఉన్న అనురాగం...విసుక్కుంటూనే అమ్మ ప్రేమని ఆస్వాదించే నీ మురిపెం....చక్కని సున్నితమైన హాస్యంతో మేళవించి ఎంతబాగా రాసావు! జోహార్లు పిల్లా! నాకు చాలా చాలా చాలా బాగా నచ్చింది ఈ పోస్ట్. :)

kiran said...

రంజని - ఇప్పుడు టైము 11 .30
మా వాళ్ళు ఫుల్ స్లీపింగు...నేనేమో గట్టిగా నవ్వలేక కికికికికి అంటూ చాల కస్టపడి చదివాను..
నెలకో టపా అన్న రాయాలని శివరంజని ఫాన్స్ assosciation నుండి డిమాండ్ చేస్తున్నాం..:)
అలా కాసేపు కన్నీళ్లు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయి..:)...టపా మాత్రం soooparu ...

వంశీ said...

chaala chaala baavundi....chadivinantha sepu entha navvano, mee amma meeda meekunna premani mee naanna deggara meekunna chanuvu, meeku mee ammagaru chesina gaaram anni chaduthuu unte maa illu gurthochindi,,,maa chellitho nenu potladina kshanaalenno oka sari kalla mundu medilaayi.

mee amma gaaru poorthiga kolukunnarani, andaru aayuraarogyalatho undaalani korukuntuntuu aa devunni prardisthunnanu...

inthakee antha pedda post antha humorous ga raayadam chaala great,,!!! simply superb

చైతన్య.ఎస్ said...

చాల బాగుందండి. చివర్లో ఒక్క క్షణం కంగారుపడిపోయా. ఆ రామచంద్రప్రభు కరుణాకటాక్షాలు ఎల్లప్పుడు మీ పై, మీ కుటుంబ సభ్యుల పై ఉంటుంది.

రాధిక కిరణ్మయి said...

శివరంజని హాస్యం , అమ్మ ప్రేమ చాలా బాలన్సడ్ గా రాసావు. నాకు చాలా చాలా నచ్చేసింది. ఎంత నచ్చిందంటే వెంటనే మా అమ్మను చూడాలనిపించేటంత.

హరే కృష్ణ said...

బాగా రాసారండీ
ఆ ట్విస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు
ఇదే ఫ్లో లో మరిన్ని పోస్ట్లు ఎక్కువ రాయాలని కోరుకుంటూ

విక్రం said...

బాగా రాసారు. అద్యంతం హాస్యం పండించారు కదా . ట్విస్ట్ ఊహించలేదు. పైన చాలా మంది చెప్పినట్టు మీ కుటుంభసబ్యులను ఆ భగవంతుడు ఎప్పుడూ క్షేమంగా చేస్తాడు. దయవుంచి మీరు అలాంటివి రాయవద్దు

chinna reddy said...

భలే ఉంది పొస్ట్.
మాయా మాయా అంటే మొదట్లొ నాకు వెలగలేదు. అది మావయ్య అని పిలుపు కదా.
మీలొ చాలా టాలెంట్ ఉంది. కీప్ ఇట్ అప్

మాలా కుమార్ said...

శివాని చాలా బాగా రాసావు . చివరలో ట్విస్ట్ చూసి ముందుకు సాగలేదు . కష్టపడి చదివి అమ్మయ్య అనుకున్నాను . బాగుంది .

ఇందు said...

శివ...కొంచెం లేట్ గా చదివా మీ పోస్ట్! సింప్లీ సూపర్బ్! చివర్లో కొంచెం బాధేసినా....తరువాత హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా! మీ రైటింగ్ స్టయిల్ చాలా బాగుంటుంది! ఎందుకు మీరు వెంటవెంటనే రాయరూ??? నేను కిరణ్ పార్టీనే(ఈ ఒక్క విషయంలో ;) ) మీ ఫాన్స్ అసోసియేషన్ మెంబరుగా మీరు నెలకి ఒక్క పోస్టయినా రాయాలని డిమాండింగ్ అధ్యక్షా!

శివరంజని said...

@మంచు గారు మీ మీద నాకు దయ కలగడమేమిటండి బాబు మీకే మా మీద దయ కలిగింది ..అందుకే లెజెండ్ అయినా మీరు వచ్చి నా బ్లాగ్ లో మొదటి కామెంట్ పెట్టడం............ చాలా గ్రేట్ కదూ .........

అవును మీరు ఇదే రోజు అందరి బ్లాగ్ లలో ఫస్ట్ కామెంట్ లు పెట్టారు ఫస్ట్ కామెంట్ వ్రతం ఏదయినా చేస్తున్నారా ?? ఏమిటి ?? ఆ వ్రత విదానం ఏమిటో మాకు చెప్పండి

శివరంజని said...

శిశిర టీచర్ నా పోస్ట్ నచ్చినందుకు మీకు ధన్య వాదములు ............ మరి చిన్న చిన్న స్లిప్ టెస్ట్ లే కాని................ మరీ సిలబస్ లో లేని కొచ్చన్స్ ఇచ్చి ఆన్సర్స్ రాయమంటే ఎలా రాసేది చెప్పు ............అందుకే చెబుతున్నా దేవుడుకి చిన్న పిల్లకి ఎగ్జామ్స్ పెట్టొద్దు........పిల్లల హక్కులు కాల రాయొద్దు అని

శివరంజని said...

@స్వీట్ మధుర నా పోస్ట్ నచ్చినందుకు థాంక్ యూ........... థాంక్ యూ

( ఆ లాస్ట్ పేరాలో అచ్చంగా నువ్వు చెప్పినట్టు నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను. హుమ్మ్.. మా అమ్మ గుర్తొచ్చింది.. నిజంగా అమ్మంటే మాత్రం అమ్మే కదా! వేరే మాటలు కూడా ఏం చెప్పలేం! :)>>>>>>>>>>>>> నిజమే కాదా ఎంతైనా మనం తెలుగు అమ్మాయిలం కదా అచ్చు అలానే ఆలోచిస్తాం అన్నమాట


మధు నా బెస్ట్ ఫ్రెండ్ కి నీ థాంక్స్ కన్వే చేసేసా కాని ....... బెత్తం తో కొట్టమని చెప్తావా ........ అసలే నా ఫ్రెండ్ పెద్ద బ్లో అవుట్ ...దానికి ఎప్పుడు కోపం వస్తుందో ఎవరికీ తెలియదు ...... నువ్వు కొట్టమని చెప్తావా చీలిపిల్లా

శివరంజని said...

@రవి కుమార్ గారు: పోస్ట్ నచ్చినందుకు మీకు మీ మిస్సెస్ కి ధన్యవాదములు ..

ఫస్ట్ టైం వంట చేసినప్పుడు ఎన్నో బాలారిష్టాలు ఎం జరిగినా సరే వంట చేయాలని ఫిక్స్ అయిపోయి వంట మొదలు పెట్టగానే పవర్ కట్ .. నైట్ టైం కదా ఆ కేండిల్ వెలుగు లో సాల్ట్ బాక్స్ అనుకుని తీసుకుని వేసేసా కాని......... . ఎంత సాల్ట్ వేసినా చప్పగానే ఉంది ఏమిటాని టేస్ట్ చేసి చూస్తె అది సర్ప్ అదన్నమాట


@శ్రావ్యా : నీ wishesh సూపర్ నాకు చాలా చాలా నచ్చింది ....మా అమ్మ తరపున కూడా నీకు థాంక్స్ ..........కాని శ్రావ్య ఆ సిట్యువేషన్ , ఆ టైం , ఆ భయం లో నేను అంత కన్నా ఏమి ఆలోచించలేదు రా .

శివరంజని said...

@తృష్ణ గారు : థాంక్ యూ ......పోస్ట్ నచ్చినందుకు అండ్ మీ విషెస్ కి

@కృష్ణప్రియ గారు: థాంక్ యూ సో మచ్ ..పోస్ట్ నచ్చినందుకు

పరుచూరి వంశీ కృష్ణ . said...

చాలా చాలా చాలా బాగుంది .....

జీవితం అనే సీరియల్ లో అమ్మడైరెక్టర్ మనం ఆర్టిస్ట్ లు ..........మీ అమ్మ చెప్పినట్టు మనం వినాలి కానిమనం చెప్పినట్టు మీ అమ్మ వినదు... వినబోదు...

మాష్టారు నా మీద కోప్పడుతున్నారు... నువ్వు బ్యాగ్ లో ఏమీ పెట్టకుతల్లోయ్ నేను తీసుకువెళ్ళను " అని ఏడుస్తుంటే ... మా అమ్మమ్మ వచ్చి... అన్నీ నువ్వు ఒక్కదానివే తినేయకు ... కొన్ని మాస్టారుకి కూడాపెడుతూ ఉండవే అని ఉచిత సలహా ఒకటి పారేసేది...

ఒక్క రోజు నేను స్కూల్ కి రాకపోతే నా ఫ్రెండ్స్ అందరూ ఎంతగానోవిలవిల్లాడిపోయి ..తల్లడిల్లిపోయి ... బెంగ పడిపోయేవారు .. నేను లేనిలోటు కనీసం నా బ్యాగ్ ని చూసయినామర్చిపోతామని... కనీసం నాబ్యాగ్‌నన్నా పంపించమని ప్రాధేయపడేవారు .

ఎప్పుడో ఒకసారి తోటకూర వేపుడు లో ఉప్పు బదులు సర్ఫ్ వేస్తే మాత్రం ...రోజూ సర్ఫ్ వేసి వండుతానా .... వేస్తే మాత్రం ఎప్పుడూ అదే కంపెనీ సర్ఫ్వేస్తానా ఏమిటి ? ... ఆ మాత్రం నాకు తెలియదా... ఏ హిందూ స్త్రీ అయినాతన వంటని విమర్శిస్తే ఒప్పుకుంటుందా ????? ఈ మాత్రం దానికే నాలోకుక్ ని ఇంతలా చిన్న బుచ్చేయాలా...హుమ్మ్

ఆ కాకిని కొట్టవే అని మా అమ్మ చెబితే వెళ్లి కాకిని కొట్టడం మానేసి .. మాఅమ్మతో చెప్పమంటావా అని దానిని బెదిరించి పంపేసేవాళ్ళం నేను.. మానాన్న ... :) :):)

..nagarjuna.. said...

పోస్ట్ చదివాక ఏం చెప్పాలోకూడా తెలీలేదు, సౌమ్యగారి మాటే ఖాయం చేసుకో మరి.

ఈ సందర్భంగా నాదో సిన్న విన్నపం నువ్వు, బులుసుగారు, తోటరాముడుగారు ఓ మాంచి స్క్రిప్టు ఏదైనా రాయాండి. నందిని రెడ్డిగారితో సినిమా తీయించేద్దాం. మీరందరూ 'ఊ' అంటే ఆంధ్రదేశం ఉలిక్కిపడిపోద్దిమరి.

Sasidhar Anne said...

Post antha navvinchi.. last lo edipincharu ga.. Amma ante anthey.. Tittina kottina anni mana meeda prema thone chesthundhi..

తులసిరామ్ said...

aa godugu sangathi vishayamlo matuku na friend okadu gurthosthannadu. vodaithe spontaneous elanti songs padi ammayilni baga edipinchevadu

డేవిడ్ said...

శివరంజని గారు చాలా బాగుందండి మీ పొస్టూ...విలైతే అప్పుడప్పు
రాస్తూ, మమ్మల్ని నవ్విస్తూ ఉండండి,

శివరంజని said...

హాయ్ ఫ్రెండ్స్ .....
నాకు lappy లేకా పోవడం వల్ల ఆఫీసు టైం లోనే వర్క్ చేయాలి ..బ్లాగ్ లు చదవాలి , బజ్జ్ లు చదవాలి , అందులో కామెంట్స్ పెట్టాలి ... ఇవన్నీ 10.30 నుండి 5.00 లోపు జరిగిపోవాలి అంటే కష్టం కదా ...
పైగా పవర్ ఉండాలి ...మా నెట్ ఉండాలి ..... హ్మం ఇన్ని కష్టాలు రంజనికి
అందుకే ఇన్నాళ్ళు నా బ్లాగ్ ఇంటికి కి నేనే గెస్ట్ అయ్యాను ........
హ్మం ఇన్నిరోజుల తరువాత కాస్త వర్క్ తగ్గింది ..నా నెట్ కూడా సహకరిస్తుంది .....
సో నేను నా బ్లాగ్ లో కామెంట్స్ పెట్టినా నా నేస్తాలందరికి రిప్లై లు పెట్టాలి ..
ఇంకా నా నేస్తాలు రాసిన పోస్ట్లన్ని చదివి వాళ్ళకి కామెంట్స్ పెట్టాలి ..........

అందుకే ఇంత లేట్ రిప్లై లు క్షమిస్తారు కదూ

శివరంజని said...

@సౌమ్యా : అసలు నీ కామెంట్ కి నాకు ఎంత సంతోషం గా ఉందొ తెలుసా ..అసలు నచ్చినవన్ని కోట్ చేసావు చూడు ఇంకా ఆనందంగా ఉంది ... ఇంతకీ జగన్నాధ రథ చక్రాలు తిడితే కాని కదలవా :ప

@ బులుసు గారు : థాంక్ యూ గురూజీ ..మీకు నచ్చిందండి టపా .........అలాంటి మాట ఇక అననులెండి ... పెద్దవారు చెప్పారంటే వినాలి కదా

@ నేస్తం : అక్కా నీ కామెంట్ ఒక పెద్ద బ్లెస్సింగ్ నాకు

@దుర్గేశ్వర గారు : మీ కామెంట్ అమ్మతనం గూర్చి వ్రాయాలంటే ఆడవారే వ్రాయాలి. అందులోనూ ఆమమతానురాగాలను ఇంత సున్నితంగా హాస్యంతో మేళవించి >>>>>>>> నేను పర్సంట్ ఏకీ భవిస్తున్నా .. థాంక్ యూ సో మచ్ యువర్ కామెంట్

శివరంజని said...
This comment has been removed by the author.
శివరంజని said...

@ జయ గారు : జయ గారు మీ కామెంట్ కి ధన్యవాదములు .......
రేపు మీ వారిని ఏమని పిలుస్తావు>>>>>>>>>> ఏమని పిలవాలబ్బా ????? ఏదయినా ట్రెడిషనల్ గా పిలుద్దామనుకుంటున్నా ... ఏమని అని అడిగొద్దు నేను పారి పోతున్నా :P

@రాజ్ కుమార్ గారు : రాజ్ గారు మీ విష్ కి నా కృతజ్ఞతలు ..... ఏమిటో మీ అంత మంచి కామెడీ రైటర్స్ పొగుడుతుంటే నిజమో పొగడ్తో తెలియడం లేదు

@ loknath kovuruగారు : నిజమే నా బెస్ట్ ఫ్రెండ్ చదివినా కామెంట్ పెట్టలేదు కదూ ...బహుసా నచ్చలేదేమో తనకి ఆ చివర లైన్స్....మీ కామెంట్ కి ధన్యవాదములు .......

శివరంజని said...

@ వేణు శ్రీకాంత్ : హమ్మయ్య చాలా రోజుల తర్వాత రాసినా..>>>>>>>>>>>>. హహహ్హహ అన్నయ్య చాల రిప్లై కూడా రోజుల తరువాతా పెడుతున్నాను ... ఏమిటి నా ఫ్రెండ్ కి బెత్తం పుచ్చుకుని కొట్టమని చెబుతావా ...... అసలు అన్నయ్య అంటే చెల్లిని కొడుతుంటే అడ్డు రావాలి :P
కాని అన్నయ్య నీ కామెంట్ నీ దీవెనలు చాల నచ్చాయి :)

@ మంచు గారు : రెండవ సారి కామెంటినందుకు , నచ్చినవి కోట్ చేసినందుకు ధన్యవాదములు మీ దీవెనలు చాల నచ్చాయి... మీ కళ్ళ నీళ్ళు తెప్పించాను ...కాని ఆ చివరి లైన్ నా మనసు లో పడిన బాధ

లోకనాథ్ said...

ధన్యవాదమ్స్ హై...

చైతన్య దీపిక said...

మీ పోస్టు ఆద్యంతం చదివించిందండి.
మీ చిన్న నాటి సంగతులు వింటుంటే చిన్నప్పుడెప్పుడో విన్న "బుడుగు" కథ కూడా గుర్తొచ్చింది
ఎంత చక్కగా వర్ణించారండి మీ చిన్న నాటి చిలిపి చేష్టలు
అలాగే మీ టపా లో చాల రాసారు
అభిమానాలు, ఆప్యాయతలు, ప్రేమలు
ఇవి అన్ని ఉన్న వాడే కదండి మనిషి అవుతాడు
అలాగే మసులో ఉన్న భావాలూ ఎవరితోనైనా చెప్పుకుంటే వాటి ఆనందం వెయ్యి రెట్లు పెరుగుతాదంట...
మీ తల్లి తండ్రుల పట్ల, మీ శ్రేయోభిలాషుల మీకున్న అంతులే ప్రేమే మీకు కలకాలం శ్రీ రామ రక్ష

పరుచూరి వంశీ కృష్ణ . said...

I wish you a happy new year Sivaranjani garu

జయ said...

ఈ కొత్త సంవత్సరం లో అయినా ఈ తెలుగమ్మాయి వస్తుందటనా మరి. హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Found In Folsom said...

Andaru anni comments lo anni raasesaru...kothaga cheppedi emi ledu....Chala baavundi ani cheppatam tappa. First time choostunna mee blog ni..inka koncham frequent ga raastu undochu kadaa...:)

శివరంజని said...

లేట్ గా రిప్లై ఇస్తున్నందుకు నేస్తాలు అందరూ క్షమించాలి ..మా ఆఫీస్ లో బ్లాగ్ బ్లాక్ చేసారు ..అందుకే బ్లాగ్ లో కనిపించడం మానేసా ..... ఇప్పుడు నేను కూడా లాపీ కొనుక్కున్నా అందుకే ఇలా వచ్చేసా

@SHANKAR.S గారు ..ఎర్రబస్ కదండి అందుకే లేట్ ....ధన్యవాదములు ... హహహ మాష్టారు చెప్పారు కదా ఇంకెప్పుడు అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడను రాయను లెండి :))).Thanks your concern :))

@ గిరీష్ గారు ధన్యవాదములు .... నా పోస్ట్ నచ్చినందుకు నచ్చినవి కోట్ చేసినందుకు ... మీ మనస్పూర్తిగా అందించిన ఆశీస్సులకి :))))

మీరు పి.వి.నరసింహారావు క్లాస్‌మేటా, చెప్పనేలేదు సుమీ.. :)>>>>>>>>>>>> అవును సి నారాయణ రెడ్డి L.K.G లో క్లాస్మేట్ కూడా :))))

శివరంజని said...

@సౌమ్యా : ఈ నీ కామెంట్ ఎప్పటికీ మర్చిపోలేను తెలుసా
అసలు ఎంత బూస్తింగ్ ఇచ్చావ్ అమ్మాయి ...ఇన్నాళ్ళు నన్ను అభిమానం తో నా చేత రాయించడానికి అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అని అనుకునేదాన్ని కాని మరి అంత పొడిచేసేలా రాసేస్తాను అని ఎప్పుడు అనుకోలేదు .... అంటే ఇప్పుడు అనుకుంటున్నాను అని కాదు.... కాకపొతే రెండో సారి చదివాను అన్నావు చూడు నిజంగా నాకు మంచి బూస్టింగ్ తెలుసా ...... నా ఫ్రెండ్స్ అందరికి చూపించేసా నా పోస్ట్ కాదు .....మీ అందరి కామెంట్స్ :)))) .. thank you so much

@ కిరణ్ : శివరంజని ఫాన్స్ association ??????? ఇంకా నయం నీ పెయింటింగ్స్ కి నేనే ఒక కిరణ్ associationపెట్టాను తెలుసా ... నీకు అంత నచ్చినందుకు చాలా థాంక్స్ కిరణ్

@ వంశీ గారు : ధన్యవాదములు మీ హార్ట్ఫుల్ విషెస్ కి:))))))) .............
inthakee antha pedda post antha humorous ga raayadam chaala great,,!!! simply superb >>>>>>>>>>>>> అది కాదు గ్రేట్ మీరు ఇంత పెద్ద కామెంట్ రాయడమే నిజంగా గ్రేట్ thank you so much

శివరంజని said...

@ చైతన్య.ఎస్ గారు : ధన్యవాదములు మీ హార్ట్ఫుల్ విషెస్ కి:)) ఇప్పుడు అంతా బాగానే ఉందిగా కంగారు ఏమి లేదు ..once again thank you so much

@రాధిక కిరణ్మయి గారు : ధన్యవాదములు మీకు అంతగా నచ్చినందుకు ...అవును మరి అమ్మని చూడడానికి వెళ్ళారా మరి :)))))))

@ హరే కృష్ణ గారు : ధన్యవాదములు మీకు అంతగా నచ్చినందుకు ... అంతే అంటారా ... ఇంకా నయ్యం ఈ కామెంట్స్ కి రిప్లై లు పెట్టడానికే పది నెలలు పట్టింది ...ఇంకా నేను పోస్ట్ రాయడానికి ఎంత టైం పడుతుందో చూడండి ..కాబట్టి దానికి ఇంకో పది నెలలు వేసుకోండి :P


@విక్రం గారు : ధన్యవాదములు మీకు అంతగా నచ్చినందుకు ... మీ హార్ట్ఫుల్ విషెస్ కి:)) సరే ఇంకెప్పుడూ అలాంటి పెద్ద మాటలు మాట్లడనులెండి అందరూ తిడుతున్నారు ఇంకా మాట్లాడితే కొట్టినా కొడతారు :)))))))))))))

శివరంజని said...

@ chinna reddy గారు : ధన్యవాదములు మీకు అంతగా నచ్చినందుకు ... మీ హార్ట్ఫుల్ విషెస్ కి:)) అంతే అంటారా టాలెంట్ ఉందంటారా ... అప్పుడప్పుడు మోకాలు చురుకుగా పని చేస్తూ ఉంటుంది దాని ఎఫేక్టే నండి ఇది :)))))

@మాలా కుమార్గారు : ధన్యవాదములు మీకు అంతగా నచ్చినందుకు ... మీ హార్ట్ఫుల్ విషెస్ కి:))

@ ఇందు: ధన్యవాదములు మీకు అంతగా నచ్చినందుకు ... మీ హార్ట్ఫుల్ విషెస్ కి:)) మీరు మీరు అనకు ఇందు కష్టం గా ఉంది ఏకవచనం లో పిలవచ్చు ఎంచక్కా :) ఇంకా నీ డిమాండ్ ని
నేరవేర్చలేను ఏమో అని డౌట్ గా ఉంది ఇందు ..నన్ను క్షమించు ఇందు క్షమించు

శివరంజని said...

@పరుచూరి వంశీ కృష్ణ గారు : ధన్యవాదములు మీకు అంతగా నచ్చినందుకు ...నచ్చినవి కోట్ చేసినందుకు.......... మీ అబిమానం మర్చిపోలేనిదండి ప్రతీ పోస్ట్ తప్పకుండా చదివి ఎక్కడున్నా కామెంట్ పెట్టి వెళతారు thank you sooooooooooooooooooooooooooooooo much

@ నాగార్జున గారు : ధన్యవాదములు మీకు అంతగా నచ్చినందుకు ........... నేను డాం అని పడిపోయా మీ కామెంట్ కి

ఈ సందర్భంగా నాదో సిన్న విన్నపం నువ్వు, బులుసుగారు, తోటరాముడుగారు ఓ మాంచి స్క్రిప్టు ఏదైనా రాయాండి. నందిని రెడ్డిగారితో సినిమా తీయించేద్దాం. మీరందరూ 'ఊ' అంటే ఆంధ్రదేశం ఉలిక్కిపడిపోద్దిమరి. >>>>>>>>

మరేమో అంటే బులుసుగారు, తోటరాముడుగారు పక్కన నిలబడే అంత talented పర్సన్ ని నేను కాదు కాబాట్టి నా మాట విని ఆ పక్కన రాజ్ కుమార్ అనే బ్లాగర్ ఉన్నారు తనని తీసుకెళ్ళండి....... ఆ వీళ్ళ ముగ్గురు కలిస్తే నిజంగానే ఆంద్రప్రదేశ్ ఉలిక్కిపడే అంత బాగా రాయగలరు

అయినా తోటరాముడుగారు తో పోలికేమిటండి బాబు ..అంత గొప్ప రైటర్ తో .... తోట రాముడికి నేను Fan ని A.C ని కాబట్టి ఇలా ఫేన్ గా బ్రతికేయడమే తప్పా తోట రాముడి పక్కన పోల్చుకోకూడదు :))))

శివరంజని said...

@Sasidhar Anne గారు :ధన్యవాదములు మీకు అంతగా నచ్చినందుకు ...... కరెక్ట్గా చెప్పారు అమ్మ అంటే అంతే కదా మరి

@తులసిరామ్ గారు నిజామా ఇంటరెస్టింగ్ పాయింట్ ...కామెంట్ నందుకు ధన్యవాదములు :))))))

@డేవిడ్ గారు ధన్యవాదములు మీకు అంతగా నచ్చినందుకు ... రాయలండి కొత్త పోస్ట్ కాని ఏమిటో

@చైతన్య దీపిక గారు : ధన్యవాదములు మీకు అంతగా నచ్చినందుకు........మీ హర్ట్ఫుల్ విషెస్ కి మరొక్కసారి ధన్యవాదములు

..అలాగే మసులో ఉన్న భావాలూ ఎవరితోనైనా చెప్పుకుంటే వాటి ఆనందం వెయ్యి రెట్లు పెరుగుతాదంట..>>>>>>>>>>>> హహహ్హ మీ కామెంట్ కి మాత్రం నా ఆనందం వెయ్యి రెట్లు పెరిగింది . మీ అభిమానానికి thank you so much

శివరంజని said...

@పరుచూరి వంశీ కృష్ణ గారు : ధన్యవాదములుమీకు కూడా నందన నామ సంవత్సర శుభాకాంక్షలు

@ జయ గారు ధన్యవాదములు మీకు కూడా నందన నామ సంవత్సర శుభాకాంక్షలు
ఈ కొత్త సంవత్సరం లో అయినా ఈ తెలుగమ్మాయి వస్తుందటనా మరి. >>>>>>>>>>>>>> వస్తుందా అంటే ఏమో మరి అసలే బద్ధకం ఎక్కువ ఈ తెలుగమ్మాయి కి అది సరే కాని ఇది ఆర్డర్ ???? రిక్వెస్ట్ ?????

హుమ్మ్ రిక్వెస్ట్ అయితే మొండిగా రాను అని చెబుతా :P.. అదే ఆర్డర్ అయితే భయంతో వస్తా అని చెబుతా :P

శివరంజని said...

@ Found In Folsom గారు : ముందుగా నా బ్లాగ్ కి సుస్వాగతం..... మీ పేరు ఇదే మొదటి సారి వినడం ..... మీ బ్లాగ్ చదవాల్సి ఉంది .....

నా పోస్ట్ లు ఫస్ట్ టైం చదవగానే నే మీకు నచ్చడం సంతోషంగా ఉంది...... ధన్యవాదములు మీకు అంతగా నచ్చినందుకు . frequent గా రాయక పోవడానికి బద్ధకం ఎక్కువ అండి :(( తప్పకుండా ప్రయత్నిస్తా :)))))))

వెంకట రాజారావు . లక్కాకుల said...

అమ్మా నాన్నల లోనూ
కమ్మని హాస్యమును చూడ గల్గిన తల్లీ !
చెమ్మగిలె కనులు , మీహృద
యమ్మున స్వచ్చతలు చూసి , ఆనందముతో

బ్లాగు సుజన-సృజన

శివరంజని said...

వెంకట రాజారావు
గారు నమస్కారమండి ....... ముందుగా నా బ్లాగ్ కి సుస్వాగతం .......... మీ కామెంట్ చూసిన క్షణం ఎంత ఆనందం కలిగిందో చెప్పలేను.. ఆ ఆనందం ఇంకా అలాగే ఉంది .. నాకు కవితలు రావు అందుకే కవిత రూపం లో చెప్పలేకపోతున్న నా ఆనందాన్ని ...ఇంత మంచి ప్రశంస అందుకుంటానని ఊహించలేదు ....... నా ఈ పోస్ట్ ధన్యమయింది మాష్టారు .... త్రాసు తీసుకుని నా బ్లాగ్ ఒక దానిలో మీ కామెంట్ మరో దానిలో వేస్తే మీ కామెంట్ ముందు నా బ్లాగ్ తెలిపోతున్దేమోనండి ధన్యవాదములు మీకు అంతగా నచ్చినందుకు